దర్శకుడు రాంగోపాల్ వర్మ, జనసేన అధినేత, సినిమా నటుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఏపీ జగన్ ను విమర్శిస్తూ పవన్ కల్యాణ్ చేసిన ట్వీట్ కు ఆర్జీవీ ఓ రేంజిలో విరుచుకుపడ్డారు. ప్రజాసేవ అనే పదాన్ని ఉచ్చరించే అర్హత కూడా పవన్ కు లేదంటూ తీవ్ర విమర్శలు చేశారు.
సీఎం జగన్ ను టార్గెట్ చేస్తూ పవన్ ట్వీట్
ఏపీ సీఎం జగన్ ను టార్గెట్ చేస్తూ పవన్ ట్విట్టర్ లో ఓ పోస్టు పెట్టారు. ‘పాపం పసివాడు’ సినిమా పోస్టర్ ను షేర్ చేస్తూ, ఈ సినిమా ఎవరైనా ఆంధ్ర ముఖ్యమంత్రితో తీస్తే బాగుంటుందన్నారు. “మన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో ఎవరైనా ‘పాపం పసివాడు’ సినిమా తీస్తారని అశిస్తున్నాను. ఆయన చాలా ఇన్నోసెంట్. ఎలాంటి కల్లాకటపం ఎరుగని వ్యక్తి. చిన్న సవరణ, ఆయన చేతిలో ఉన్న ఒక్క సూట్ కేస్ కాకుండా, అక్రమ సంపాదన కోసం ఓపెన్ చేసిన సూట్‌కేస్ కంపెనీలన్నింటినీ పెట్టాలి. డియర్ ఏపీ సీఎం.. నువ్వు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య కాదు. కామ్రేడ్ తరిమెల నాగిరెడ్డి కాదు. అక్రమ సంపాదనను కూడగట్టి, జనాల మధ్య గొడవలు సృష్టించే నీకు క్లాస్ వార్ అనే పదాన్ని పలికే హక్కులేదు. మీ నుంచి, మీ గ్రూప్ నుంచి ఏదో ఒకరోజు రాయలసీమ విముక్తి పొందుతుందని భావిస్తున్నాను” అంటూ పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. “ఈ కథకు రాజస్థాన్ ఎడారిలోని ఇసుక తిన్నెలు అవసరం. కానీ, ఏపీలోని నదుల నుంచి వైసీపీ దోచుకున్న ఇసుక దిబ్బలు జగన్ తో సినిమా చేయడానికి సరిపోతాయి” అంటూ విమర్శలు గుప్పించారు.
పవన్ కు గట్టి కౌంటర్ ఇచ్చిన ఆర్జీవీ
పవన్ కల్యాట్ ట్వీట్ పై అంతే ఘాటుగా రియాక్ట్ అయ్యారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. పవన్ ట్వీట్ మాదిరిగానే గట్టి కౌంటర్ ఇచ్చారు. “నీతో కూడా ఈ సినిమాను ఎవరైనా చేస్తారని నేను భావిస్తున్నాను. ఎందుకంటే, మీరు అజ్ఞానంతో నిండిన అమాయకుడు. అమాయకత్వం నిండిన కల్లాకటపం లేని మనిషి. ఇక్కడ ఒక మార్పు ఇక్కడ అవసరం: ఒక పాత్రను పోషించే బదులు మల్టీఫుల్ పర్సనాలిటీ డిజార్డర్‌ను కలిగి ఉన్న క్యారెక్టర్లను చేయండి. సీఎం కావాలని కోరుకోని ప్రియమైన పవన్ కల్యాణ్, నువ్వు ఎన్టీ రామారావు కాదు. ఎంజీఆర్ కాదు. మీ అవగాహనాలేమి, మీ అభిమానులపై మీరు ప్రేరేపించే హింస నేపథ్యంలో ప్రజాసేవ అనే పదాన్ని పలికే అర్హతే లేదు. ఏదో ఒక రోజు మీ నుంచి, మీ సైకోపాతిక్ నార్సిజం నుంచి మీ జనసైనికులు బయటపడుతారని భావిస్తున్నాను” అంటూ కౌంటర్ ఇచ్చారు. ప్రస్తుతం పవన్, ఆర్జీవీ ట్వీట్లు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. వైసీపీ మద్దతుదారులు అర్జీవీకి సపోర్టుగా పవన్ పై విరుచుకుపడుతున్నారు. అటు జనసేన మద్దతుదారులు పవన్ కు సపోర్టుగా ఆర్జీవీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
Read Also: 10 రోజుల్లో రూ.100 కోట్లు వసూల్, తెలుగులోకీ రాబోతున్న మలయాళం బ్లాక్ బస్టర్ మూవీ!