Samantha About Oo Antava Song: స్టార్ హీరోయిన్ సమంత రీఎంట్రీకి రెడీ అయిన సంగతి తెలిసిందే. మయోసైటిస్ వ్యాధి చికిత్స కోసం లాంగ్ బ్రేక్ తీసుకున్న మళ్లీ యాక్టింగ్‌కు సిద్ధమైంది. ఈ క్రమంలో సమంత ఇండియా టూడే కాన్‌క్లేవ్‌కి ఇంటర్య్వూ ఇచ్చింది. ఈ సందర్భంగా సమంత తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలతో పాటు ప్రొఫెషనల్ విషయాలపై నోరు విప్పింది. ఈ సందర్భంగా ఆమె నటించిన తొలి ఐటెం సాంగ్ ఊ అంటావా మావ.. ఊఊ అంటావా మావా పాట టైం ఆమె ఎదురైన అనుభవాలను వెల్లడించింది. ఈ పాట షూటింగ్ టైంలో తాను వణికిపోయాంటూ షాకింగ్ విషయం రివీల్ చేసింది.
ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. "ఊ అంటావా పాట ఫస్ట్ షాట్ చేసేటప్పుడు భయపడ్డాను. ఎందుకంటే సెక్సీ అనే పదం నాకు పడదు. దాంతో ఫస్ట్ షాట్ చేసేటప్పుడు నా బాడీ వణికిపోయింది. నా వరకు ఊ అంటావా పాట, ఫ్యామిలీ మ్యాన్ లో రాజీ పాత్ర ఒకటే. కానీ ఈ రెండు నా సొంత నిర్ణయంతోనే చేశాను. ఎందుకంటే కొత్త తరహా ఎవరి ఇన్‌ఫ్లూయేన్స్ నా మీద లేదు. కానీ, ఇందులో లైంగికతతో నేను అసౌకర్యంగా అనిపించినా, నేను చేయగలను అనే నమ్మకం లేకపోయినా చేశాను. ఎందుకంటే కొత్త తరహా నటన పరిచయం చేయాలని, నటిగా నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలనే 'ఊ అంటావా మావా' పాట చేశాను" అంటూ చెప్పుకొచ్చింది.
అయితే భవిష్యత్తులో అలాంటి పాటలు మళ్లీ చేస్తారా? అని ప్రశ్నించగా చేయనని తేల్చేసింది. ఈ పాటలోనే లిరిక్స్ తనకు ఛాలెంజింగా అనిపించాయని, సెక్సీ అనే పదం తనకు సరిపడదని పేర్కొంది. కాగా'పుష్ప: ది రైజ్'మూవీ వచ్చి రెండేళ్లు దాటింది. 2021 డిసెంబర్ 17న రిలీజైన ఈ సినిమా బ్లాక్‌బస్టర్ విజయం సాధించింది. పాటలు అయితే ఓ రేంజ్‌లో మారుమోగాయి. ప్రపంచవ్యాప్తంగా పుష్ప పాటలకు విపరీతమైన బజ్ వచ్చింది. ముఖ్యంగా సమంత ఊ అంటావా పాటల అయితే ఇంటర్నేషన్ స్టేజ్‌పై కూడా ప్రదర్శించబడ్డాయి. అంతటి విజయం సాధించింది. అయితే సమంత వల్లే ఈ సాంగ్ అంత విజయం సాధించిందనడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే స్టార్ హీరోయిన్ అయిన ఆమె ఐటెం సాంగ్ నటించడంతోనే ఈ పాటపై బజ్ క్రియేట్ అయ్యింది. ఇక ఈ సాంగ్ రిలీజ్ అయినప్పుడు సమంతను దారుణంగా ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే. స్టార్ హీరోయిన్ అయిన ఆమె ఇలాంటి పాట చేయడం అవసరమా? అంటూ ఆమెను విమర్శించారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఇక తన వ్యాధి గురించి తప్పనిసరి పరిస్థితుల్లో బయటపెట్టాల్సి వచ్చిందన్నారు. తన బయట కనిపించకపోవడం ఎన్నో పుకార్లు, తప్పుడు ప్రచారం చేశారు.. వాటికి చెక్ పెట్టేందుకే తన వ్యాధి గురించి చెప్పాల్సి వచ్చిందన్నారు. ఆ టైంలో తన ఫీమేల్ ఒరియంటెడ్ చిత్రాల ప్రమోషన్ ఉందని, తను తప్పనిసరిగా ప్రమోషన్స్‌కి అటెండ్ అవ్వాలని డైరెక్టర్, నిర్మాతలు చెప్పారంది. లేదంటే సినిమా ప్లాప్ అయ్యే అవకాశం ఉందన్నారు. ఆ సమయంలో తాను హై డోస్‌లో మెడికేషన్‌లో ఉన్నానంది. అందుకే తన మయోసైటిస్ వ్యాధిని బయటపెట్టానంది, కానీ అంత నన్ను సింపతి డ్రామా ప్లే చేస్తుందన్నారు. సింపతి క్వీన్ అంటూ పిలిచారంటూ సమంత వాపోయింది.