Saripodhaa Sanivaaram: నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'సరిపోదా శనివారం'. టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇందులో నాని సరసన ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. 'జెంటిల్ మ్యాన్' తర్వాత వీరిద్దరూ జోడీగా నటిస్తున్న చిత్రమిది. దర్శక నటుడు ఎస్.జె సూర్య విలన్ పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ అండ్ టీజర్‌ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎప్పటిలాగే ఈరోజు శనివారం మేకర్స్ ఈ సినిమా షూటింగ్ కు సంబంధించిన అప్డేట్ అందించారు. 


ప్రస్తుతం 'సరిపోదా శనివారం' సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ మూవీ నెక్స్ట్ షెడ్యూల్ షూటింగ్ మార్చి 18వ తేదీ నుంచి ప్రారంభం కానుందని మేకర్స్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఈ సందర్భంగా ఇంట్రెస్టింగ్ పోస్టర్ ను షేర్ చేసారు. ఈ పవర్ ప్యాక్డ్ యాక్షన్ షెడ్యూల్ లో హీరో నానితో పాటు ఇతర ప్రధాన తారాగణం పాల్గొననున్నారు. ఇందులో యాక్షన్ సీన్స్ పాటు కొన్ని కీలక సన్నివేశాలని చిత్రీకరించనున్నారు. ఈ సీన్స్ సినిమాలో హైలెట్ గా నిలవబోతున్నాయని చిత్ర బృందం చెబుతోంది.






'సరిపోదా శనివారం' అనేది నాని కెరీర్ లో 31వ చిత్రం. పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. ‘అంటే సుందరానికి’ తర్వాత నాని, వివేక్ ఆత్రేయ
కాంబోలో రాబోతున్న ఈ సినిమాపై అందరిలో ఆసక్తి నెలకొంది. ఇప్పటి వరకు కామెడీ ఎంటర్టైనర్లు, రొమాంటిక్ లవ్ స్టోరీలతో అలరించిన వివేక్.. ఇప్పుడు విభిన్నమైన యాక్షన్ థ్రిల్లర్‌ తో వస్తున్నారు. ఇందులో నానిని మునుపెన్నడూ చూడని యాక్షన్-ప్యాక్డ్ క్యారెక్టర్‌లో ప్రెజెంట్ చేయబోతున్నారు. 


డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై డివివి దానయ్య, కళ్యాణ్ భారీ కాన్వాస్‌తో ఈ ప్రాజెక్ట్‌ని నిర్మిస్తున్నారు. జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి మురళి.జి  సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. కార్తీక శ్రీనివాస్ ఎడిటర్ గా వర్క్ చేస్తున్నారు. రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ ఫైట్స్ కంపోజ్ చేస్తున్నారు. 'సరిపోదా శనివారం' చిత్రాన్ని 2024 ఆగస్ట్ 29న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.


'దసరా' 'హాయ్ నాన్న' వంటి బ్యాక్ టూ బ్యాక్ బ్లాక్ బస్టర్స్ తర్వాత నాని నుంచి రాబోతున్న 'సరిపోదా శనివారం' సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ తో పాటుగా నాన్-థియేట్రికల్ హక్కులు భారీ రేటుకు అమ్ముడయ్యాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా థియేట్రికల్ హక్కులను స్టార్ ప్రొడ్యూసర్ దిల్‍ రాజుకు చెందిన చెందిన శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ దక్కించుకుంది. ఓటీటీ దిగ్గజం నెట్‍ ఫ్లిక్స్ ఈ మూవీ అన్ని భాషల డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను దాదాపు రూ. 40 కోట్లకు సొంతం చేసుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.


Also Read: ఈసారి రామ్ చరణ్ బర్త్ డే వెరీ వెరీ స్పెషల్.. ఎందుకంటే?