Sree Vishnu's Single Sequel Confirmed: శ్రీ విష్ణు ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్ 'సింగిల్' బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ మూవీకి సీక్వెల్ కూడా ఉంటుందని క్లైమాక్స్‌లో ట్విస్ట్ ఇచ్చారు శ్రీ విష్ణు. దీంతో ఈ కామెడీ అలానే కంటిన్యూ అవుతుందా.. స్టోరీ ఎలా ఉండబోతోంది? అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.
ట్రయాంగిల్ లవ్ స్టోరీ.. సింగిల్‌గానే..
ఈ మూవీలో ట్రయాంగిల్ లవ్ స్టోరీని కామెడీ జానర్‌లో చూపించారు. సాధారణంగా ట్రయాంగిల్ లవ్ స్టోరీ అంటేనే క్లైమాక్స్‌లో ఎండింగ్ పడిపోతుంది. కానీ 'సింగిల్' (Single) మూవీలో డిఫరెంట్‌గా సీక్వెల్ ఉంటుందనే హింట్ ఇస్తూ శుభం కార్డు వేశారు శ్రీవిష్ణు. మరి స్టోరీ ఎలా ఉండబోతోందనేదే ఇప్పుడు లేటెస్ట్ బజ్.
ప్రస్తుతం రీ రిలీజెస్, సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తోంది. ఇదే కామెడీ జానర్‌లో వచ్చిన 'మ్యాడ్' సీక్వెల్.. 'మ్యాడ్ స్క్వేర్' కూడా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ సాధించింది. ఇప్పుడు అదే పంథాను శ్రీ విష్ణు ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. 'సింగిల్' టైటిల్‌కు తగ్గట్లుగానే స్టోరీని ముగించి రెండో పార్ట్‌కు లీడ్ ఇచ్చారు. త్వరలోనే దీనిపై అధికారికంగా పూర్తి వివరాలు వెల్లడయ్యే ఛాన్స్ ఉంది.
Also Read: బాలయ్య 'అఖండ 2'లో సీనియర్ హీరోయిన్ లయ కుమార్తె - ఆ వార్తల్లో నిజమెంత?
'సింగిల్' మూవీని కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వం వహించగా.. కేతిక శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటించారు. వెన్నెల కిశోర్ కీలక పాత్ర పోషించారు. గీతా ఆర్ట్స్ అధినేత, మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో కళ్యా ఫిలిమ్స్ సంస్థతో కలిసి విద్య కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి సంయుక్తంగా నిర్మించారు.
స్టోరీ ఏంటంటే?
ఎఫ్‌డీసీ బ్యాంకు ఉద్యోగిగా ఉన్న విజయ్ (శ్రీ విష్ణు) తన స్నేహితుడు అరవింద్ (వెన్నెల కిశోర్) లవ్‌కు హెల్ప్ చేస్తూ పూర్వ (కేతికా శర్మ)ను చూసి ప్రేమలో పడతాడు. ఆమె ఓ కారు షోరూంలో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తుంది. పూర్వను ప్రేమలో పడేసేందుకు తనదైన ప్లాన్స్ వేస్తుంటాడు విజయ్. అయితే, ఆ ప్లాన్స్ బెడిసికొట్టి హరిణి (ఇవానా) అతనితో ప్రేమలో పడుతుంది. తనను ప్రేమించాలంటూ విజయ్ వెంటపడుతుంది.
విజయ్ మాత్రం పూర్వాను ప్రేమిస్తాడు. ఆమెతో పరిచయం పెంచుకొని లవ్‌లో పడేయాలని కార్ షోరూంకు వెళ్తాడు. కార్ కొంటానని ఆ అమ్మాయితో ట్రావెల్ చేస్తాడు. చివరకు అసలు విషయం చెప్తాడు. అప్పుడు విజయ్‌ను పూర్వ ఛీ కొడుతుంది. అప్పటి నుంచి అతడిని దూరం పెడుతుందని అనుకుంటే... మళ్లీ విజయ్ దగ్గరకు పూర్వ వస్తుంది. ఎందుకు? ఇదే సమయంలో హరిణి విజయ్ వెంటపడుతుంది. మరి ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ చివరకు ఎలా ముగిసింది? పూర్వను విజయ్ ప్రేమలో పడేశాడా? హరిణి లవ్ సక్సెస్ అయ్యిందా? ఎప్పుడూ విజయ్ వెంట ఉండే అతని స్నేహితుడు అరవింద్ (వెన్నెల కిషోర్) ఏం చేశాడు? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే. శ్రీ విష్ణు, వెన్నెల కిశోర్ కామెడీ టైమింగ్, డైలాగ్స్ మూవీకే హైలెట్ అని అంటున్నారు.