'హృదయం' సినిమా గుర్తుందా? మోహన్ లాల్ కుమారుడు ప్రణవ్ హీరోగా... దర్శనా రాజేంద్రన్, కల్యాణీ ప్రియదర్శన్ హీరోయిన్లుగా నటించారు. హైదరాబాద్‌లో కొన్ని థియేటర్లలో విడుదలైంది. అప్పుడు కొందరు చూశారు. ఓటీటీలో విడుదలయ్యాక ఇంకొందరు చూశారు. పాటలను అయితే చాలా మంది విన్నారు. ఆ సినిమాకు ఎంత పేరు వచ్చిందో... పాటలకు అంతే పేరు వచ్చింది. దాంతో ఆ సినిమా సంగీత దర్శకుడి చేత తమ సినిమాకు సంగీతం చేయించుకోవాలని దర్శక - నిర్మాతలు ట్రై చేస్తున్నారు.
'హృదయం' సినిమా సంగీత దర్శకుడి పేరు హెషమ్ వహాబ్. ఇప్పుడు అతడు ఓ తెలుగు సినిమాకు సంగీతం అందిస్తున్నారు. విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న 'ఖుషి'కి పని చేస్తున్నారు. ఇప్పుడు మరో సినిమాకు సంతకం చేశారు.
విక్రాంత్, మెహరీన్ జంటగా భారీ నిర్మాణ వ్యయంతో డెఫ్ ఫ్రాగ్ ప్రొడక్షన్ పతాకంపై రూపొందుతోన్న చిత్రం ‘స్పార్క్’. మేలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ చిత్రానికి హెషమ్ వహాబ్ సంగీతం అందించనున్నట్టు ఈ రోజు దర్శక - నిర్మాతలు వెల్లడించారు.
Also Read: అంటే థియేటర్లలో నానికి ఎదురు లేదా? ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లో వస్తున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు
'ఎఫ్ 3' తర్వాత మెహరీన్ హీరోయిన్‌గా నటిస్తోన్న చిత్రమిది. ప్రస్తుతం హైదరాబాద్ సిటీలో ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. త్వరలో యూరప్‌లోని అందమైన లొకేషన్స్‌లో తదుపరి షెడ్యూల్ షూటింగ్ స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.