Pawan Kalyan Ustaad Bhagat Singh Update: మెగా ఫ్యాన్స్‌కి అదిరిపోయే సర్‌ప్రైజ్‌ ఇచ్చింది మైత్రీ మూవీ మేకర్స్‌. ప్రస్తుతం ఎన్నిక ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సందడి మొదలైంది. ఏపీలో అయితే పార్లమెంట్‌, అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో అక్కడ రాజకీయాలు వాడివేడిగా ఉన్నాయి. దీంతో పవర్‌ స్టార్ పవన్‌ కళ్యాణ్‌తో ఎన్నికలతో ఫుల్‌ బిజీగా ఉన్నాడు. దీంతో ఆయన సినిమాలకు షూటింగ్స్‌కి లాంగ్‌ బ్రేక్‌ పడిందని అందరికి అర్థమైపోయింది. అంటే ఇప్పట్లో పవన్‌ సినిమాలు అప్‌డేట్స్‌ ఏం లేవని అంతా డిసైడ్‌ అయ్యారు. ఈ విషయంపై మెగా ఫ్యాన్స్‌ నిరాశలోనే ఉన్నారని చెప్పాలి. కానీ అందరి అంచనాలను తారుమారు చేశాడు డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌.


పవన్‌ ఎన్నికలతో బిజీగా ఉన్న తరుణంలో ఆయన లేటెస్ట్‌ మూవీ ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ నుంచి ఫ్యాన్స్‌కి బూస్ట్‌ ఇచ్చే అప్‌డేట్‌ ఇచ్చారు మేకర్స్. త్వరలోనే 'ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌' నుంచి క్రేజీ అప్‌డేట్‌ రానుందంటూ అందరిని సర్‌ప్రైజ్‌ చేశారు. ఈ మేరకు మైత్రీ మూవీ మేకర్స్‌ తమ ఎక్స్‌లో పోస్ట్‌ వదిలారు.  ఇది చూసి మెగా ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుష్‌ అవుతున్నారు. ఎక్ప్‌పెక్ట్‌ ది అన్‌ఎక్స్‌పెక్ట్‌ అంటూ క్యూరిసిటీ పెంచారు. ఉస్తాద్ భగత్‌ సింగ్‌ నుంచి ఊహించని అప్‌డేట్‌ రాబోతుందంటూ మేకర్స్‌ హైప్‌ పెంచారు. ఇది చూసి ఫ్యాన్స్‌ అంతా అంచనాలు వేసుకుంటున్నారు. ఎలాంటి అప్‌డేట్‌ రానుందంటూ అంచనాలు వేసుకుంటున్నారు. చాలా గ్యాప్‌ వస్తుందంటే మేకర్స్‌ భారీగానే ప్లాన్‌ చేసి ఉంటారంటూ అభిమానులంతా ఊహాల్లో తెలిపోతున్నారు. 






కాగా ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో పవన్‌ కళ్యాణ్‌ 'ఉస్తాద్‌ భగత్‌ సింగ్' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన గబ్బర్‌ సింగ్‌ ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పవన్‌ కెరీర్‌లోనే బిగ్గేస్ట్‌ బ్లాక్‌బస్టర్‌ మూవీ ఇది. దీంతో ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే సెట్స్‌పైకి వచ్చిన కొత్తలో షూటింగ్‌ను ఫాస్ట్‌ ఫాస్ట్‌గా జరుపుకుంటూ ఫస్ట్‌ గ్లింప్స్‌ వదిలాడు డైరెక్టర్‌ శంకర్‌. కానీ వపన్‌ రాజకీయాల వల్ల ఈ మూవీకి వరుస బ్రేక్‌లు పడుతుండటంతో అప్‌డేట్స్‌ ఏవీ రావడం లేదు. దాంతో ఒకానోక టైంలో మూవీ షూటింగ్‌ ఆగిపోయిందనే రూమర్స్‌ కూడా వచ్చాయి. కానీ, అలాంటిదేమి లేదని టీం స్పష్టం చేసింది. షూటింగ్‌ స్లో స్లోగా ముందుకు వెళుతుందంటూ అప్పుడప్పుడు లీక్స్‌ ఇచ్చారు.


అయితే మూవీ నుంచి ఇప్పటి వరకు ఫస్ట్‌ గ్లింప్స్‌ తప్ప మరే అప్‌డేట్‌ రాలేదు. ఇంతకాలం సైలెంట్‌గా మూవీ టీం ఇప్పుడు ఒక్కసారిగా అప్‌డేట్‌ అంటూ హడావుడి చేస్తున్నారు. అదీ కూడా పవన్‌ రాజకీయాల్లో బిజీగా ఉండగా. చాలా లాంగ్‌ గ్యాప్‌ తర్వాత వస్తున్న ఈ అప్‌డేట్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి శంకర్‌ ఫ్యాన్స్‌ కోసం ఎలాంటి సర్‌ప్రైజ్‌ ప్లాన్‌ చేశాడు, ఏ రేంజ్‌లో ఈ అప్‌డేడ్‌ ఉండనుందో చూడాలి. ఇది ఫ్యాన్స్‌ మత్రం పండగ చేసుకుంటున్నారు. మీ అప్‌డేట్‌ కోసం వెయిటింగ్‌ సార్‌? అంటూ తమదైన స్టైల్లో కామెంట్స్‌ చేస్తున్నారు నెటిజన్లు. మొత్తానికి చాలా రోజుల తర్వాత 'ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌' ఫ్యాన్స్‌ ట్రీట్‌ ఇవ్వబోతున్నమాట.