Stock Market Closing 16 November 2022: స్టాక్‌ మార్కెట్లు బుధవారం ఒడుదొడుకుల్లో ట్రేడయ్యాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలే అందాయి. బ్యాంకింగ్‌ రంగ షేర్లకు గిరాకీ కనిపించింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 6 పాయింట్ల లాభంతో 18,409 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 107 పాయింట్ల లాభంతో 61,980 వద్ద ముగిశాయి. 


BSE Sensex


క్రితం సెషన్లో 61,872 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 61,708 వద్ద మొదలైంది. 61,708 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 62,052 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 107 పాయింట్ల లాభంతో 61,980 వద్ద ముగిసింది.


NSE Nifty


మంగళవారం 18,403 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ బుధవారం 18,398 వద్ద ఓపెనైంది. 18,344 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,442 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 6 పాయింట్ల లాభంతో 18,409 వద్ద క్లోజైంది.


Nifty Bank


నిఫ్టీ బ్యాంక్‌ లాభపడింది. ఉదయం 42,371 వద్ద మొదలైంది. 42,296 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 42,611 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఆఖరికి 162 పాయింట్ల లాభంతో 42,535 వద్ద ముగిసింది.


Gainers and Lossers


నిఫ్టీ 50లో 21 కంపెనీలు లాభాల్లో 29 నష్టాల్లో ఉన్నాయి. కొటక్‌ బ్యాంకు, కోల్‌ ఇండియా, కోల్‌ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ, హిందుస్థాన్‌ యునీలివర్‌, టీసీఎస్‌ షేర్లు లాభపడ్డాయి. అపోలో హాస్పిటల్స్‌, అదానీ పోర్ట్స్‌, హిందాల్కో, బజాజ్ ఫైనాన్స్‌, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ నష్టపోయాయి. బ్యాంకు మినహా మిగతా రంగాల సూచీలన్నీ ఎరుపెక్కాయి.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.