కాస్టింగ్ కౌచ్.. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని ఓ కుదుపు కుదిపిన అంశం. ఎంతో మంది నటీమణులు తమకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి బహిరంగంగానే వెల్లడించారు. సౌత్ నుంచి నార్త్ వరకు పలువురు హీరోయిన్లు కాస్టింగ్ కౌచ్ కు ఎలా గురయ్యారో చెప్పారు. పలువురు నటీమణులు చెప్పిన విషయాలు సంచలనం అయ్యాయి. పలువురు నిర్మాతలు, దర్శకులు, హీరోల నుంచి ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయో చెప్పారు. వాటిపై కౌంటర్లు, ఎన్ కౌంటర్లు పక్కన పెడితే కొద్ది సంవత్సరాలుగా ఈ అంశం ఇండస్ట్రీలో రగులుతూనే ఉంది. అయితే, ఇప్పటి వరకు లేడీ ఆర్టిస్టులు మాత్రమే కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడారు. అయితే, పురుషులకు కూడా ఇండస్ట్రీలో లైంగిక వేదింపులు ఉంటాయంటూ రణ్ వీర్ సింగ్ వెల్లడించాడు. తనకు ఎదురైన చేదు అనుభవాలు తెలిపాడు.
ఇండస్ట్రీలో అడుగు పెట్టిన కొత్తలో!
అనుష్క శర్మతో కలిసి ‘బ్యాండ్ బాజా బారాత్’ సినిమాతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన రణ్ వీర్ సింగ్.. తనకు ఎదురైన కాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని వెల్లడించాడు. ప్రస్తుతం బాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకడిగా కొనసాగుతున్నడు రణ్ వీర్ సింగ్. తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు రణవీర్. ఆ తర్వాత వరుస హిట్ సినిమాల్లో నటించి మెప్పించాడు. లూటేరా, గోలియోన్ కి రాస్లీలా రామ్ లీలా, బాజీరావ్ మస్తానీ, పద్మావత్, గల్లీ బాయ్, సింబా బ్లాక్ బస్టర్ సినిమాలు చేశాడు. తాజాగా ఈ బాలీవుడ్ అగ్ర హీరో.. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తొలి రోజుల్లో తనకు ఎదురైన షాకింగ్ కాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని గుర్తుచేసుకున్నాడు.
కాస్టింగ్ కౌచ్ అనుభవాలు నాకూ ఉన్నాయ్!
రణ్ వీర్ సింగ్ తాజాగా మర్రకేచ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 19వ ఎడిషన్ కు వెళ్లాడు. ఈ వేడుకలో ఎటోయిల్ డిఓర్ అవార్డును అందుకున్నాడు. అవార్డు తీసుకున్న అనంతరం మీడియాతో ఇంటరాక్ట్ అయ్యాడు. ఈ సందర్భంగా తనకు ఎదురైన కాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని వెల్లడించాడు. ‘‘ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన కొత్తలో ఓ వ్యక్తి నన్ను ఈసీడీ ప్రదేశానికి పిలిచి, నువ్వు కష్టపడి పనిచేసేవాడివా? లేదంటే తెలివైన వాడివా? నేను హార్డ్ వర్కర్ అని అనుకుంటున్నాను అన్నాడు. ఈ మాటల సందర్భంగా అతడు నన్ను డార్లింగ్, బి స్మార్ట్, సెక్సీ లాంటి పదాలతో సంబోధించాడు. ఇండస్ట్రీకి వచ్చిన తొలి మూడున్నరేళ్లలో నాకు అలాంటి అనుభవాలు చాలా ఎదురయ్యాయి. వాటన్నింటిని తట్టుకుని నిలబడ్డాను కాబట్టే ఇప్పుడు నేను ఈ స్థాయికి చేరాను అనుకుంటున్నాను” అని రణ్ వీర్ వెల్లడించాడు.
వరుస సినిమాలతో రణ్ వీర్ సింగ్ బిజీ బిజీ
ఇక రణ్ వీర్ సింగ్ చివరిగా జయేష్ భాయ్ ‘జోర్దార్’ సినిమాలో కనిపించాడు, ఇందులో షాలిని పాండే, బోమన్ ఇరానీ, రత్న పాఠక్ షా నటించారు. ప్రస్తుతం ఆయన పలు సినిమాల్లో నటిస్తున్నాడు. రోహిత్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సర్కస్’ సినిమాలో నటిస్తున్నాడు. ఇందులోజాక్వెలిన్ ఫెర్నాండెజ్, పూజా హెగ్డే, వరుణ్ శర్మ నటిస్తున్నారు. ఈ మూవీ 1982 నాటి హిందీ చిత్రం ‘అంగూర్’ ఆధారంగా రూపొందించబడుతోంది. అటు కరణ్ జోహార్ మూవీ ‘రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ’లోనూ నటిస్తున్నాడు. ఇందులో అలియా భట్, ధర్మేంద్ర, షబానా అజ్మీ, జయా బచ్చన్ కలిసి నటిస్తున్నారు.
Read Also: అమీర్ ఖాన్‌కు ‘లాల్ సింగ్ చద్దా’ దెబ్బ, నటనకు విరామం ప్రకటిస్తున్నట్లు వెల్లడి!