మెరికాకు చెందిన అడల్ట్ స్టార్ సోఫియా లియోన్ కన్నుమూసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ ఘటన అడల్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చర్చనీయంగా మారింది. గత కొద్ది రోజులుగా అడల్ట్ మూవీ స్టార్స్ వరుసగా మరణిస్తున్నారు. అడల్ట్ స్టార్స్ కాగ్నే లీ, జెస్పీ జానే మరణించిన కొద్ది రోజుల్లోనే ఎమిలి విల్లిస్ అనే మరో నటి గుండె నొప్పితో హాస్పిటల్‌లో చేరింది. ప్రస్తుతం ఆమె కోమాలో ఉంది.


సోఫియా లియోన్ మరణానికి కారణాలు తెలియరాలేదు. పోలీసులు అనుమానస్పద మరణంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సోఫియా లియోన్‌కు తండ్రి లేడు. తల్లి రెండో పెళ్లి చేసుకోవడంతో వారికి దూరంగా ఓ అపార్టుమెంట్‌లో నివసిస్తోంది. గత కొద్దిరోజులుగా ఇంటి సభ్యులు, స్నేహితుల ఫోన్ కాల్స్‌కు స్పందించడం లేదు. అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం అందించారు. అపార్టుమెంట్‌లో ఆమె నిర్జీవంగా పడి ఉంది. అయితే, ఆమె ఏ కారణంతో మరణించిందనే విషయాలను పోలీసులు బయటకు వెల్లడించలేదు. ప్రస్తుతం విచారణ సాగుతోంది. 


మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన సోఫియా.. ఆర్థిక సమస్యల వల్ల అడల్డ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టాల్సి వచ్చింది. సోఫియా జూన్ 10, 1997న  మెక్సికోలోని మియామిలో పుట్టింది. మియామీ బీచ్ స్కూల్‌లో చదువుకుంది. అనంతరం ప్రిపరేటరీ అకాడమిలో చదివింది. మోడలింగ్ ద్వారా రంగుల ప్రపంచంలో అడుగుపెట్టింది. అవకాశాలు రాకపోవడంతో అడల్డ్ మూవీస్‌ను నమ్ముకుంది. 18 ఏళ్ల వయస్సులోనే అడల్ట్ స్టార్‌గా గుర్తింపు పొందింది. వివిధ ప్రొడక్షన్ స్టూడియోల్లో 230 కంటే ఎక్కువ వీడియోల్లో సోఫియా నటించింది. 


అడల్ట్ మూవీస్‌లో నటిస్తున్నా.. తన వ్యక్తిగత జీవితంపై ఆ ప్రభావం పడకుండా జాగ్రత్తపడేదని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె జంతువులను ఎక్కువగా ఇష్టపడేదని, ఆమెకు మూడు పెంపుడు కుక్కలు ఉన్నాయని పేర్కొన్నారు. సోఫియాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టమని, వివాదాలకు కూడా దూరంగా ఉండేదని చెప్పారు. అయితే, అడల్ట్ స్టార్స్ వరుస మరణాలు పలు అనుమానాలకు దారితీస్తోంది. దీని వెనుక ఎవరి హస్తమైనా ఉందా? వారి మరణాలకు కారణాలేమిటీ? డ్రగ్స్ మాఫియానే ఈ హత్యలకు పాల్పడుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సోఫియాకు ఇండియాతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఆమె మరణ వార్త తెలియగానే షాక్‌కు గురయ్యారు. చిన్న వయస్సులోనే ఆమె ఎలా మరణించిందని ఆశ్చర్యపోతున్నారు.


ఆందోళనకరంగా మరో అడల్ట్ స్టార్ ఎమిలీ విల్లీస్ ఆరోగ్యం 


మరో అడల్ట్ స్టార్ ఎమిలీ ఆరోగ్యం కూడా ఆందోళనకరంగానే ఉంది. ప్రస్తుతం కోమాలో ఉన్న ఆమెకు వెంటీలేటర్ ద్వారా చికిత్స అందిస్తున్నారు. అయితే, ఆమెలో ఎలాంటి స్పందన కనిపించడం లేదు. నెల రోజుల కిందట ఆమె గుండెపోటుకు గురై ఆసుపత్రిలో చేరింది. డ్రగ్స్ ఓవర్ డోస్ కారణం వల్లే ఆమె గుండెపోటుకు గురైందని తెలిసింది. ఏ క్షణంలోనైనా ఆమె మరణ వార్త వినకతప్పదని వైద్యులు ఇప్పటికే కుటుంబ సభ్యులకు తెలియజేశారు. 


Also Readక్రిస్టోఫర్ నోలన్‌కు ఫస్ట్ ఆస్కార్, ఏడు అవార్డులతో సత్తా చాటిన 'ఓపెన్ హైమర్' - 2024లో విజేతలు వీరే