Allu Arjun Meets Aamir Khan: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్‌ను కలిశారు. ముంబైలోని ఆమిర్ నివాసానికి వెళ్లిన బన్నీ ఆయనతో కలిసి కాసేపు ముచ్చటించారు. ఈ ఫోటో వైరల్ అవుతుండగా.. పలు రూమర్స్ హల్చల్ చేస్తున్నాయి. వీరిద్దరి కాంబోలో మూవీ వస్తుందా.. లేదంటే వేరే మూవీ కోసం చర్చించేందుకు కలిశారా? అనే క్రేజ్ నెలకొంది.

అయితే.. ప్రస్తుతం ఆమిర్ ఖాన్ (Aamir Khan) 'సితారే జమీన్ పర్' సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత తన డ్రీమ్ ప్రాజెక్ట్ 'మహా భారతం' (Maha Bharatam) తీయాలని చూస్తున్నారు. ఇటీవలే దీని గురించి ఆయన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇందులో స్టార్ హీరోస్ భాగం కానున్నట్లు చెప్పారు. దీంతో బన్నీ ఈ సినిమాలో నటించనున్నారా?, ఒకవేళ చేస్తే ఏ రోల్ చెయ్యొచ్చు అంటూ సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. అటు.. బీటౌన్‌లోనూ బన్నీ, అమీర్ మీటింగ్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.

Also Read: '#సింగిల్' రివ్యూ: శ్రీవిష్ణు హిట్టు కొట్టాడా? ట్రయాంగిల్ లవ్ స్టోరీ బావుందా? కామెడీ బావుందా?

కృష్ణుడి రోల్‌లో ఆమిర్

తన డ్రీమ్ ప్రాజెక్ట్ 'మహా భారతం' అంటూ ఆమిర్ ఖాన్ ఇప్పటికే పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు. ఇలాంటి సినిమాలు ఎప్పటికీ నిరాశపరచవని.. దీని కోసం ఎంతో కష్టపడాలని అన్నారు. 'మహా భారతం'లో కృష్ణుడి పాత్ర తనను ఎంతో ప్రభావితం చేసిందని.. అవకాశం వస్తే ఆ క్యారెక్టర్‌లో కనిపించాలనుకుంటున్నట్లు చెప్పారు. ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్ అని.. ఇప్పుడే దీని గురించి ఎలాంటి వివరాలు చెప్పలేనని అన్నారు. స్క్రిప్ట్ రైటింగ్‌కే కొన్నేళ్లు పడుతుందని.. ఈ ఏడాదే దీని పనులు ప్రారంభించాలని అనుకుంటున్నట్లు తెలిపారు.

ఒకే సినిమాలో 'మహా భారతం' చూపించలేమని.. అందుకే సిరీస్‌లుగా దీన్ని అందించాలని నిర్ణయించుకున్నట్లు ఆమిర్ చెప్పారు. ఈ మూవీ కోసం ఓ టీంను సిద్ధం చేసే పనిలో ఉన్నట్లు వెల్లడించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి తాము ఎన్నో విషయాల గురించి అన్వేషిస్తున్నామని.. ఏం జరుగుతుందో చూడాలి అంటూ కామెంట్ చేశారు. దీంతో ఈ సినిమాపై చాలా క్రేజ్ నెలకొంది. స్టార్ హీరోలు భాగం కానున్నారన్న ఆమిర్ కామెంట్స్ నేపథ్యంలో ఏ క్యారెక్టర్‌లో ఎవరు నటిస్తారో అనేది అంతా ఆసక్తిగా మారింది. అయితే, పూర్తి వివరాల కోసం ఇంకొంత కాలం ఎదురు చూడక తప్పదు.

అట్లీ మూవీ కోసం బన్నీ..

'పుష్ప 2' స్టైల్ నుంచి ఎప్పుడో బయటకు వచ్చిన బన్నీ ప్రస్తుతం స్టైలిష్ లుక్‌లో అదరగొడుతున్నారు. అట్లీ మూవీ కోసమే ఈ లుక్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ మూవీని 'AA22XA6' వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిస్తుండగా.. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. మూవీలో బన్నీ డ్యుయల్ రోల్ చేయనున్నారనే వార్తలు వస్తున్నాయి. హై - ఆక్టేన్ పాన్ - ఇండియా ఫీచర్ ఫిల్మ్‌ నిర్మించబోతున్నామంటూ సన్ పిక్చర్స్ నిర్మాత కళానిధి మారన్ చెప్పగా.. ఆఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుంచీ భారీ హైప్ నెలకొంది. మూవీలో భారీ వీఎఫ్ఎక్స్ ఉండనున్నట్లు తెలుస్తుండగా.. ఇందుకోసం అంతర్జాతీయ వీఎఫ్ఎక్స్ కంపెనీతో మూవీ టీం పని చేయనున్నట్లు సమాచారం.