NTR Family Visits Tirumala: తిరుమలలో ఎన్టీఆర్ ఫ్యామిలీ - వేంకటేశ్వరుని దర్శించుకున్న తారక్ తల్లి, సతీమణి
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యామిలీ తిరుమల వెళ్లారు. ఏడు కొండల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.
Continues below advertisement

ఎన్టీఆర్ సతీమణి ప్రణతి, కుమారుడు అభయ్ రామ్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యామిలీ ఈ రోజు తిరుమల వెళ్లారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో ఏడు కొండల వేంకటేశ్వరునిని దర్శించుకున్నారు. ఎన్టీఆర్ సతీమణి ప్రణతి, పిల్లలు అభయ్ రామ్, భార్గవ్ రామ్, ఎన్టీఆర్ తల్లి షాలిని తదితర కుటుంబ సభ్యులు స్వామి వారి సేవలో పాల్గొని, మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వారికి అర్చకులు వేదాశీర్వచనం అందించగా... ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి, స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.
Continues below advertisement
కుటుంబ సభ్యులతో ఎన్టీఆర్ కనిపించలేదు. బహుశా... 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' ప్రచార కార్యక్రమాల్లో ఆయన బిజీగా ఉన్నారు. ఈ సినిమా మార్చి 25న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్, రామ్ చరణ్, ఆలియా భట్ మీద చిత్రీకటించిన 'ఎత్తర జెండా' పాటను మంగళవారం విడుదల చేశారు.
Continues below advertisement