Kangana Ranaut : బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తర్వాత, నటి కంగనా రనౌత్ కేదార్‌నాథ్ పవిత్ర పుణ్యక్షేత్రాలను సందర్శిస్తోంది. తాజాగా ఆమె దర్శకుడు రాజమౌళి తండ్రి, ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్‌తో కలిసి కేదార్‌నాథ్ ఆలయాన్ని సందర్శించింది. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.


కేదార్‌నాథ్‌లో కంగనా రనౌత్


తన రాబోయే చిత్రం 'ఎమర్జెన్సీ' విడుదల కోసం ఎదురుచూస్తోన్న కంగనా రనౌత్.. ఇటీవల కేదార్‌నాథ్ ఆలయాన్ని సందర్శించింది. ఈ సందర్భంగా ఆమె తన అనుభవాన్ని సోషల్ మీడియాలో అందమైన వీడియో, ఫొటోల ద్వారా పంచుకుంది. కట్టుదిట్టమైన భద్రత మధ్య, దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి రూపొందించిన 'ఆర్ఆర్ఆర్' (RRR), ఎమర్జెన్సీ రచయిత విజయేంద్ర ప్రసాద్‌తో పాటు కైలాసానంద మహారాజ్, ఎమ్మెల్యే ఉమేష్ కుమార్ కూడా ఉన్నారు.






ఆలయ సందర్శన సమయంలో కంగనా సాంప్రదాయ నీలిరంగు దుస్తులను ధరించింది. గులాబీ రంగు బాంబర్ జాకెట్‌ తో అందర్నీ ఆకర్షించింది. నుదుటిపై గంధాన్ని పూసుకుని ఉన్న ఫొటోలను పోస్ట్ చేసిన ఆమె.. శివుడి దివ్యశక్తి ఉండే తీర్థయాత్రను సందర్శించడం ఎంత అదృష్టమో.. అని క్యాప్షన్ లో రాసుకొచ్చింది.


ఈ ఫొటోలతో పాటు కంగనా ఓ వీడియోను కూడా షేర్ చేసింది.హెలికాప్టర్ నుంచి తీసిన ఈ వీడియో కేదార్‌నాథ్ దేవాలయం ఏరియల్ వ్యూను చూపిస్తోంది. కెమెరా ఆమె వైపు తిప్పినపుడు "హర్ హర్ మహాదేవ్" అని కంగనా పాడటం ఈ వీడియోలో వినబడుతుంది. కేదార్‌నాథ్ దర్శనం చేసుకోవడం పట్ల కంగనా ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఎట్టకేలకు కైలాసనంద్ జీ మహారాజ్, విజయేంద్ర ప్రసాద్ లతో కలిసి కేదార్‌నాథ్ ను దర్శించానని, థ్యాంక్యూ ఉమేష్ భయ్యా అని వీడియోకు క్వాప్షన్ గా రాసుకొచ్చింది. దాంతో పాటు ఈ వీడియో చివర్లో రెండు ఫొటోలను కూడా ఆమె జతచేసింది.






కేదారనాథ్ వద్ద అక్షయ్ కుమార్


నటుడు అక్షయ్ కుమార్ మే 23న కేదార్‌నాథ్‌ను సందర్శించారు. ఆయన ఆలయంలోకి ప్రవేశించే సమయంలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. అంతకుముందు ఈ తీర్థయాత్రను సందర్శించాలనే అతని ప్రణాళికలను సీక్రెట్ గా ఉంచారు. దీనికి ఆలయ సందర్శనకు సంబంధించి ఓ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోలో అక్షయ్ ఆలయం వెలుపల తన అభిమానులను పలకరించేటప్పుడు భద్రత సిబ్బంది అతనికి రక్షణగా చుట్టుముట్టారు.


Read Also : రానా, తేజా కాంబో రిపీట్ - ఈ సారి మల్టీస్టారర్?