బాలీవుడ్ క్లాసిక్ సినిమాల్లో 'మైనే ప్యార్ కియా' ఒకటి. సల్మాన్ ఖాన్, భాగ్య శ్రీ జంటగా నటించారు. హీరో హీరోయిన్లు ఇద్దరికీ అదే తొలి సినిమా. అప్పట్లో భారీ వసూళ్లు సాధించిన సినిమా అది. అయితే, ఆ సినిమా విడుదలైన తర్వాత సల్మాన్‌కు సినిమా అవకాశాలు రాలేదంటే నమ్ముతారా? అబుదాబీలో జరిగిన ఐఫా అవార్డు వేడుకలో అప్పట్లో పరిస్థితి గుర్తు చేసుకుని బాలీవుడ్ కండల వీరుడు కన్నీళ్లు పెట్టుకున్నారు.


''మైనే ప్యార్ కియా' తర్వాత భాగ్య శ్రీ సినిమాలు చేయాలని అనుకోలేదు. పెళ్లి చేసుకుని జీవితంలో సెటిల్ అవ్వాలని అనుకుంది. 'మైనే ప్యార్ కియా' హిట్ క్రెడిట్ అంతా ఆమె తీసుకుని వెళ్ళిపోయింది. ఆరు నెలల పాటు... నాకు సినిమా అవకాశాలు రాలేదు. నా చేతిలో సినిమా లేదు'' అని సల్మాన్ ఖాన్ పేర్కొన్నారు. 


రమేష్ తౌరాణి తన జీవితంలోకి దేవుడిలా వచ్చారని, తన కెరీర్ నిలబెట్టారని సల్మాన్ ఖాన్ తెలిపారు. ''అప్పట్లో 'మైనే ప్యార్ కియా' తర్వాత నాకు సినిమా అవకాశాలు రాకపోవడంతో మా నాన్నగారు జీపీ సిప్పీకి రెండు వేళా రూపాయలు ఇచ్చారు. నాతో సినిమా చేస్తున్నట్టు ప్రకటన ఇప్పించారు. అయితే, అసలు సినిమా లేదు. అప్పుడు సిప్పీ ఆఫీసుకు వెళ్లిన రమేష్ తౌరాణి మ్యూజిక్ రైట్స్ కోసం ఐదు లక్షలు చెల్లించారు. దాంతో నాకు 'పత్తర్ కె పూల్' సినిమా వచ్చింది'' అని సల్మాన్ ఖాన్ చెప్పారు.


Also Read: అంటే థియేటర్లలో నానికి ఎదురు లేదా? ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లో వస్తున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు


తన దగ్గర డబ్బులు లేకపోవడంతో ఒక షాపులో షర్ట్, వాలెట్ వైపు చూస్తుంటే...  వాటిని కొన్న సునీల్ శెట్టి తనకు బహుమతిగా ఇచ్చారని సల్మాన్ ఖాన్ గుర్తు చేసుకున్నారు. 'వాంటెడ్'తో తన కెరీర్ ను మళ్ళీ నిలిబెట్టిన బోనీ కపూర్‌కు సల్మాన్ హాగ్ ఇచ్చారు. ఈ విషయాలు చెప్పేటప్పుడు అయన ఎమోషనల్ అయ్యారు. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి.


Also Read: ఒక్క రూపాయి కూడా తీసుకొని చిరంజీవి, రామ్ చరణ్ - డబ్బులు అన్నీ వెనక్కి