Rohan Roy: తెలుగు ఫిల్మ్‌ ఇండస్ట్రీలోకి అలీ వారసుడు వచ్చేశాడు. నటనలోనే కాదు హావాభావాల్లోనూ అలీని మక్కీకి మక్కీ దించేస్తున్నాడు. తనదైన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసేస్తున్నాడు. సినీ క్రిటిక్స్‌ సైతం నోరెళ్లబెట్టేలా తన నటనతో మెప్పిస్తున్నాడు.  యాక్టింగ్‌లో దుమ్మురేపడమే కాదు.. డైలాగ్‌  డెలివరీలోనూ తనదైన పంథాలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టాడు. సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తూ.. మెయిన్‌ మీడియా కెమెరాలను తనవైపు తిప్పుకుంటూ టాక్‌ ఆఫ్‌ ది టాలీవుడ్‌ గా నిలుస్తున్నాడు.

    


టాలీవుడ్ లో టాలెంట్‌కు కొదువ లేదు. ఎప్పటికప్పుడు ఎవరో ఒకరు తమ కళానైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ వెండితెరను పండిస్తున్నారు. ప్రస్తుతం కొత్త జనరేషన్ కూడా తమ సత్తాను చాటుతున్నారు. ట్వంటీ ఫోర్‌ క్రాఫ్ట్‌లోనూ ప్రతిభను చాటుతున్నారు. డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి యాక్టర్స్ వరకు యంగ్ టాలెంట్ తో ఆడియన్స్ ని ఆకట్టుకుంటూ వస్తున్నారు. ఈక్రమంలోనే కొంతమంది చైల్డ్ ఆర్టిస్ట్‌లు చిన్న వయసులోనే తమ యాక్టింగ్‌తో అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు. తమ నటనతో  సినిమా సక్సెస్ లో భాగం అవుతున్నారు. అలాంటి వారిలో రోహన్‌  రాయ్‌ ముందు వరసలో ఉన్నాడు.  ఇటీవల వచ్చిన 90s  ఫ్యామిలీ వెబ్ సిరీస్ లో తన నటనా విశ్వరూపాన్ని చూపించి సినిమా విజయంలో కీ రోల్‌ పోషించారు రోహన్‌రాయ్‌.

మిడిల్ క్లాస్ బయోపిక్ అంటూ 90s బ్యాక్ డ్రాప్ లో  వచ్చిన ఈ సిరీస్ ప్రతి ఒక్కర్ని ఆకట్టుకుంది. మరి ముఖ్యంగా రోహన్ పోషించిన పాత్ర చాలా మంది నైంటీస్‌ కిడ్స్ కి కనెక్ట్ అయ్యింది. సాంప్రదాయిని,  దుప్పిని, సుద్దపూసని అంటూ సాగే ఆ పాత్ర ప్రతి ఒక్కర్ని ఆకట్టుకుంది. సరిగ్గా చదువు రాక ఇంటిలో, స్కూల్ లో ఇబ్బందులు పడుతూనే అందరిని నవ్వించి.. చాలా మందికి తమ పాత రోజులను గుర్తు చేశాడు. ఈ సిరీస్ తో రోహన్ పేరు ప్రస్తుతం టాలీవుడ్‌లో గట్టిగా వినిపిస్తుంది. ఇక అవకాశాలు కూడా రోహణ్‌ రాయ్‌కు క్యూ కట్టినట్టు టాలీవుడ్‌  టాక్‌.


అచ్చం అప్పటి అలీలా..


రోహన్‌ రాయ్‌ నటన చూస్తుంటే అప్పట్లో బాల నటుడిగా అలీ చేసిన సందడి గుర్తుకొస్తుందంటున్నారు సినీ ప్రేక్షకులు. 1981లో వచ్చిన సీతాకొకచిలుక సినిమాలో అలీ కామెడీ అందర్నీ కడుపుబ్బా నవ్వించింది.  అందులో ఆలీ బాలనటుడిగానే కామెడీ పండించాడు. పెళ్ళి సంబంధం మాట్లాడటానికి విలన్ అయిన శరత్ బాబు ఇంటికి హీరో కార్తీక్ స్నేహితులతో పాటు, బాలుడైన ఆలీ పంచే కట్టుకుని, తాంబూలం ఉన్న పళ్ళెం చేతబట్టుకొని పోవటం, తీరా శరత్ బాబును చూడగానే ఆలీ పంచె తడిపేసుకోవటం కడుపుబ్బ నవ్విస్తుంది. అప్పట్లో ఈ సినిమా సూపర్‌ హిట్‌ అయిన విషయం అందరికీ తెలిసిందే. సీతాకోకచిలుక సినిమా యాక్షన్, డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో కార్తీక్ ముత్తురామన్, అరుణ ముచ్చెర్ల, శరత్ బాబు, సిల్క్ స్మిత, జగ్గయ్య, డబ్బింగ్ జానకి, రాళ్ళపల్లి, అలీ తదితరులు నటించారు. ఈ సినిమాకి భారతీరాజా డైరెక్షన్‌ చేయగా..  పూర్ణోదయా మూవీస్ వారు తెరకెక్కించారు. ఈ మూవీకి సంగీతం ఇళయరాజా అందించారు. ఈ సినిమలో అలీ నటన ఎలా ఉందో రోహన్‌ రాయ్‌ నటన కూడా అలాగే ఉందని ఎట్టకేలకు తెలుగు ఫిల్మ్  ఇండస్ట్రీ కి అలీ వారసుడు దొరకాడని ప్రేక్షకులు సంబరపడుతున్నారు.


మెగాపవర్‌ స్టార్‌ రాంచరణ్‌ బ్లాక్‌  బస్టర్‌ మూవీ వినేయ విధేయ రామ సినిమాతో  సినీ ఆరంగ్రేటం చేశాడు రోహణ్‌ రాయ్‌. తర్వాత రాచ్చసి, సంగీత పాఠశాల, తెలిసినవాళ్లు లాంటి పలు సినిమాల్లో యాక్ట్ చేశారు. ఇప్పటి వరకు రామ్ చరణ్, జ్యోతిక, మమ్ముట్టి, శ్రియా శరణ్, షణ్ముఖ్ జస్వంత్ లాంటి  ప్రముఖ నటులతో కలిసి తెరపంచుకున్నాడు. చిత్రపురి మరియు విశాఖ ఫిల్మ్ ఫెస్టివల్‌లో బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డులు గెలుచుకున్నాడు రోహణ్‌రాయ్‌.


ALSO READ: ‘హనుమాన్’ ఖాతాలో మరో రికార్డ్ - 92 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా!