నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) పుట్టినరోజు సందర్భంగా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ బర్త్ డే విషెస్ (Happy Birthday NKR) తెలియజేసింది. ఈ సందర్భంగా ప్రీ లుక్ పోస్టర్ (NKR 19 Pre Look Poster) విడుదల చేసింది. అందులో సినిమా థీమ్ ఏంటనేది చాలా స్పష్టంగా అర్థం అవుతోంది.
కళ్యాణ్ రామ్ పుట్టినరోజు సందర్భంగా నిన్న 'బింబిసార' ట్రైలర్ విడుదల చేశారు. అది సోషియో ఫాంటసీ ఫిల్మ్. అందులో కత్తులు, యుద్ధాలు ఉన్నాయి. మోడ్రన్ జనరేషన్ సీన్స్ కొన్ని ఉన్నప్పటికీ... ట్రైలర్ వరకూ పీరియడ్ డ్రామా, వార్ సీన్స్ హైలైట్ అయ్యాయని చెప్పవచ్చు. అందుకు పూర్తి భిన్నంగా కళ్యాణ్ రామ్ 19వ సినిమా ఉండబోతోంది. గన్స్ అండ్ యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రమిది.
Also Read : సీరియస్‌గా తీసుకోవద్దు శోభు - 'ఆర్ఆర్ఆర్' గే లవ్ స్టోరీ కామెంట్స్‌కు ఇక ఫుల్ స్టాప్ పడుతుందా?
కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రానికి రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మిగతా వివరాలు అప్పుడు వెల్లడించనున్నారు. భారీ నిర్మాణ వ్యయంతో ఈ సినిమా రూపొందుతోంది.
Also Read : పీపుల్స్ స్టార్ నారాయణ మూర్తికి మాతృవియోగం