Karan Johar : భారతీయ చలన చిత్రంలో గత 25 సంవత్సరాలుగా అభిమానులను అలరిస్తోన్న కరణ్ జోహార్ మే 25న 51వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా దర్శకనిర్మాత ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై అద్భుతమైన అప్ డేట్ ను రిలీజ్ చేశారు. ‘రాకీ ఔర్ రాణి కీప్రేమ్ కహానీ’ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘కుచ్ కుచ్ హోతా హై’ నుంచి ‘ఏ దిల్ హై ముష్కిల్’, ‘మై నేమ్ ఈజ్ ఖాన్’ లాంటి ఎన్నో హిట్ సినిమాలను కరణ్ జోహార్ అందించారు. మే 25తో ఆయన 51 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. అంతే కాకుండా సినీరంగంలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన పుట్టినరోజు వేడుకలను మరింత ఘనంగా నిర్వహిస్తున్నారు.
‘రాకీ ఔర్ రాణి కీప్రేమ్ కహానీ’ ఫస్ట్ లుక్ రిలీజ్
కరణ్ జోహార్ సిల్వర్ జూబ్లీ వేడుకల సందర్భంగా ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ రివీలైంది. అతని రాబోయే చిత్రం, ‘రాకీ ఔర్ రాణి కీప్రేమ్ కహానీ’ ఫస్ట్-లుక్ పోస్టర్‌ను మేకర్స్ గ్రాండ్ గా ఆవిష్కరించారు. స్టార్ నటులు అలియా భట్, రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.. అభిమానులకు ‘కభీ ఖుషీ కభీ ఘమ్’తో పాత మల్టీ-స్టారర్ వైబ్‌లను మళ్లీ తిరిగి వస్తుందని మేకర్స భావిస్తున్నారు. ఈ సందర్భంగా రిలీజైన మూవీ ఫస్ట్ లుక్‌లో రణవీర్, అలియా ఎలక్ట్రిఫైయింగ్ అవతార్‌లో తమ క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో అబ్బురపరుస్తున్నారు.
దీంతో పాటు నటుడు రణ్ వీర్ సింగ్, అలియా భట్ కూడా తమ సింగిల్ పోస్టర్లను తమ తమ సోషల్ మీడియా అకౌంట్లలో పోస్ట్ చేశారు. ‘మీట్ రాకీ’ అంటూ రణ్ వీర్, ‘మీట్ రాణి’ అంటూ అలియా తమ ఫస్ట్ లుక్ ను షేర్ చేశారు. వీరి పోస్టర్లు కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఇదిలా ఉండగా ఈ సినిమాలో రణవీర్, అలియాతో పాటు ధర్మేంద్ర, షబానా అజ్మీ, జయా బచ్చన్‌లతో పలువురు ప్రముఖులు కూడా ముఖ్యమైన పాత్రల్లో నటించనున్నారు. కాగా ‘రాకీ ఔర్ రాణి కీప్రేమ్ కహానీ’ సినిమా జూలై 28, 2023న థియేటర్లలోకి రానుంది.
నిర్మాతగా 25 సంవత్సరాలు
కరణ్ చిత్ర నిర్మాతగా 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన దర్శకత్వం వహించిన అన్ని చిత్రాల జ్ఞాపకాలతో ఒక వీడియోను పోస్ట్ చేశాడు. ఇందులో అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, కాజోల్, రాణి ముఖర్జీ, అలియా భట్, వరుణ్ ధావన్, సిద్ధార్థ్ మల్హోత్రా, రణ్‌వీర్ సింగ్, వివిధ సంస్థలకు చెందిన ఫుటేజీలు ఉన్నాయి. దాంతో పాటు తన రాబోయే దర్శకత్వ ప్రాజెక్ట్, ‘రాకీ ఔర్ రాణి కీప్రేమ్ కహానీ’లోని అన్ సీన్ గ్లింప్సెస్ ను కూడా షేర్ చేశారు. “నేను దర్శకుడిగా 25 సంవత్సరాలకు పూర్తి చేసుకున్నందుకు కృతజ్ఞత తప్ప మరేమీ చెప్పలేను. ఈ ప్రయాణంలో నేను పెరిగాను, ఏడ్చాను, నవ్వాను.. జీవించాను" అంటూ ఆయన క్యాప్షన్ లో రాసుకొచ్చాడు.
Read Also : విజయేంద్ర ప్రసాద్‌తో కలిసి కేదార్‌నాథ్ ఆలయాన్ని సందర్శించిన కంగనా రనౌత్