జూన్ రెండో వారంలో థియేటర్లలో సందడి చేయనున్న తెలుగు సినిమాలు ఏవి? అని చూస్తే... నాని, నజ్రియా నజీమ్ జంటగా నటించిన 'అంటే సుందరానికీ' సినిమాకు ఎదురు లేదని చెప్పాలి. తెలుగునాట క్రేజీ సినిమా ఇదొక్కటే! ఇది కాకుండా ఇంకా ఏయే సినిమాలు విడుదలవుతున్నాయి? ఏంటి? అనే వివరాల్లోకి వెళితే...


బ్రాహ్మణ యువకుడికి, క్రిస్టియన్ అమ్మాయికి పెళ్లి!
అనగనగా ఓ యువకుడు... అతడి పేరు సుందరం! సనాతన ఆచారాలు పాటించే బ్రాహ్మణ కుటుంబం! లీలా అనే క్రిస్టియన్ అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. మరి, ఈ విషయం తెలిసిన ఇరువురి కుటుంబ సభ్యులు ఎలా స్పందించారు? ఈ ప్రేమకథ పెళ్లి పీటల వరకూ వెళ్ళడానికి మధ్య ఎన్ని సంగతులు జరిగాయి? అనే కథతో రూపొందిన సినిమా 'అంటే సుందరానికీ'. నాని, నజ్రియా జంటగా నటించారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించారు. జూన్ 10న సినిమా విడుదలవుతోంది. అదే రోజున తెలుగుతో పాటు తమిళంలో 'ఆదదే సుందర'గా, మలయాళంలో 'ఆహా సుందర'గా విడుదల చేస్తున్నారు.



శునకం రాకతో మనిషి జీవితం ఎలా మారింది?
కన్నడ కథానాయకుడు, 'అతడే శ్రీరామన్నారాయణ' ఫేమ్ రక్షిత్ శెట్టి నటించిన తాజా సినిమా '777 చార్లీ'. ఇదీ జూన్ 10న విడుదలవుతోంది. పాన్ ఇండియా రిలీజ్ చేస్తున్నారు. తెలుగు, కన్నడ, హిందీ, మలయాళ, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. శునకం రాకతో ఒంటరి యువకుడి జీవితం ఎలా మారింది? అనేది కథ. పెట్ లవర్స్‌ను ఆకట్టుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.



మలయాళ సినిమా 'డియర్ ఫ్రెండ్' కూడా
'ఫోరెన్సిక్', 'కాలా', 'వ్యూహం' తదితర అనువాద సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న మలయాళ హీరో టోవినో థామస్. ఆయన హీరోగా నటించిన లేటెస్ట్ మలయాళ మూవీ 'డియర్ ఫ్రెండ్'. భాషలకు అతీతంగా ప్రేక్షకులను ఆకట్టుకున్న 'హృదయం' సినిమాలో దర్శన పాత్రలో నటించిన దర్శనా రాజేంద్రన్ హీరోయిన్. ఈ సినిమా కూడా జూన్ 10న విడుదలవుతోంది.



వంద రూపాయలకు 'జ‌న్‌హిత్ మే జారి'
నుష్రుత్‌ బరుచా ప్రధాన పాత్రలో నటించిన హిందీ సినిమా 'జ‌న్‌హిత్ మే జారి'. విజయ్ రాజ్ తదితరులు నటించిన ఈ సినిమా టికెట్ రేటు వంద రూపాయలే అని ప్రచారం చేస్తున్నారు.
హిందీ సినిమాలు 'డియర్ దియా' థియేటర్లలో, 'అర్ద్' 'జీ 5' ఓటీటీలో విడుదలకు రెడీ అయ్యాయి.  






జూన్ 10న థియేటర్లలో విడుదలకు సిద్ధమైన లో బడ్జెట్ తెలుగు సినిమాలు: 
1. సురాపానం
2. జరిగిన కథ
3. కిరోసిన్ 


ఓటీటీలో 'కిన్నెరసాని'
కళ్యాణ్ దేవ్ కథానాయకుడిగా నాగశౌర్య 'అశ్వథ్థామ‌' ఫేమ్ రమణ తేజ దర్శకత్వం వహించిన 'కిన్నెరసాని' (Kinnerasani Movie) సినిమా జూన్ 10న డైరెక్టుగా జీ 5 ఓటీటీ వేదికలో విడుదల కానుంది. ఓటీటీ వేదికల్లో ఈ వారం వస్తున్న చెప్పుకోదగ్గ తెలుగు చిత్రమిది. 



మమ్ముట్టి 'సిబిఐ 5: ది బ్రెయిన్' కూడా!
మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి నటించిన సినిమా 'సిబిఐ 5: ది బ్రెయిన్'. ఇదొక యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్. మలయాళం సహా తెలుగు, హిందీ, కన్నడ, తమిళ భాషల్లో జూన్ 12న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. 


శివ కార్తికేయన్ 'డాన్' సినిమా జూన్ 10న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలవుతోంది. మలయాళ థ్రిల్లర్ సినిమా 'ఇన్నలే వరే' జూన్ 9న సోనీ లివ్ ఓటీటీలో విడుదల అవుతోంది.


Also Read: ఒక్క రూపాయి కూడా తీసుకొని చిరంజీవి, రామ్ చరణ్ - డబ్బులు అన్నీ వెనక్కి


ఓటీటీ వేదికల్లో ఈ వారం వస్తున్న వెబ్ సిరీస్‌లు:
1. జూన్ 8న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ ఓటీటీలో 'మిస్ మర్వెల్' విడుదల. ఇంగ్లీష్, తెలుగు, హిందీ, తమిళ్, మలయాళ భాషల్లో విడుదల
2. జూన్ 9న హిందీ, అరబిక్ భాషల్లో వూట్ ఓటీటీ వేదికలో 'కోడ్ ఎమ్' రెండో సీజన్ విడుదల.
3. జూన్ 10న వూట్ ఓటీటీ వేదికలో 'సైబర్ వార్' (CyberVaar) విడుదల
4. జీ 5 ఓటీటీ వేదికలో జూన్ 10 నుంచి 'ది బ్రికెన్ న్యూస్' వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.
5. నెట్‌ఫ్లిక్స్‌లో జూన్ 10న స్పానిష్ వెబ్ సిరీస్ 'ఇంటిమసీ' విడుదలవుతోంది. ఇంకా పలు సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఓటీటీ వేదికల్లో విడుదల అవుతున్నాయి.


Also Read: 'ఎక్స్ట్రా జబర్దస్త్'ను సుడిగాలి సుధీర్ వదిలేసినా, అతడిని వదలడం లేదేంటో?