Late Actor Puneeth Rajkumar Birthday: దివంగత నటుడు, కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ జయంతి నేడు. మార్చి 17 పునీత్ పుట్టిన రోజు. కన్నడ ప్రజలంతా దేవుడిగా భావించే ఈ హీరో మరణించి రెండేళ్లు దాటింది. ఇప్పటికి ఆయన మృతిని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. అభిమానులంత ప్రేమగా 'అప్పు' అని పిలుచుకునే ఈ హీరోని కన్నడిగులంతా దేవుడుగా భావిస్తారు. ఎందుకంటే ఎంతో పిల్లలకు చదువు, వృద్ధులు కోసం ఆశ్రమాలు నడిపిన ఆయన ఏ రోజు ఈ విషయాన్ని బయటపెట్టలేదు. దాదాపు 1800 అనాథ పిల్లలకు చదువు చెప్పించడమే కాదు వారి ఆలనా పాలనకు అయ్యే ఖర్చులు కూడా ఆయనే చూసుకున్నారు. పిల్లలు వదిలేసిన ముసలివాళ్లకు కొడుకు అయ్యారు. గోవులకు గోశాలలు కట్టించి మంచి మనసు చాటుకున్నారు.
స్టార్ హీరో అయినా ఒదిగిపోయి..
అలా ఎంతోమందికి అండగా నిలిచిన అప్పు హఠాన్మరణం సినీ ఇండస్ట్రీని విషాదంలోకి నెట్టింది . 2021 అక్టోబర్ 29న ఆయన గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. అయితే నేడు ఆయన జయంతి. ఈ సందర్భంగా ఈ కన్నడ సూపర్ స్టార్ స్మృతులను మరోసారి గుర్తు చేసుకుందాం.
కన్నడ ఇండస్ట్రీలో పునిత్ రాజ్‌కుమార్‌కు ప్రత్యేక స్థానం ఉంది. తన తండ్రి, దివంగత నటుడు రాజ్‌కుమార్ ఓ సూపర్ స్టార్, అన్న శివరాజ్ కుమార్ స్టార్ హీరో.. ఈయన పవర్ స్టార్. స్టార్ కుటుంబ నేపథ్యం అయినప్పటికి సింపుల్‌సిటికే ప్రాధాన్యత ఇచ్చారు. ఎలాంటి మూవీ కార్యక్రమైన తనకంటే సీనియర్ నటులకు పాదాభివందనం చేసి ఎందరో అభిమానం పొందారు. తన ఇండస్ట్రీలోని వారినే కాదు.. పక్క ఇండస్ట్రీ వారిని కూడా కలుపుకునిపోయారు. ఇతర హీరోలతోనూ ఎంతో స్నేహభావంతో ఉండేవారు.
ఓ సందర్భంగా ఆయనను పవర్ స్టార్ అని విలేకర్లు పిలవగా.. తాను పపర్ స్టార్ కాదని.. పవర్ స్టార్ ఒక్కరే ఆయనే పవన్ కళ్యాణ్ ఇచ్చిన సమాధానం ఇచ్చారు. ఆయన ఇచ్చిన ఈ సమాధానానికి తెలుగు ప్రజలంతా ఆయనకు ఫ్యాన్స్ అయిపోయారు. తెలుగులో ఆయన ఒక్క సినిమా చేయకపోయినా.. టాలీవుడ్‌తో పునిత్ రాజ్‌కుమార్‌కు సత్సంబంధాలు నడిపారు. టాలీవుడ్‌లో ఆయనకు ఎంతోమంది సన్నిహితులు ఉన్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్,రామ్ చరణ్, అల్లు అర్జున్ ఇలా ప్రతి ఒక్కరితో పునిత్ ఎంతో స్నేహంగా ఉండేవారు. వారందరితో పునిత్ సోదర భావంతో మెలిగేవారు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా మన తెలుగు హీరోలతో పునిత్ రాజ్‌కుమార్‌కు ఉన్న బాండింగ్ ఎలాంటిదో ఒకసారి గుర్తు చేసుకుందాం.
అప్పట్లో మెగాస్టార్ నివాసంలో..
