జ్వాలను ఫంక్షన్‌కు పిలిచి అవమానించాలని డిసైడ్ అవుతారు స్వప్న, శోభ. ఇక్కడ జ్వాల మాత్రం డాక్టర్‌ సాబ్‌ను తలుచుకొని సిగ్గుమొగ్గలేస్తుంది. శోభ పిలిచిందని అక్కడ చాలా టైం వెయిట్ చేస్తుంది. అసలు శోభ ఎందుకు పిలిచిందో జ్వాలకు అర్థం కాదు. లేట్ అవతుందని అక్కడి నుంచి వెళ్లిపోతున్న టైంలో శోభ వస్తుంది. ఏంటీ వెళ్లి పోతున్నావా అంటుంది శోభ. నువ్వు పిలిచావని వచ్చాను... నువ్వు రాకపోవడం లేట్ అయ్యేసరికి వెయిట్ చేయడం ఎందుకని వెళ్లిపోతున్నా అంటుంది జ్వాల. అలా ఎలా మాట్లాడుగలుగుతావని అడుగుతుంది శోభ. మనసులో ఏమీ లేకపోతే మాటలు, కళ్లల్లో కాన్ఫిడెన్స్ టన్నుల కొద్ది కనిపిస్తుందని చెబుతుంది జ్వాల. 


నువ్వు నడిపేది ఆటో అయినా మాటలు మాత్రం బాగా చెప్తావంటుంది శోభ. రమ్మన్నావ్‌... అసలు విషయం చెప్పకుండా ఏదేదో మాట్లాడుతున్నావ్‌ నేను వెళ్తున్నాను అంటూ చెప్తుంది జ్వాల. చెప్పేది విను... అంటూ నేను పార్టీ ఇస్తున్నాను అంటుంది శోభ. ఇవ్వూ... బాగానే సంపాదిస్తున్నావ్‌గా కౌంటర్ ఇస్తుంది జ్వాల. నేను హాస్పిటల్ పెట్టినందుకు అందరికీ పార్టీ ఇస్తున్నానని.. ఆ పార్టీకి నువ్వు రావాలని ఆహ్వానిస్తుంది శోభ. నువ్వు పార్టీ ఇస్తే నేను ఎందుకు వస్తానంటూ అడుగుతుంది. ఇది మరీ మొండికేస్తుందని... ఎలాగైనా రప్పించి నిరుపమ్‌ ముందు అవమానించాలని ప్లాన్ చేసుకుంటుంది. నువ్వు రావలని... వస్తావని నా మనసు చెబుతుందని అంటుంది శోభ. 


నేను ఎందుకు వస్తాను... నువ్వు పార్టీ ఇస్తే నేను ఎందుకు వస్తానూ అంటు ఎదుర ప్రశ్న వేస్తుంది జ్వాల. ఆ పార్టీకి అందరూ వస్తున్నారని.. హిమ, నిరుపమ్ వస్తాడని టెంప్ట్ చేస్తుంది. కాస్త టెంప్ట్ అయినట్టే అయ్యి... అసలు నీ పార్టీకి ఎవరొచ్చినా... నేను ఎందుకు రావాలని అడుతూనే ఉంటుంది. హాస్పిటల్ పెట్టాను... సరదాగా పార్టీకి రావొచ్చు కదా అని రిక్వస్ట్ చేస్తుంది శోభ. సరదాగా సినిమాకో షికారుకో వెళ్లొచ్చు కానీ... నీ పార్టీకి ఎందుకు రావాలని మళ్లీ ప్రశ్నిస్తుంది జ్వాల. డాక్టర్‌ సాబ్‌ను ఎరగా వేసి మొత్తానికి జ్వాలను ఒప్పిస్తుంది శోభ. 


కాని జ్వాలకు అనుమానం వస్తుంది. నన్ను చూస్తే చిరాకుపడే శోభ సడెన్‌గా తగ్గి వచ్చి పార్టీకి ఆహ్వానించిందీ అంటే ఏదో ఉందని అభిప్రాయపడుతుంది. వెళ్తే కానీ అక్కడ ఏం జరుగుతుందో ఎలా తెలుస్తుందని అనుకుంటుంది. అక్కడకు డాక్టర్ సాబ్ కోసమైనా పార్టీకి వెళ్లాలనుకుంటుంది జ్వాల. 


