తెరపై కనిపించేది అంతా నిజం కాదు! ఓ సీన్ ఇటలీలో జరుగుతుందంటే... హీరో హీరోయిన్లు ఇటలీ వెళ్లి షూటింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఇండియాలో గ్రీన్ మ్యాట్ మీద షూట్ చేసి విజువల్ ఎఫెక్ట్స్ ద్వారా స్క్రీన్ మీద ఇటలీలో ఉన్నట్లు చూపించవచ్చు. ఇప్పుడు ఇంకా అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చింది. గ్రీన్ మ్యాట్ స్థానంలో ఎల్ఈడీ స్క్రీన్లు వచ్చాయి. అన్నపూర్ణ స్టూడియోస్‌, క్యూబ్‌ సినిమా ఈ సాంకేతికను హైదరాబాదులో అందుబాటులోకి తీసుకు వచ్చాయి. 


ఇప్పుడు హైదరాబాదులో 'ది ఎయన్నార్‌ వర్చువల్‌ ప్రొడక్షన్‌ స్టేజ్‌'ను అన్నపూర్ణ స్టూడియోస్‌, క్యూబ్‌ సినిమా ఏర్పాటు చేశాయి. 'స్టేట్‌ ఆఫ్‌ ది ఆర్ట్ ఐసీవీఎఫ్‌ఎక్స్' (ఇన్‌ కెమెరా విజువల్‌ ఎఫెక్ట్స్)తో ఫిల్మ్ మేకర్స్ ప్రొడక్షన్‌ ప్రాసెస్ మరింత ఈజీ అవుతుంది. అక్టోబర్‌ 2022 నుంచి ది ఎయన్నార్‌ వర్చువల్‌ ప్రొడక్షన్‌ స్టేజ్‌ దీనిపై రకరకాల ప్రయోగాలు  చేస్తోంది. ఆల్రెడీ కొన్ని సినిమాలు, యాడ్స్, మ్యూజిక్‌ వీడియోలను షూట్‌  చేసింది. అన్నిటినీ పరిశీలించిన తర్వాత, క్వాలిటీ బావుందని అనుకున్న తర్వాత... దర్శక, నిర్మాతలకు దీనిని అందుబాటులోకి తీసుకు వచ్చారు. 


అన్నపూర్ణ స్టూడియోస్, క్యూబ్ సినిమా ఏం అందుబాటులోకి తెచ్చాయి? అంటే... కటింగ్‌ ఎడ్జ్, హై బ్రైట్‌నెస్‌, 60 అడుగుల వెడల్పు, 20 అడుగులు ఎత్తు , 2.3 మిల్లీ మీటర్ల డాట్‌ పిచ్ (అల్ట్రా హై రెఫ్రెష్‌ రేట్‌, వైడ్‌ కలర్‌ గమట్‌)  ఉన్న ఎల్‌ఈడీ వాల్‌ స్పాన్నింగ్‌! అన్నిటికీ మించి ఆటో లెడ్‌ డిస్‌ప్లేలు కూడా! రెడ్‌ స్పై, పవర్‌ ఫుల్‌ కస్టమ్‌ బిల్ట్ రెండరింగ్‌ సిస్టమ్స్, అన్‌ రియల్‌ ఇంజిన్‌తో కాంప్లెక్స్ ఫొటో రియలిస్టిక్‌ వర్చువల్‌ లొకేషన్స్ ని రియల్‌ టైమ్‌ రెండరింగ్‌ చేయడం వంటివి కూడా అందుబాటులో ఉన్నాయి. 


అందరికీ అర్థం అయ్యేలా చెప్పాలంటే... గ్రీన్ మ్యాట్ బదులు, ఆ స్థానంలో ఎల్ఈడీ స్క్రీన్లు ఉంటాయి. అందులో వీడియో ప్లే అవుతూ ఉంటుంది. దాని ముందు ఆర్టిస్టులు ఉంటారు. సన్నివేశానికి తగ్గట్టు నటిస్తే చాలు... వెనుక వీడియోలో ప్లే అయ్యే ప్రాంతాల్లో సన్నివేశం తీసినట్టు ఉంటుంది. పైన చెప్పినట్టు... ఇటలీలో సన్నివేశం తీయాలనుకుంటే, ఇటలీ వెళ్లాల్సిన అవసరం లేదు. సన్నివేశానికి తగ్గట్టు లైటింగ్ & కెమెరా యాంగిల్స్ కూడా మార్చుకునే వెసులుబాటు ఈ టెక్నాలజీలో ఉంది. 


Also Read తెలుగు హీరోను డమ్మీ చేస్తే ఎలా? తమిళ క్యారెక్టర్ ఆర్టిస్టులే ఎక్కువా?


అన్నపూర్ణ స్టూడియోస్‌, క్యూబ్‌ సినిమా సంయుక్తంగా మొదలు పెట్టిన ఈ ప్రాజెక్ట్ యంగ్ ఫిల్మ్ మేకర్స్ తక్కువ నిర్మాణ వ్యయంలో క్రియేటివిటీగా సినిమా లేదంటే వెబ్ సిరీస్ తీయడానికి ఉపయోగపడుతుందని చెప్పవచు. దీని గురించి అక్కినేని నాగార్జున మాట్లాడుతూ ''మా వినియోగదారులకు కట్టింగ్‌ ఎడ్జ్ సర్వీస్ అందించడానికి ఏఎన్నార్‌ వర్చువల్‌ ప్రొడక్షన్‌ స్టేజ్‌ తనవంతు కృషి చేస్తుంది. సినిమాల నిర్మాణంలో మా బలం, మా అనుభవంతో పాటు సాంకేతిక పరిజ్ఞానంలో క్యూకున్న అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని మేం చేతులు కలిపాం. సృజనాత్మక రంగంలో ఎలాంటి సరిహద్దులు లేకుండా తెర మీద ఆవిష్కరించడానికి అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పాటు చేస్తున్నాం'' అని చెప్పారు. ''అన్నపూర్ణ స్టూడియోతో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. కంటెంట్‌ ప్రొడక్షన్‌లో ఇది కొత్త యుగం. కంటెంట్‌ ప్రొడక్షన్‌లో వర్చువల్‌ ప్రొడక్షన్‌ గొప్ప డెవలప్మెంట్'' అని  క్యూబ్‌ సినిమా కో ఫౌండర్‌ పంచపకేశన్‌ అన్నారు.


Also Read పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ బైక్స్ & కారుకు సేమ్ నంబర్, సమంత కారుకూ... హరీష్ శంకర్ 2425 సెంటిమెంట్!