పునిత్ ఓసారి హైదరాబాద్‌లో మెగాస్టార్ చిరంజీవిని స్వయంగా ఆయన నివాసంలో కలిశారు. తన అన్నయ్య రాఘవేంద్ర రాజ్‌కుమార్ కుమారుడి పెళ్లి సందర్భంగా చిరంజీవిని ఆహ్వానిస్తూ పునిత్ స్వయంగా ఆయన ఇంటికి వచ్చిన పెళ్లి కార్డు ఇచ్చారు. అప్పటికే కొన్ని దశాబ్దాలుగా పునిత్ రాజ్‌కుమార్ చిరుతో ఆయన కుటుంబంతో సత్సబంధాన్ని కలిగి ఉన్నారు. ఆయన తండ్రి రాజ్‌కుమార్‌కు కూడా చిరుతో మంచి అనుబంధం ఉండేది. ఇక బాలకృష్ణను ఓ సినిమా ఈవెంట్ లో కలుసుకున్న అప్పు ఆయనతో ఎంతో సన్నిహితంగా మెలిగారు. అప్పట్లో ఈ వీడియో కూడా బాగా వైరల్ అయ్యింది. అలాగే జూనియర్ ఎన్టీఆర్‌తో ఆయన ప్రత్యేకమైన అనుబంధం ఉంది. వీరిద్దరు అన్నయ్య అన్నయ్య అంటూ పిలుచుకుంటారు.
అప్పు సినిమాలో జూ. ఎన్టీఆర్ పాట
తారక్ బెంగళూరు ఎప్పుడు వెళ్లిన అక్కడ అప్పు ఇంటికి వెళ్లాల్సిందే. లేదంటే ఆయన స్వయంగా ఫోన్ చేసి పిలుపించుకునేవారు.అప్పు మీద అభిమానంతో ఎన్టీఆర్ ఆయన సినిమాలో ఓ పాట పాడిన సంగతి తెలిసిందే. పునిత్ నటించిన చక్రవ్యూహం సినిమా ఎన్టీఆర్ ఓ పాట పాడారు. అలాగే అప్పు కూడా ఈయన సినిమాలో ఓ పాట పాడారు. ఇక పునిత్ అన్నయ్య శివరాజ్ కుమార్ కూతురు పెళ్లిలో పునిత్ దర్శక ధీరుడు రాజమౌళిని అప్యాయంగా పలకరించిన ఆయన స్వాగతించిన తీరు ప్రతిఒక్కరిని ఆకట్టుకుంటుంది. ఆ టైంలో వారిద్దరి మధ్య సన్నిహిత్యం చూసి త్వరలో వీరి కాంబోలో ఓ సినిమా వస్తుందని అంతా అనుకున్నారు. అలాగే వార్తలు కూడా వచ్చాయి. కానీ అవి పుకార్ల వరకు పరిమితం అయ్యాయి. మన సూపర్ స్టార్ మహేష్ బాబుతో కూడా అప్పుకి మంచి అనుబంధం ఉంది.
కన్నడ, తెలుగు ఇండస్ట్రీ అయిన వీరిద్దరు మంచి స్నేహితులు. మహేష్ దూకుడు సినిమాను అప్పు రీమేక్ చేశారు. ఆ మూవీ ప్రమోషన్స్‌కి మహేష్ హాజరయ్యారు. అప్పుడు వారిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం చూసి ఇద్దరు హీరో ఫ్యాన్స్ తెగ మురిసిపోయారు.
మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా కొన్నెళ్ల క్రితం వచ్చిన పునీత్ 'జాకీ' సినిమా ఆడియో లాంచ్‌కు హాజరయ్యారు. ఈ ఈవెంట్‌లో వారు మంచి అనుబంధాన్ని చాటుకున్నారు. 2002లో పునీత్ మొదటి సినిమా 'అప్పు' పూరి జగన్నాధ్ దర్శకత్వంలోనే తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ సినిమాతోనే పునిత్ రాజ్‌కుమార్ అప్పుగా మారారు. అలా పునిత్ ఎప్పుడు సందర్భంగా వచ్చినప్పుడల్లా మన టాలీవుడ్ హీరోలతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకునే వారు. ఎన్నో సందర్భాల్లో మూవీ ఈవెంట్లలో పునిత్ రాజ్‌కుమార్ మన తెలుగు హీరోలను గురించి మాట్లాడిన మాటలు, ప్రశంసించిన సందర్భాలు చాలానే ఉన్నాయి.