Kroti Karbanda Wedding Pics: మరో బాలీవుడ్‌ జంట పెళ్లి పీటలు ఎక్కింది. ఈ ఏడాది స్టార్‌ హీరోయిన్స్‌ వరుసగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. కొద్ది రోజుల కిందట రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, మొన్న వాన హీరోయిన్‌ మీరా చోప్రాలు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఇప్పుడు తాజాగా 'తీన్‌మార్‌' బ్యూటీ కృతి కర్బంద పెళ్లి పీటలు ఎక్కింది. తన ప్రియుడు, బాలీవుడ్‌ హీరో పులకిత్​ సామ్రాట్​ ఆమె ఏడడుగులు వేసింది. కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్న  వీరిద్దరు నేడు మార్చి 16న ఢిల్లీలోని ఓ స్టార్‌ హోటల్లో అతి కొద్ది మంది సమక్షంలో మూడుమూళ్ల బంధంతో ఒక్కటయ్యారు. దీనికి సంబంధించిన ఫొటోలను కృతి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. దాంతో ఈ జంటకు సినీ ప్రముఖుల, ఫ్యాన్స్‌, నెటిజన్ల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. కాగా ప్రస్తుతం కృతి కర్బంద పెళ్లి ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 






కాగా బాలీవుడ్‌ హీరోయిన్‌ అయిన కృతి తెలుగు ఆడియన్స్‌కి కూడా బాగా సుపరితమే. బోణీ సినిమాతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన ఆమె ఆ తర్వాత పవన్‌ కళ్యాణ్‌ తీన్‌మార్‌ చిత్రంతో గుర్తింపు పొందింది. ఇందులో ఆమె అందం, అభినయానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆమె యాక్టింగ్‌కి కూడా మంచి మార్కులు పడ్డాయి. దాంతో ఇక్కడ వరుస ఆఫర్స్‌ అందుకుంది. అలా మొదలైంది, మిస్టర్‌ నూకయ్య, ఒంగోలు గిత్త, ఓం త్రీడీ, బ్రూస్‌ లీ ఇలా పలు చిత్రాల్లో నటించిన ఆమెకు తెలుగులో ఆఫర్స్‌ కరువయ్యాయి. దీంతో బాలీవుడ్‌ వెళ్లిన ఆమె అక్కడ వరుస ఆఫర్స్‌ అందుకుంటుంది. ఈ క్రమంలోనే హీరో పులకిత్‌ సామ్రాట్‌తో పరిచయమైంది. ఆ పరిచయం ప్రేమగా మారింది. కొంతకాలంగా సీక్కెట్‌ డేటింగ్‌లో వీరిద్దరు రిలేషన్‌లో ఉన్నట్టు గతంలోనూ చాలాసార్లు వార్తలు వచ్చాయి.


Also Read: 'ఊ అంటావా' పాట చేసేటప్పుడు భయంతో వణికిపోయాను - అసౌకర్యంగా అనిపించింది, మళ్లీ అలాంటి పాటలు అసలు చేయను


కానీ వాటిపై ఎప్పుడూ ఈ జంట స్పందించలేదు. అయితే ఈ ఏడాది పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న ఈ జంట ఓ వాలంటైన్స్‌ డేకి తమ రిలేషన్‌ని ఆఫీషియల్‌ చేశారు. గతేడాది క్రిస్మస్‌ సందర్భంగా ప్రియుడితో కలిసి సెలబ్రేట్‌ చేసుకున్న ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. ఇక కృతి తెలుగులో వరుసగా హీరోయిన్‌గా నటించిన ఆమెకు ఇక్కడ ఆశించిన గుర్తింపు రాలేదు. బ్రూస్‌లీ చిత్రంలో రామ్‌ చరణ్‌కు అక్క పాత్రలో నటించి షాకిచ్చింది. ఇక మెల్లిగా ఆమె అవకాశాలు కూడా తగ్గడంతో బాలీవుడ్‌కు షిఫ్ట్‌ అయ్యింది. అక్కడ హౌజ్‌ఫుల్‌-4 వంటి పలు చిత్రాల్లో నటించింద. కానీ అక్కడ కూడా కృతికి నిరాశే ఎదురైంది. ఒకటి రెండు హిట్లు తప్పితే కెరీర్‌లో చెప్పుకొదగ్గ కమర్షియల్‌ హిట్‌ లేదు.