హీరోగా పరిచయం కాబోతున్న’తారే జమీన్ పర్’ కుర్రాడు


‘తారే జమీన్ పర్’ సినిమాతో దేశవ్యాప్తంగా అద్భుత గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శీల్ సఫారీ. చదువుల్లో వెనుకబడిన విద్యార్థిగా అతడు కనబర్చిన నటన ఎంతో ఆకట్టుకుంది. అమీర్ ఖాన్.. మట్టిలో మాణిక్యం లాంటి ఆ అబ్బాయిని, సానబట్టి మెరిసే వజ్రంలా మార్చే తీరు అద్భుతంగా ఉంటుంది. ఆ కుర్రాడు ఇప్పుడు పెద్దవాడు అయ్యాడు. ప్రస్తుతం హీరోగా పరిచయం కాబోతున్నాడు. దర్శీల్ సఫారీ, రేవతి పిళ్లై కీలక పాత్రల్లో నటించిన తాజా సిరీస్ ’క్యాపిటల్ ఎ స్మాల్ ఎ’తో ప్రేక్షకుల వస్తోంది. ఈ  షార్ట్ ఫిల్మ్ ఇవాళ్టి(నవంబర్ 17) నుంచి Amazon miniTVలో స్ట్రీమ్ కాబోతుంది.


ప్రేమ కథగా తెరకెక్కుతున్న ‘క్యాపిటల్ A స్మాల్ a’


ఇప్పటికే ‘క్యాపిటల్ ఎ స్మాల్ ఎ’ ట్రైలర్‌ ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటున్నది. ఈ ట్రైలర్‌ లో ఆది (దర్శిల్), ఆంషి (రేవతి) మధ్య యుక్త వయసులోని మధురమైన ప్రేమ వ్యవహారాన్ని చూపిస్తోంది. తొలి క్రష్ కు సంబంధించిన అద్భుత అనుభూతిని కలిగిస్తోంది. టీనేజర్లలోని అభద్రతా భావాలు, భయాలు వారిని ఎలా ప్రభావితం చేస్తాయో అనే విషయాలు ఈ చిత్రంలో చూపించబోతున్నారు. ఇక ఈ మూవీని గౌరవ్ జోషితో కలిసి సుమిత్ సురేష్ కుమార్ రూపొందించారు. 


ఈ సినిమాతో ఆ మార్పు తేవాలి అనుకుంటున్నాం!


తాజాగా ఈ సినిమా గురించి దర్శకుడు సుమిత్ కుమార్ సురేష్ కీలక విషయాలు వెల్లడించాడు. ''రొమాన్స్ డ్రామాలకు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం ఉంటుంది. సాధారణంగా, జీవితంలో, సమాజం, దాని అవగాహన అనేది చాలా ముఖ్యమైన విషయం. 'లోగ్ క్యా కహెంగే' అనే సామెత అనేక సంబంధాలను నాశనం చేసింది. కానీ, ‘ క్యాపిటల్ ఎ స్మాల్ ఎ’ చిత్రంతో మేము ఆ అవగాహనను మార్చాలి అనుకుంటున్నాం. తమ సినిమాలోని అన్షి, ఆది మధ్య సంబంధం, వారి ఆలోచనలు, వారి ప్రయాణం.. ప్రజలు బంధాలు, రిలేషన్‌షిప్స్‌ను చూసే విధానంలో మార్పులు తీసుకువస్తాయని మేం ఆశిస్తున్నాం” అని ఆయన వెల్లడించారు. 


జాన్వీ, సారాతో కలిసి పని చేయాలనుంది!


ఈ చిత్రం ద్వారా హీరోగా పరిచయం అవుతున్న దర్శీల్ సఫారీ, ఈ సినిమాకు సంబంధించిన అనే విషయాలు చెప్పాడు. “కరోనా కారణంగా తన జీవితంలో ఎన్నో విషయాలు చాలా ప్రభావానికి గురయ్యాయని వెల్లడించారు. బాలీవుడ్ లో ప్రస్తుతం జాన్వీ కపూర్, సారా అలీ ఖాన్‌ బాగా రాణిస్తున్నారని చెప్పాడు. వారితో కలిసి పనిచేయడానికి తాను ఎదురుచూస్తున్నాను అన్నాడు. “బాలీవుడ్ లో జాన్వీ, సారా బాగా రాణిస్తున్నారు. వారితో కలిసి పనిచేసే అవకాశం వస్తే ఎవరు కాదంటారు? నాక్కూడా ఆ అవకాశం వస్తుందని భావిస్తున్నాను. కొన్ని సంవత్సరాల తర్వాత నేను కూడా వారిలాగే రాణిస్తానని భావిస్తున్నాను” అని దర్శీల్ సఫారీ వెల్లడించాడు.


Also Read : 'అహ నా పెళ్ళంట' వెబ్ సిరీస్ రివ్యూ : రాజ్ తరుణ్, శివానీ రాజశేఖర్‌ల కామెడీ, రొమాన్స్ ఎలా ఉందంటే?



Read Also: హీరోలకూ లైంగిక వేధింపులు? కాస్టింగ్ కౌచ్ పై రణ్ వీర్ సింగ్ షాకింగ్ కామెంట్స్