Chiranjeevi's Mega 157 Movie Update: మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి 'మెగా 157' మూవీ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుంచీ భారీ హైప్ నెలకొంది. ఈ మూవీ అప్ డేట్స్ కోసం మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారికి గుడ్ న్యూస్ అందించేలా ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతోంది.

షూటింగ్ అప్పుడే స్టార్ట్?

ఈ సినిమా షూటింగ్ ఈ నెల 22న ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) ప్రస్తుతం తన టీంతో కలిసి స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం లండన్ టూర్‌లో ఉన్న చిరంజీవి తిరిగి వచ్చిన తర్వాత మూవీ టీంతో కలిసి సమావేశం కానున్నారు. ఆ తర్వాత కొన్ని కీలక సీన్స్‌తో పాటు ఓ సాంగ్ షూటింగ్ చేయనున్నారనే టాక్ వినిపిస్తోంది. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి మెగా హిట్ ఖాయమంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్.. హీరో, హీరోయిన్, దర్శకుడెవరో చెప్పేసిన మెగాస్టార్ చిరంజీవి

ఇద్దరు హీరోయిన్లు

ఈ సినిమాలో మెగాస్టార్ సరసన.. స్టార్ హీరోయిన్ నయనతార (Nayanthara) నటించనున్నట్లు తెలుస్తోంది. ఓ కీలక రోల్ కోసం మూవీ టీం ఆమెను సంప్రదించగా భారీగా రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నిర్మాతలు ఆమెతో చర్చలు జరుపుతున్నారు. మూవీలో ఆమె రోల్‌తో పాటు టైమింగ్ కూడా ఎక్కువ ఉన్నట్లు తెలుస్తుండగా.. రూ.18 కోట్లు డిమాండ్ చేశారనే టాక్ వినిపిస్తోంది. భారీ బడ్జెట్ చిత్రాలకు నయనతార రూ.10 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటారు. అయితే, రోల్ ఇంపార్టెన్స్, నిడివి దృష్ట్యా ఇంత భారీగా డిమాండ్ చేశారని సమాచారం. ఒకవేళ, ఇదే నిజమైతే సౌత్‌లోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న నటి నయన్ అవుతారు.

యంగ్ హీరోయిన్ కూడా..

మరోవైపు.. ఈ మూవీలో యంగ్ హీరోయిన్ కేథరిన్ కూడా నటించనున్నారనే టాక్ వినిపిస్తోంది. అయితే, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అల్లు అర్జున్ 'సరైనోడు' మూవీలో ఎమ్మెల్యేగా నటించిన కేథరిన్.. తెలుగు ఆడియన్స్‌కు మరింత దగ్గరయ్యారు. ఆ తర్వాత బింబిసార, మాచర్ల నియోజకవర్గం, వాల్తేరు వీరయ్య , నేనే రాజు నేనే మంత్రి వంటి మూవీస్‌లో నటించి మెప్పించారు. ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ పక్కనే ఛాన్స్ కొట్టేశారనే టాక్ వినిపిస్తోంది.

అలాగే, సినిమాలో మెగాస్టార్‌కు ఓ సిస్టర్ రోల్ ఉందని ఇది చాలా కీలకమని టాక్ వినిపిస్తుండగా.. దీని కోసం మరో హీరోయిన్ జ్యోతికను తీసుకుంటున్నారనే రూమర్ వినిపిస్తోంది. దీనిపై కూడా క్లారిటీ రావాల్సి ఉంది. వరుస హిట్లతో మంచి జోష్‌లో ఉన్న అనిల్ రావిపూడి మెగాస్టార్‌తోనూ బిగ్గెస్ట్ హిట్ కొట్టాలని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

చిరు రోల్‌పై ఆసక్తి

ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీలో మెగాస్టార్ రోల్ ఏంటనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. చిరంజీవి అసలు పేరు శివ శంకర్ వరప్రసాద్ కాగా.. అదే పేరు సినిమాలో కూడా ఉంటుందని డైరెక్టర్ అనిల్ ఇదివరకే తెలిపారు. 'రా' ఏజెంట్‌గా మెగాస్టార్ కనిపించనున్నారనే టాక్ వినిపిస్తోంది.