Stock Market Opening 17 November 2022: స్టాక్‌ మార్కెట్లు గురువారం ఫ్లాట్‌గా ఓపెనయ్యాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలే అందాయి. దాదాపుగా అన్ని రంగాల షేర్లు సెల్లింగ్‌ ప్రెజర్‌ ఎదుర్కొంటున్నాయి. బ్లాక్‌డీల్‌ జరగడంతో పేటీఎం షేర్లు కుదేలయ్యాయి. 10 శాతం పతనమై రూ.54 నష్టంతో 546 వద్ద కొనసాగుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 6 పాయింట్ల నష్టంతో 18,404 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 37 పాయింట్ల లాభంతో 61,027 వద్ద కొనసాగుతున్నాయి. 


BSE Sensex


క్రితం సెషన్లో 61,980 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 61,812 వద్ద మొదలైంది. 61,768 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 62,018 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 10 గంటలకు 37 పాయింట్ల లాభంతో 61,027 వద్ద కొనసాగుతోంది.


NSE Nifty


బుధవారం 18,409 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురువారం 18,358 వద్ద ఓపెనైంది. 18,351 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,404 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 6 పాయింట్ల నష్టంతో 18,404 వద్ద ట్రేడవుతోంది.


Nifty Bank


నిఫ్టీ బ్యాంక్‌ ఫ్లాట్‌గా ఉంది. ఉదయం 42,399 వద్ద మొదలైంది. 42,366 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 42,554 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 9 పాయింట్ల నష్టంతో 42,525 వద్ద చలిస్తోంది.


Gainers and Lossers


నిఫ్టీ 50లో 24 కంపెనీలు లాభాల్లో 26 నష్టాల్లో ఉన్నాయి. ఎల్‌టీ, సిప్లా, హిందుస్థాన్‌ యునీలివర్‌, టాటా  కన్జూమర్‌, హీరోమోటో కార్ప్‌ షేర్లు స్వల్ప లాభాల్లో ఉన్నాయి. టాటా మోటార్స్‌, హిందాల్కో, టైటాన్, టాటాస్టీల్‌, గ్రాసిమ్‌ షేర్లు నష్టపోయాయి.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.