ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టిక్కెట్ల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. గతంలో జీవో నెం.35ను రద్దు చేస్తూ  హైకోర్టు తీర్పు చెప్పింది. ఈ జీవో ప్రకారం టిక్కెట్ రేట్లను ఖరారు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఈ తీర్పు కేవలం కోర్టును ఆశ్రయించిన ధియేటర్ యాజమాన్యాలకే వర్తిస్తుందని హోమ్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఆదేశాలు జారీ చేశారు. దీంతో గందరగోళం ఏర్పడింది. ఈ అంశంపై హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.  టికెట్ల ధరల నియంత్రణపై జీవో నంబర్‌ 35 రద్దు అందరికీ వర్తిస్తుందని స్పష్టం చేశారు.  


Also Read: యాస మార్చి, ఒకవైపు భుజం ఎత్తి... అల్లు అర్జున్ నటన అద్భుతం, పొగిడేసిన సమంత


ధరల పెంపుపై ప్రతిపాదనలను జాయింట్‌ కలెక్టర్లకు పంపాలన్న హైకోర్టు డివిజన్‌ బెంచ్.. వివరాలను అడిషనల్‌ అఫిడవిట్‌లో దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఇక, ఈ కేసులో తదుపరి విచారణను వచ్చే గురువారానికి వాయిదా వేసింది ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు. టిక్కెట్ల ధరల ఇష్యూ హైకోర్టులో ఉండగానే ప్రభుత్వం ఆదివారం మరో జీవోను జారీ చేసింది.  జీవో నె.142 ప్రకారం  ప్రకారం సినిమా టికెట్ల అమ్మకాలన్నీ ప్రభుత్వ నియంత్రణలో ఆన్‌లైన్‌ లోనే జరగాలి. 


Also Read: 'మగాడివైతే రా ఆడు అన్నారు..' ఇప్పుడు గెలిచి చూపించాడు.. సన్నీ గెలుపుకి కారణాలివే..


టికెట్ల అమ్మకాల బాధ్యతను ఆంధ్రప్రదేశ్‌ ఫిలిం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌కు ప్రభుత్వం అప్పగించింది. ఇందుకోసం ఐఆర్‌సీటీసీ లాంటి ఓ ప్రత్యేక వెబ్‌సైట్‌ను కూడా ఏర్పాటుచేయబోతున్నట్లు తెలిసింది. ఈ వెబ్‌సైట్‌ ద్వారానే ప్రేక్షకులు సినిమా టికెట్లను కొనుక్కోవాలి. ఇది అమలులోకి వచ్చాకా బుక్ మై షో లాంటి ప్రైవేటు బుకింగ్‌ ప్లాట్‌ఫామ్స్‌ ద్వారా ఏపీలో టికెట్స్‌ను బుక్‌ చేసుకోవడం కుదరదు. టిక్కెట్ రేట్లను కూడా ప్రభుత్వమే ఖరారు చేస్తుంది. 


Also Read:బ్రెస్ట్ క్యాన్సర్‌తో పోరాడుతున్న 'మిర్చి' బ్యూటీ.. గుండెబరువెక్కిస్తున్న ఎమోషనల్ ట్వీట్


ఇప్పటికే జాయింట్ కలెక్టర్ల కు దరఖాస్తు  చేసుకుని టిక్కెట్ రేట్లపెంపునకు అనుమతి పొందవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. కానీ అన్నీ ఇప్పుడు తమ అధీనంలోకి తీసుకుని కొత్త జీవో ఇవ్వడం కూడా కలకలం రేపే అవకాశం కనిపిస్తోంది. 



 


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి