Alekhya Chitti Pickles Ramya Moksha Gym Video Gone Viral: అలేఖ్య చిట్టి పికిల్స్... కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేసిన పేరు. నెట్టింట పచ్చళ్ల బిజినెస్ చేస్తూ పాపులర్ అయ్యారు ముగ్గురు అక్కచెల్లెళ్లు. అంతే స్థాయిలో రీల్స్ చేస్తూ పాపులారిటీ సంపాదించుకున్నారు. అయితే, అంత ధరలెందుకంటూ నెటిజన్లు కామెంట్ చేయగా బూతులతో రెచ్చిపోయారు ఓ సిస్టర్. దీంతో ఎంత పాపులర్ అయ్యారో అంతే స్థాయిలో విమర్శలను సైతం ఎదుర్కొన్నారు.
ఈ ముగ్గురు సిస్టర్స్‌లో రమ్య మోక్ష చాలా పాపులర్. పికిల్స్ బిజినెస్‌తో పాటే తన ఇన్ స్టా రీల్స్‌తో ఎక్కువ మంది ఫాలోవర్స్‌ను సంపాదించుకున్నారు. అలేఖ్య చిట్టి పికిల్స్‌కు ఈమెనే బ్రాండ్ అంబాసిడర్ అంటే అతిశయోక్తి కాదేమో. రమ్య ప్రమోట్ చేసే వరకూ ఈ పికిల్స్ గురించి ఎవరికీ తెలియదు.
ఫిట్‌నెస్ వీడియో... అట్రాక్టివ్ ఫోజులు
తాజాగా... రమ్య మోక్ష ఫోజులతో రీల్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. క్యూట్ లుక్స్‌తో మెస్మరైజ్ చేసేలా తన ఫిట్ నెస్ పెంచుకున్నట్లు ఉన్న వీడియోపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు దీనిపై విమర్శలు చేస్తుండగా... మరికొందరు లవ్, ఫైర్ సింబల్స్‌తో బ్యూటిఫుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
బిగ్ బాస్‌కు ముందు స్ట్రాంగ్ అవ్వాలనేనా?
కేవలం సోషల్ మీడియా రీల్స్... పాపులారిటీతోనే తమ పికెల్స్ బిజినెస్‌ను అమాంతం పెంచేసుకున్నారు అలేఖ్య సిస్టర్స్. అయితే... అత్యుత్సాహం, నెటిజన్లపై అసభ్య పదాలతో కామెంట్స్ చేయడం వంటి కారణాలతో తీవ్ర విమర్శలకు గురయ్యారు. ఎంత పాపులర్ అయ్యారో అంతే స్థాయిలో కిందకు పడిపోయారు. ఎన్నో విమర్శలు, కాంట్రవర్సీల తర్వాత... 'రమ్య మోక్ష పికిల్స్' అంటూ కొత్త బిజినెస్ కూడా స్టార్ట్ చేశారు.
ఈ సిస్టర్స్‌లో ఒకరు ఫేమస్ టీవీ రియాలిటీ షో 'బిగ్ బాస్' కొత్త సీజన్‌లో ఎంట్రీ ఇస్తారనే ప్రచారం సాగుతోంది. ఆ షో కోసమే రమ్య రెడీ అవుతున్నారనేలా ఆమె ఇన్ స్టా రీల్స్ ఉంటున్నాయి. పికెల్స్ కాంట్రవర్సీ తర్వాత ఫిజికల్‌గానూ, మెంటల్‌గానూ చాలా స్ట్రాంగ్ అయినట్లు కనిపిస్తోంది. ఇందులో భాగంగానే తన ఫిజికల్ ఫిట్ నెస్‌ను పెంచుకుంటున్నారు అనే టాక్ వినిపిస్తోంది.
Also Read: 'మాస్ జాతర' ఓలే ఓలే సాంగ్ వచ్చేసింది - ఫుల్ జోష్... రవితేజ, శ్రీలీల మాస్ స్టెప్పులు అదుర్స్
వచ్చిన వాడు గౌతమ్ మూవీలో...
అశ్విన్ బాబు హీరోగా వస్తోన్న 'వచ్చిన వాడు గౌతమ్' మూవీలో రమ్య మోక్ష నటించినట్లు తెలుస్తోంది. ఇటీవలే టీజర్ రిలీజ్ ఈవెంట్‌లో ఆమె సందడి చేశారు. ఈ సినిమాలో రియా సుమన్ హీరోయిన్‌గా నటించారు. దీంతో రమ్య... మూవీల్లోకి వచ్చేస్తున్నారంటూ నెటిజన్స్ కామెంట్స్ చేశారు. ఆ పాపులారిటీతోనే ఇప్పుడు బిగ్ బాస్