కొత్తగా మురళీ క్యారెక్టర్‌ను ఎంట్రీ ఇస్తుంది. వచ్చిన వెంటనే పెద్దమ్మా అంటూ సౌందర్యతో తన వరం కోసం వెతుకులాట ప్రారంభిస్తాడు మురళి. 


హాస్పిటల్‌లో కూర్చొని సౌర్యతో ఉన్న ఫొటోలు చూసుకుంటూ గడిపేస్తుంది హిమ. సౌర్య నీ పక్కనే నేను ఉన్నాను.. కానీ నేనే హిమను అని చెప్పలేను... అది చెప్పే రోజు ఎప్పుడు వస్తుందో తెలియదు అనుకుంటుంది. నీ మనసులో నిరుపమ్ ఉన్నాడని తెలినప్పటి నుంచి మీ ఇద్దర్నీ ఒకటి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాను. ఇన్నాళ్లూ స్వప్న ఒక్కర్తే అనుకున్నాను.. కానీ శోభ అడ్డుగా వస్తుందని అనుకోలేదు. అయితే ఎవరు అడ్డుగా ఉన్ననా మీ ఇద్దర్నీ కలుపుతాను. ఏం చేసైనా ఏదైనా నిరుపమ్‌, సౌర్యను ఒక్కటి చేస్తాను. అమ్మానాన్నకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను. సౌర్య ఆనందమే నా ఆనందం అంటుంది హిమ. 
మురళి వెతుకుతున్న వరలక్ష్మి  జ్వాల కంట పడుతుంది. ఒంటి నిండా రోడ్డుపై నిల్చొని ఆటో ఆపుతుంది. ఏదో అడ్రెస్‌ కోసం ఆరా తీస్తుంది. అందులో సౌందర్య అడ్రెస్‌ చూసి షాక్ అవుతుంది జ్వాల. కాసేపటికి తేరుకొని ఆమెను ఆటోలో ఎక్కించుకుంటుంది. వెంటనే సౌందర్యకు జ్వాల ఫోన్ చేసి ఆమె గురించి చెబుతుంది. 


కారులో ఉన్న మురళికి కూడా వరలక్ష్మి పేరు వినగానే సీన్ అర్థమైపోతుంది. కాసేపు సౌందర్య, వరలక్ష్మి మాట్లాడుకుంటారు. ఇంతలో జ్వాల కలుగజేసుకొని... మా ఇంటి దగ్గరకు రమ్మని చెబుతుంది. అక్కడే వస్తున్నానని చెబుతుంది సౌందర్య. కారులో కూర్చొని ఉన్న మురళిని... ఎక్కడ దింపాలి అని అడుగుతుంది. నేను వెతుకుతున్న అదృష్టం దొరికేలా ఉందని అంటాడు మురళి. ఏంట్రా ఏమీ అర్థం కావడం లేదంటుంది సౌందర్య. అన్నీ అవే అర్థమవుతాయి మీరు పదండని చెప్తాడు మురళి. 
ఆటోలో వస్తున్న వరలక్ష్మిని చాలా విషయాలు అడుగుతుంది జ్వాల. వరలక్ష్మిని ఇంటికి తీసుకొచ్చి కూర్చోబెడుతుంది జ్వాల. ఇంతలో సౌందర్య అక్కడకు వస్తుంది. 


జ్వాల ఇంట్లోకి సౌందర్యతోపాటు మురళి కూడా వస్తాడు. నేను వరలక్ష్మిని కలుసుకుంటే ప్రేమ గెలిచినట్టే అనుకున్నాను.. కానీ ఇంత త్వరగా జరుగుతుందని అనుకోలేదనుకుంటాడు. మొత్తానికి వరమ్మను కలిశాను... ఇక మాచర్ల వెళ్లి ప్రేమలో పడేసి పెళ్లి చేసుకోవడమే అంటాడు. 


ఇంతలో అంతా మాట్లాడుకుంటారు. అక్కడే తినాలని డిసైడ్ అవుతారు. వరలక్ష్మి లోపలికి వెళ్లి వంట రెడీ చేస్తుంది.