తెలంగాణ ఎంసెట్ పరీక్ష 2023 ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి విడుదల చేశారు. ఉదయం 9.30 గంటలకు హైదరాబాద్‌లోని మాసబ్‌ట్యాంక్ జేఎన్‌ఏఎఫ్‌ఏయూ ఆడిటోరియంలో ఈ ఫలితాలను విడుదల చేశారు. తెలంగాణలో 15 జోన్లు, ఏపీలో 6 జోన్లలో పరీక్ష నిర్వహించారని మంత్రి తెలిపారు.
అగ్రికల్చర్ స్ట్రీమ్ లో 1,10544 మంది పరీక్ష రాయగా, 91,935 మంది విద్యార్థులు (86 శాతం) ఉత్తీర్ణులయ్యారని మంత్రి తెలిపారు. ఇంజినీరింగ్ స్ట్రీమ్‌లో 1,53,890 మంది తెలంగాణ విద్యార్థులు పరీక్ష రాశారని, ఏపీ నుంచి 51,461 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. మొత్తం పరీక్ష రాసిన వారిలో 1,56,879 మంది ఉత్తీర్ణులయ్యారని మంత్రి తెలిపారు. ఎంసెట్‌లో పరీక్ష పాసైన వారికి మంత్రి అభినందనలు తెలిపారు. ఇంజినీరింగ్ స్ట్రీమ్‌లో బాలురు 79 శాతం ఉత్తీర్ణులు కాగా, 82 శాతం మంది అమ్మాయిలు పాసయ్యారని తెలిపారు. అగ్రికల్చర్ స్ట్రీమ్‌లో 84 శాతం మంది అబ్బాయిలు పాస్ కాగా, అమ్మాయిలు 87 శాతం మంది ఉత్తీర్ణులు అయ్యారని తెలిపారు.
ఇంజినీరింగ్ ఎంసెట్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
అగ్రి & ఫార్మసీ ఇంజినీరింగ్ ఫలితాల కోసం క్లిక్ చేయండి
అగ్రికల్చరల్ అండ్ మెడికల్ టాపర్స్
1.బూరుగుపల్లి సత్య ఫస్ట్ ర్యాంక్
2.నాసిక వెంకట తేజ
3.పసుపులేటి లక్ష్మి
4.దుర్గంపూడి కార్తికేయ రెడ్డి
5.బుర్ర వరుణ్ తేజ
ఇంజనీరింగ్ విభాగం లో టాపర్స్
1. సనపల్ల అనిరుద్ ఫస్ట్ ర్యాంక్
2. యాకంటి మనిందర్ రెడ్డి
3.చల్ల ఉమేష్ వరుణ్
4.అభినిత్ మంజెటి
5.పన్నతోట ప్రమోద్ కుమార్ రెడ్డి
ఇంజినీరింగ్ ఎంసెట్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి