Adiseshagiri Rao : నిర్మాతగా, రాజకీయ నాయకుడిగా పేరు తెచ్చుకున్న ఘట్టమనేని ఆదిశేషగిరిరావు.. గత 30 సంవత్సరాలలో పలు చిత్రాలను నిర్మించారు. 'మోసగాళ్లకు మోసగాడు', 'అల్లూరి సీతారామ రాజు', 'వంశీ' లాంటి సినిమాలను నిర్మించిన ఆయన.. తాజాగా ప్రిన్స్ మహేశ్ బాబుపై ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆయన 14ఏళ్ల వయసులో లైసెన్స్ లేకుండా కారు నడిపి పోలీసుల కంటపడ్డాడని ఆయన తెలిపారు.


మహేశ్ బాబు తాను నమ్రతను ఇష్టపడిన విషయాన్ని మొదట ఆయన తల్లి ఇందిరాదేవికి చెప్పారని, ఆ తర్వాత వాళ్లిద్దరూ ఇష్టపడ్డారని కృష్ణ కూడా ఒప్పుకున్నారని ఆదిశేషగిరి రావు చెప్పారు. అందులో తన పాత్రేం లేదని స్పష్టం చేశారు. 


సొంత ప్రొడక్షన్ లో 'వంశీ' తర్వాత సినిమాలు ఎందుకు తీయలేదంటే..


కృష్ణ నటించడం మానేశారు. ఆ తర్వాత సినిమాలు తీయాల్సిన అవసరం లేకపోయిందని, తనక్కూడా ఇంట్రస్ట్ లేదని, పిల్లలకు కూడా ఇంట్రస్ట్ లేదని ఆదిశేషగిరి రావు చెప్పారు. అంతే తప్ప మరేం కారణాలు లేవని అన్నారు.


మహేశ్ మంచి మిమిక్రీ ఆర్టిస్ట్..


తమ కుటుంబంలో రమేష్ బాబు తర్వాత మహేశ్ బాబు సక్సెస్ అవుతారని ముందే ఊహించానని ఆదిశేషగిరి రావు తెలిపారు. ఆయన గురించి తనకు చిన్నప్పట్నుంచి తెలుసన్నారు. మహేశ్ గురించి ఎవరికీ తెలియని విషయాలు చాలా ఉన్నాయన్న ఆయన.. మహేశ్ మంచి మిమిక్రీ ఆర్టిస్ట్ అని చెప్పారు. ఎవరినైనా, ఏ వాయిస్ అయినా మిమిక్రీ చేసే నైపుణ్యం మహేశ్ కు ఉందన్నారు. చిన్నతనంలో అతని టాలెంట్ ను చూసి అప్పుడే ఆయన పెద్ద స్టార్ అవుతారని అనుకున్నానని అన్నారు. మహేశ్ కు అమితాబ్ బచ్చన్ కు ఉన్నంత టాలెంట్ ఉందని స్పష్టం చేశారు.


మహేశ్ గురించి చాలా మందికి తెలియని మరో విషయమేమిటంటే.. అతనికి 14ఏళ్ల వయసులో డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా కారు నడుపుకుంటూ వచ్చాడని ఆదిశేషగిరి రావు చెప్పారు. ఆ సమయంలో పోలీసులు కూడా వెంబడించారని, వాళ్లను తప్పించుకునేందుకు ఆఫీస్ పక్కన కారును పెట్టేసి, మళ్లీ ఏమీ తెలియనట్టు వచ్చి కూర్చున్నారని చెప్పారు. ఆ తర్వాత పోలీసులుకు తానే నచ్చజెప్పి పంపించినట్టు ఆయన వెల్లడించారు.


థియేటర్లోనే సినిమాలు చూస్తాం..


తమకు ఫస్ట్ నుంచీ కూడా థియేటర్లోనే సినిమాలు చూసే అలవాటుందని ఆదిశేషగిరి అన్నారు. ఫస్ట్ డే మార్నింగ్ షోనే చూస్తామని చెప్పారు. పబ్లిక్ రియాక్షన్స్ చూసేందుకు కచ్చితంగా థియేటర్లకే వెళ్తామని తెలిపారు. ఇంట్లో కూర్చుని ఓటీటీలో హోమ్ థియేటర్లలోనూ సినిమాలు చూడొచ్చు.. కానీ సినిమాలు తీసేవాళ్లకు అది కరెక్ట్ కాదన్నారు.


'మోసగాళ్లకు మోసగాడే' ఎందుకు..


అభిమానులందరూ ఈ సినిమానే కావాలని అడిగారు. ఈ మూవీ ఎక్కువ రోజులు ఆడిందని, అందుకే కృష్ణ లేని తొలి సంవత్సరంలో, సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నామని ఆదిశేషగిరి రావు చెప్పారు. ఈ డిజిటల్ యుగం రాకముందు ఈ సినిమా కోసం ప్రతి సంవత్సరం ఐదారు ప్రింట్లు తీసేవాళ్లని తెలిపారు. 71లో రిలీజైనా అప్పట్నుంచి ఇప్పటివరకు ఆ సినిమాకు మంచి క్రేజ్ ఉందన్నారు. ఇప్పుడున్న టెక్నికల్ స్టాండర్డ్స్ కు మించి ఆ సినిమాను తెరకెక్కించారని ఆయన చెప్పారు. పాత సినిమాలాగా అస్సలు అనిపించదన్న ఆయన.. రాబోయే కాలంలోనూ ఆడుతుందని అన్నారు. ఎన్ని సార్లు చూసినా కొత్తగా అనిపిస్తుందని స్పష్టం చేశారు.


Read Also : రణ్ వీర్, అలియా ‘రాకీ ఔర్ రాణి కీప్రేమ్ కహానీ’ ఫస్ట్ లుక్ రిలీజ్