'ఆర్ఎక్స్ 100' తర్వాత తెలుగు పరిశ్రమలో కొత్త ఒరవడి మొదలైంది. ప్రేమ కథలు, రొమాంటిక్ గీతాలను చూపించే విధానంలో మార్పు స్పష్టంగా కనిపించింది. ఆ ట్రెండుకు శ్రీకారం చుట్టిన దర్శకుడు అజయ్ భూపతి (Ajay Bhupathi). ఆయన దర్శకత్వం వహిస్తున్న తాజా సినిమా 'మంగళవారం' (Mangalavaram Movie). ఇందులో పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput) ప్రధాన పాత్రధారి. 'ఆర్ఎక్స్ 100' వంటి కల్ట్ హిట్ తర్వాత అజయ్ భూపతి దర్శకత్వంలో మరోసారి ఆమె నటిస్తున్న చిత్రమిది. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే... సినిమాకు గుమ్మడికాయ కొట్టేశారు. 


'మంగళవారం' చిత్రీకరణ ముగిసింది
Mangalavaram Movie Shoot Wrapped Up : 'మంగళవారం' చిత్రాన్ని ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ .ఎం నిర్మిస్తున్నారు. అజయ్ భూపతి 'A' క్రియేటివ్ వర్క్స్ నిర్మాణ భాగస్వామి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రూపొందుతోంది. సినిమా చిత్రీకరణ పూర్తయిందని మంగళవారం వెల్లడించారు. 


చిత్రీకరణ పూర్తైన సందర్భంగా చిత్ర నిర్మాత స్వాతి రెడ్డి గునుపాటి మాట్లాడుతూ ''కంటెంట్, క్వాలిటీ పరంగా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్న చిత్రమిది. జూన్ 12తో షూటింగ్ కంప్లీట్ చేశాం. మొత్తం 99 రోజులు పట్టింది. అందులో కేవలం 48 రోజులు పగటి పూట, 51 రోజులు రాత్రి వేళల్లో చిత్రీకరణ చేశాం. ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్ మీద రానటువంటి జానర్ కథతో అజయ్ భూపతి అద్భుతమైన సినిమా తీస్తున్నారు. సాంకేతికంగా ఉన్నత నిర్మాణ విలువలతో రూపొందిస్తున్న చిత్రమిది. త్వరలో టీజర్, ట్రైలర్ విడుదల తేదీలు, ఇతర వివరాలు వెల్లడిస్తాం'' అని అన్నారు. ఒంటి మీద నూలుపోగు లేకుండా పాయల్ ఫస్ట్ లుక్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అందులో పాయల్ కళ్ళలో కన్నీటి పోర కూడా ఉంటుంది. ఎమోషనల్ బోల్డ్ లుక్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. పాయల్ ఫస్ట్ లుక్ ఫెంటాస్టిక్ రెస్పాన్స్ అందుకుందని నిర్మాతలు సంతోషం వ్యక్తం చేశారు.


Also Read : అమెరికాలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు అడ్డం పడిన తెలుగు కమ్యూనిటీ


రేర్ విలేజ్ యాక్షన్ థ్రిల్లర్!
'మంగళవారం' రేర్ విలేజ్ యాక్షన్ థ్రిల్లర్ (Action Thriller Movie) అని చిత్ర దర్శకుడు అజయ్ భూపతి తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ''గ్రామీణ నేపథ్యంలో నేటివిటీతో కూడిన కథతో సినిమా తీస్తున్నాం. ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఇస్తుంది. సినిమాలో ప్రతి పాత్రకు కథలో ప్రాముఖ్యం ఉంటుంది. మొత్తం 30 క్యారెక్టర్లు ఉంటాయి. పోస్ట్ ప్రొడక్షన్ పనులు త్వరలో స్టార్ట్ చేస్తాం. 'కాంతార' ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ (B Ajaneesh Loknath) నేపథ్య సంగీతం హైలైట్స్‌లో ఒకటి అవుతుంది'' అని అన్నారు.


Also Read : ప్రభాస్ అడగలేదు, మేమే కొన్నాం - 'ఆదిపురుష్' రైట్స్‌పై టీజీ విశ్వప్రసాద్


మంగళవారం చిత్రానికి కూర్పు : మాధవ్ కుమార్ గుళ్ళపల్లి, కళ : మోహన్ తాళ్లూరి, మాటలు : తాజుద్దీన్ సయ్యద్, రాఘవ్, ప్రొడక్షన్ డిజైనర్ : రఘు కులకర్ణి,  పోరాటాలు : రియల్ సతీష్, పృథ్వీ, సౌండ్ డిజైన్ & ఆడియోగ్రఫీ : జాతీయ పురస్కార గ్రహీత రాజా కృష్ణన్, నృత్యాలు : భాను, ఛాయాగ్రహణం : దాశరథి శివేంద్ర, సంగీతం : 'కాంతార' ఫేమ్ బి. అజనీష్ లోక్‌నాథ్.