Adivi Sesh : 'గూడాచారి', 'ఎవరు', 'మేజర్', 'HIT 2', ప్రస్తుతం 'గూడాచారి 2' వంటి వరుస థ్రిల్లర్‌ సినిమాల్లో నటించిన నటుడు అడివి శేష్... ఆ తరహా మూవీస్ కు విరామం తీసుకుంటున్నట్టు వెల్లడించాడు. ఈ సందర్భంగా ట్వీట్ చేసిన ఆయన.. ఓ ఇంట్రస్టింగ్ ప్రకటనతో అందర్నీ ఆశ్చర్యపరిచాడు. 'గూడాచారి 2' తర్వాత తన తదుపరి ప్రాజెక్ట్ అవుట్ అండ్ అవుట్ లవ్ స్టోరీ అని శేష్ చెప్పుకొచ్చాడు. కానీ దీనికి కాస్త సమయం పట్టనున్నట్టు తెలుస్తోంది. కాబట్టి కొన్ని నెలల తర్వాత మాత్రమే ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనున్నట్టు సమాచారం. ఈ ప్రాజెక్ట్‌కు డైరెకట్ చేసే దర్శకుడి పేరును కూడా అడివి శేష్ వెల్లడించకపోవడంతో.. ఈ సినిమాకు ఎవరు దర్శకత్వం వహించనున్నారోనని అభిమానులు చర్చించుకుంటున్నారు.


శేష్ ప్రస్తుతం ప్రశంసలు పొందిన స్పై థ్రిల్లర్ 'గూఢాచారి'పై ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న దాని సీక్వెల్ 'గూడాచారి 2' షూటింగ్‌లో ఉన్నాడు. శేష్ పాన్-ఇండియా చిత్రం 'మేజర్‌' ఎడిటర్‌లలో ఒకరైన నూతన దర్శకుడు వినయ్ కుమార్ సిరిగినీడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. 






26/11లో అమరవీరుడైన సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ ఆధారంగా తెరకెక్కిిన 'మేజర్'... పాన్-ఇండియా రేంజ్ లో విడుదలై అద్భుత విజయాన్ని దక్కించుకుంది. ఆ తర్వాత అడివి శేష్ 'హిట్' (HIT: The Second Case)లో కనిపించారు. ఆ వెంటనే 2018 లో హిట్ అయిన చిత్రం 'గూఢచారి'కి సీక్వెల్ ను ప్రకటించాడు. రెండు యాక్షన్-ఓరియెంటెడ్, ఇంటెన్స్ పాత్రల తర్వాత, శేష్ తన తదుపరి, రొమాంటిక్ చిత్రాన్ని ప్రకటించడంపై అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ ఫెవరేట్ హీరోని లవర్ బాయ్ గా చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్, ఇతర నటులకు సంబంధించిన వివరాలు కూడా ఇంకా ఆయన వెల్లడించలేదు. కాగా ఈ మూవీకి కథ, స్క్రీన్‌ప్లేను అడివి శేష్ స్వయంగా అందిస్తుండడం మరో విశేషం. 


అడివి శేష్ ఇటీవలే పాన్-ఇండియా ఫిల్మ్ 'మేజర్' తో ఎనలేని ప్రశంసలు అందుకున్నాడు. దీంతో 'మేజర్' అతనికి ఇంటి పేరుగా మారింది. ఈ సినిమాలో శేష్ 'మేజర్' సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రను పోషించాడు. ఆ తర్వాత ప్రాజెక్ట్, 'HIT: ది సెకండ్ కేస్' లో ఆయన కృష్ణ దేవ్ పాత్రలో నటించి మరింత పాపులర్ అయ్యాడు. ప్రస్తుతం ఆయన 'గూడాచారి 2' లో నటిస్తుండగా.. ఈ సినిమాలో గోపి పాత్రలో కనిపించనున్నాడు.


దర్శకుడు శశి కిరణ్ తిక్క రూపొందించిన 'మేజర్' 2008లో 26/11 దాడుల్లో అసువులు బాసిన మేజర్ సందీప్ కృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది. గతేడాది రిలీజైన 'మేజర్' లో నటించినందుకు గానూ భారత మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కొవింద్.. హీరో అడివి శేష్‌ను అభినందించారు. సినిమా అపూర్వ విజయం సాధించినందుకు నటుడిని అభినందించి, ఆశీర్వదించారు. ఇది అతిపెద్ద విజయమని, మేకర్స్‌కి గర్వకారణమైన క్షణమని ఈ సందర్భంగా అడవి శేష్ చెప్పారు.


Read Also : Tamannaah Bhatia Relationship: విజయ వర్మతో తమన్నా డేటింగ్ - అసలు విషయం చెప్పేసిన మిల్కీ బ్యూటీ