'ఎక్స్ట్రా జబర్దస్త్' కార్యక్రమానికి చాలా మంది టీమ్ లీడర్లు వచ్చాయి. చాలా టీమ్స్ వీక్షకులను నవ్వించాయి. నవ్వించి వెళ్లాయి. ప్రస్తుతం కొంత మంది నవ్వించే పనిలో ఉన్నారు. అయితే, టీమ్స్ అన్నిటిలో 'సుడిగాలి' సుధీర్ అండ్ టీమ్ చాలా స్పెషల్. సుధీర్‌తో పాటు 'గెటప్' శీను, 'ఆటో' రామ్ ప్రసాద్ చేసే వినోదానికి ఫ్యాన్స్ ఉన్నారు. అలాగే, సుధీర్ - రష్మీ గౌతమ్ మధ్య లవ్ ట్రాక్‌కు కూడా!
ఇప్పుడు 'ఎక్స్ట్రా జబర్దస్త్'ను 'సుడిగాలి' సుధీర్ వదిలేశాడు. అతడితో పాటు 'గెటప్' శీను కూడా! సుధీర్ అయితే 'జబర్దస్త్'తో పాటు మల్లెమాల టీవీ ప్రొడ్యూస్ చేసే డ్యాన్స్ రియాలిటీ షో 'ఢీ', కామెడీ షో 'శ్రీదేవి డ్రామా కంపెనీ' కూడా మానేశాడు. ప్రస్తుతం 'సూపర్ సింగర్ జూనియర్' షో చేస్తున్నాడు. అయితే... అతడిని మాత్రం 'ఎక్స్ట్రా జబర్దస్త్' టీమ్ వాళ్ళు వదలడం లేదు.
'ఎక్స్ట్రా జబర్దస్త్'లో సుధీర్ లేకపోయినా... అతడి ప్రస్తావన ఏదో రకంగా వస్తోంది. అనిల్ రావిపూడి ఒక ఎపిసోడ్‌కు అతిథిగా వచ్చారు. సుధీర్, శీను లేకుండా స్కిట్ చేయడం ఎలా ఉందని రామ్ ప్రసాద్‌ను అడిగారు. సుధీర్, శీను ఎందుకు 'ఎక్స్ట్రా జబర్దస్త్'కు దూరం అయ్యారనేది చెబుతూ 'కెవ్వు' కార్తీక్ ఒక స్కిట్ చేశాడు.
Also Read: ఒక్క రూపాయి కూడా తీసుకొని చిరంజీవి, రామ్ చరణ్ - డబ్బులు అన్నీ వెనక్కి
లాస్ట్ వీక్ ఎపిసోడ్‌లో అయితే రష్మీకి పెళ్లి స్కిట్ చేశాడు రామ్ ప్రసాద్. అందులో ఇన్ డైరెక్టుగా సుధీర్ ప్రస్తావన వచ్చింది. కొన్ని స్కిట్స్‌లో సుధీర్‌ను మరో టీవీ ఛానల్‌కు రష్మీ పంపించిందని సెటైర్స్ పడుతున్నాయి. అదీ సంగతి!