Uttarakhand Viral News:


ఉత్తరాఖండ్‌లో..


పెళ్లంటే బోలెడంత హడావుడి ఉంటుంది. క్షణం తీరిక లేకుండా అందరూ కష్టపడితే కానీ...ఈ తంతు పూర్తవ్వదు. అయితే...ఈ మధ్య కాలంలో పెళ్లిళ్ల విషయంలో చూస్తున్నన్ని ట్విస్ట్‌లు సినిమా స్టోరీల్లో కూడా కనిపించడం లేదు. తీరా పెళ్లి పీటల వరకూ వచ్చాక ఆగిపోయిన వివాహాలు చాలానే ఉంటున్నాయి. ఆ మధ్య ఓ యువతి పెళ్లి పీటల నుంచి లేచి పెళ్లికి వచ్చిన లవర్‌ను పట్టుకుని ఏడ్చిన ఘటన అందరినీ షాక్‌కి
గురి చేసింది. ఆ తరవాత ఓ పెళ్లికొడుకు తనకు పెళ్లి ఇష్టం లేదని పారిపోతుండగా...అతడిని వెంటాడి మరీ పెళ్లి చేసుకుంది ఓ యువతి. ఇలాంటి వింత ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఉత్తరాఖండ్‌లోనూ ఇలాంటిదే జరిగింది. సాధారణంగా పెళ్లిళ్లలో ఇచ్చిపుచ్చుకోవటాలు ఉంటాయి. వధువు తరపున వాళ్లు వరుడికి కట్నకానుకలు ఇస్తారు. వరుడి తరపు వాళ్లు వధువుకి బంగారం, బట్టలు కొనిస్తారు. ఇదిగో ఉత్తరాఖండ్‌లో జరిగిన ఓ పెళ్లిలో ఈ విషయంలోనే చిక్కొచ్చి పడింది. తనకు కొనిచ్చిన పెళ్లి బట్టలు మరీ చీప్‌గా ఉందని హర్ట్ అయిన వధువు పెళ్లి క్యాన్సిల్ చేసేసుకుంది. కాస్ట్‌లీ లెహంగా కొనివ్వడానికి కూడా అంత ఆలోచిస్తారా అని మొహం పట్టుకుని అడిగేయడమే
కాదు...నీతో పెళ్లి వద్దు అని ఆ వరుడికి తేల్చి చెప్పేసింది.


వరుడి కుటుంబ సభ్యులు వధువు కోసం రూ.10వేలు పెట్టి లెహంగా కొనుగోలు చేశారట. కానీ...అది పెళ్లి కూతురుకి నచ్చలేదు. లక్నోలో ఓ స్పెషల్‌ షాప్‌లో కొన్నామని వాళ్లు చెప్పినా ఆమె నమ్మలేదు. ఈ విషయంలో వరుడి కుటుంబ సభ్యులు కాస్త అసహనానికి గురయ్యారు. మాట మాట పెరిగింది. చివరకు అదో పెద్ద వివాదానికి దారి తీసింది. ఒకరిని ఒకరు తిట్టుకునే వరకూ వెళ్లింది. చివరకు పోలీసులనూ ఆశ్రయించారు. ఓ పోలీస్ అధికారి జోక్యం చేసుకుని రెండు కుటుంబాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నం చేశారు. కానీ అది కుదరలేదు. చాలా సేపు వాదనలు జరిగిన తరవాత "పెళ్లి రద్దు చేసుకోవటమే బెటర్" అనే నిర్ణయానికి వచ్చాయి రెండు కుటుంబాలు. లెహంగా నచ్చలేదని వధువు అనగానే...వరుడి తండ్రి తన ATM కార్డ్ తీసి వధువుకి ఇచ్చాడట. "నీకు నచ్చినట్టు కాస్ట్‌లీ లెహంగా కొనుక్కో" అని చెప్పాడట. అదే ఇంత ఘర్షణకు దారి తీసిందని పోలీసులు చెబుతున్నారు.


Also Read: New Driving License: డ్రైవింగ్‌ టెస్ట్‌ అవసరం లేకుండానే మీరు డ్రైవింగ్‌ లెసెన్స్‌ పొందొచ్చు, ఇదే ప్రొసీజర్‌!