Mirnalini Ravi Funny Comments on Vijay Antony: మొన్నటి వరకు సీరియస్ రోల్స్ కనిపించిన విజయ్ ఆంటోని ఇప్పుడు లవర్ బాయ్‌గా అలరించబోతున్నాడట. బిచ్చగాడు వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత విజయ్ అంటోని లవ్ గురు సినిమాతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాడు. ఇప్పటి వరకు విజయ్ సీరియస్ రోల్స్‌లో కనిపించాడు. కానీ ఫస్ట్‌టైం 'లవ్ గురు'లో లవర్ బాయ్ అవతారం ఎత్తాడు. ఈ చిత్రంలో విజయ్ ఆంటోని సరసన 'గద్దలకొండ గణేష్' మూవీ ఫేం మృణాళిని రవి హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా రంజాన్ పండుగ సందర్భంగా ఏప్రిల్ 11న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో మూవీ టీం ఈ ప్రమోషన్స్ మొదలు పెట్టింది.
ఈ క్రమంలో నేడు టీం తాజాగా ప్రెస్‌మీట్ నిర్వహించి మూవీ విశేషాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా హీరోయిన్ మృణాళిని మాట్లాడుతూ.. ఎప్పుడు సీరియస్ కనిపించిన విజయ్ ఆంటోని గారిని ఈ చిత్రంలో సరికొత్తగా చూడబోతున్నారన్నారు. ఈ సినిమాలో ఆయన రొమాన్స్ బాగా చేశారంటూ విజయ్ ఆంటోనిపై సరదా కామెంట్స్ చేశారు. "విజయ్ ఆంటోనీని ఇప్పటివరకు సీరియస్‌గా చూశారు. లవ్ గురులో మీరు సరికొత్త విజయ్ ఆంటోనిని చూడబోతున్నారు. మొదటిసారి ఆయన రొమాంటిక్ కనిపించబోతున్నారు. ఇలా ఆయనను షాక్ అవుతారు. ఈ సినిమాలో ఆయన రొమాన్స్ బాగా చేశారు. ఈ మూవీ తర్వాత ఆయనకు లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోతుంది. అంతేకాదు లవ్, రొమాంటిక్ స్క్రిప్ట్స్ ఆయనకు క్యూ కట్టిన ఆశ్చర్యపోనవసరం లేదు.
Also Read: విశ్వక్ సేన్ 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది - ఆ రోజే థియేటర్లో సందడి
ఇక షూటింగ్ టైమ్ లో ఆయనను నేను లవ్ గురులా భావించి సలహాలు తీసుకునేదాన్ని. సెట్‌లో నా బ్రేకప్ స్టోరీస్ ఆయనకు సరదాగా చెప్పేదాన్ని. ఇలా విజయ్ గారితో షూటింగ్ మొత్తం ఫన్‌గా సాగింది. లీలాగా నా పాత్ర మిమ్మల్ని ఆకట్టుకుంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ పాత్ర కోసం నేను కలైరాణి మేడం దగ్గర స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నాను. తన సలహాలు, సూచనలు నాకు బాగా ఉపయోగపడ్డాయి" అంటూ చెప్పుకొచ్చారు. ఇక డబ్బింగ్ చిత్రాలతోనే విజయ్ ఆంటోని తెలుగులో మంచి మార్కెట్ సంపాదించుకున్నాకె. కెరీర్ ప్రారంభం నుంచీ వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ గా, ప్రొడ్యూసర్ గా, డైరెక్టర్ గా సత్తా చాటుతున్నారు. 'బిచ్చగాడు' సినిమాతో తెలుగులో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందనుకున్న విజయ్.. ఇటీవల 'బిచ్చగాడు 2' చిత్రంతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. అయితే ఇప్పటివరకు యాక్షన్, క్రైమ్ థ్రిల్లర్స్ తో మెప్పిస్తూ వస్తున్న నటుడు, ఇప్పుడు ఉన్నట్టుండి రొమాంటిక్ హీరో అనిపించుకోవాలని ఆశపడుతున్న ఆయనకు 'లవ్ గురు' ప్లస్ అవుతుందో లేదో చూడాలి. కాగా, లవ్ గురు చిత్రాన్ని దర్శకుడు వినాయక్ వైద్యనాథన్ రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కించారు. విజయ్ ఆంటోనీ సమర్పణలో గుడ్ డెవిల్ బ్యానర్ లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని 'లవ్ గురు' అనే పేరుతో తెలుగులోనూ రిలీజ్ చేస్తున్నారు.