Love Guru Press Meet: కోలీవుడ్ హీరో విజయ్‌ ఆంటోనీ, మృణాళిని రవి జంటగా నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ 'రోమియో'. ఈ చిత్రాన్ని తెలుగులో 'లవ్‌ గురు' అనే పేరుతో విడుదల చేస్తున్నారు. మీరా విజయ్ ఆంటోనీ సమర్పణలో విజయ్ ఆంటోనీ ఫిలిం కార్పొరేషన్ బ్యానర్ పై విజయ్ ఆంటోనీ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. వినాయక్ వైద్యనాథన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని రంజాన్ పండుగ సందర్భంగా ఏప్రిల్ 11న విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో ప్రెస్ మీట్ ను నిర్వహించారు. ఇందులో భాగంగా మీడియా ప్రతినిధులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానం చెబుతూ, 'ఫస్ట్ నైట్ రోజు మందు తాగితే తప్పేంటి?' అని హీరోయిన్ మృణాళిని ఎదురు ప్రశ్నించారు.


'లవ్‌ గురు' పోస్టర్ లో మృణాళిని రవి మందు కలుపుతున్నట్లుగా ఉండటంపై ఓ విలేఖరి ప్రశ్నించగా.. అది తాను తాగడానికేనని, విజయ్ ఆంటోనీకి సంబంధం లేదని బదులిచ్చింది. 'ఫస్ట్ నైట్ రోజు మందు తాగడమేంటి?' అని అడగ్గా.. 'మందు తాగడానికి రీజన్ కావాలా? ఎప్పుడైనా తాగొచ్చు' అని నవ్వుతూ సమాధానమిచ్చింది. ఇది సినిమాలో మాత్రమేనని, తన రియల్ లైఫ్ లో కాదని చెప్పుకొచ్చింది. మృణాళిని ఎంతో క్యూట్ గా తెలుగులో మాట్లాడిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


ఈ సందర్భంగా హీరో విజయ్ ఆంటోనీ మాట్లాడుతూ.. 'లవ్‌ గురు' అనేది ఈ సినిమాకు పర్‌ఫెక్ట్‌ టైటిల్‌. తమిళంలోనూ ఇదే టైటిల్‌ పెట్టాలనుకున్నాం. కానీ వేరే నిర్మాణ సంస్థ ఆ టైటిల్‌ను రిజిస్టర్‌ చేయించుకుంది. అందుకే అక్కడ ఆ పేరు ఉపయోగించడానికి వీలుపడలేదు. తమిళంలో 'రోమియో' అనే పేరుతో రిలీజ్ చేస్తున్నాం అని చెప్పారు. "దాదాపు 95 శాతం మందికి లవ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. గర్ల్స్ ను హ్యాండిల్ చేయడం అనేది అబ్బాయిలకు పెద్ద ప్రాబ్లం. ఈ సినిమా చూస్తే అమ్మాయిలను ఎలా హ్యాండిల్ చేయాలో తెలుస్తుంది. నేనే లవ్ గురులా ఆ పరిష్కారాలు చెబుతాను. ఇందులో లీలా అనే అమ్మాయితో నేను ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటాను. ఆ సమస్యలను ఎలా ఎదుర్కొన్నాను అనేది ఫన్నీగా ఈ సినిమాలో చూపించాం" అని విజయ్ చెప్పారు. 


"సినిమాలో సిస్టర్ సెంటిమెంట్ కంటే ప్రేమకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. లవ్ అనేది యూనివర్సల్ గా ఎక్కడైనా ఒక్కటే. 'లవ్ గురు' చూసిన తర్వాత పెళ్లైన వాళ్లు, పెళ్ళి కాని వాళ్లు తమ జీవితాల్లోని ఆడవారిని అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారు అని విజయ్ ఆంటోనీ చెప్పారు. హీరోయిన్ మృణాళిని రవి తన క్యారెక్టర్ ను ఎంతో బాగా అర్థం చేసుకుని ఆకట్టుకునేలా పర్ ఫార్మ్ చేసిందని తెలిపారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 11న రంజాన్ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో సుమారు 500 నుంచి 600 థియేటర్స్ లో విడుదల చేయబోతున్నట్లుగా చెప్పుకొచ్చారు. 


హీరోయిన్ మృణాలిని మాట్లాడుతూ.. "లవ్ గురు సినిమాలో లీలా అనే క్యారెక్టర్ నేను చేయగలను అని నమ్మి ఈ అవకాశం ఇచ్చిన విజయ్ ఆంటోనీకి థ్యాంక్స్. లీలా పాత్రలో నటించేందుకు నేను కలైరాణి దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాను. ఇది నాకు ఎంతో ఉపయోగపడింది. విజయ్ ఆంటోనీని ఇప్పటిదాకా సీరియస్ క్యారెక్టర్స్ లో చూశారు. కానీ ఈ సినిమాలో రొమాంటిక్ గా చూస్తారు. అది స్క్రీన్ మీద చాలా కొత్తగా ఉంటుంది. దీని తర్వాత విజయ్ ఆంటోనీకి గర్ల్ ఫ్యాన్స్ పెరుగుతారు. అలాగే రొమాంటిక్ స్క్రిప్ట్స్ కూడా చాలా వస్తాయి. నేను ఈ షూటింగ్ టైమ్ లో ఆయనను లవ్ గురులా భావించి సలహాలు తీసుకునేదాన్ని. నా బ్రేకప్ స్టోరీస్ ఆయనకు సరదాగా చెప్పేదాన్ని. ఇలా విజయ్ తో ఫన్ గా షూట్ జరిగింది. నాకు సపోర్ట్ చేసిన టీమ్ అందరికీ థ్యాంక్స్" అని అన్నారు. 


Also Read: 'సరిపోదా శనివారం' అప్డేట్ - పవర్ ప్యాక్డ్ యాక్షన్ కోసం సిద్ధమవుతున్న నాని!