Ravi Teja's Ole Ole Song From Mass Jathara Movie: మాస్ మహారాజ రవితేజ, శ్రీలీల జంటగా నటించిన లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'మాస్ జాతర'. భాను భోగవరపు దర్శకత్వం వహించిన ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ 'ఓలే ఓలే' మాస్ సాంగ్ వచ్చేసింది. ఫుల్ ఎనర్జీ, ఫుల్ జోష్‌తో రవితేజ, శ్రీలీల మాస్ స్టెప్పులు అదరగొట్టారు.
శ్రీకాకుళం జిల్లా మొత్తం...
'శ్రీకాకుళం జిల్లా మొత్తం వెతికి తిరిగి పట్టుకున్నా యాడ నుంచి వచ్చావే చిలక గిలక మొలక' అంటూ ఉత్తరాంధ్ర స్లాంగ్‌లో సాగే లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ పాటకు భాస్కర్ యాదవ్ దాసరి లిరిక్స్ అందించగా... భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందించారు. భీమ్స్ సిసిరోలియో, రోహిన్ సొర్రాట్ పాాడారు.
Also Read: 'సలార్', 'యానిమల్' నటులతో 'చిత్రాలయం' వేణు కొత్త సినిమా... తెలుగు తెరకు నేపాల్ రాజవంశ కుమారి!
రవితేజ కెరీర్‌లో ఇది 75వ సినిమా. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ సాంగ్ 'తుమేరా లవర్' మాస్ ఆడియన్స్‌ను ఓ ఊపు ఊపేసింది. రవితేజ హిట్ మూవీ 'ఇడియట్'లోని 'చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే' పాటను రీమిక్స్ చేసి పాటను రూపొందించారు. దానికి మించేలా 'ఓలే ఓలే' సాంగ్ లిరిక్స్, మాస్ స్టెప్పులు అదిరిపోయాయి. శ్రీకాకుళం జిల్లా మొత్తం అంటూ ఉత్తరాంధ్ర యాసతో పాటు ఈలలు, చప్పట్లతో స్టెప్పులు వేయించేలా ఎంతో ఉత్సాహభరితంగా ఈ సాంగ్ సాగింది. మాస్ ఆడియన్స్‌కు ఫుల్ ట్రీట్ ఇచ్చేలా... రవితేజ, శ్రీలీల పోటాపోటీ డ్యాన్స్‌తో వేరే లెవల్‌కు తీసుకెళ్లారు.
మాస్ పండుగ కన్ఫర్మ్
రవితేజ, శ్రీలీల అంటేనే హిట్ జోడీ. వీరిద్దరి కాంబోలో వచ్చిన 'ధమాకా' బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఇప్పుడు మళ్లీ ఇదే కాంబో రిపీట్ కావడంతో భారీ హైప్ క్రియేట్ అవుతోంది. మాస్ మహారాజ ఫ్యాన్స్‌తో పాటు ఆడియన్స్ మెచ్చే విధంగా దర్శకుడు భాను బోగవరపు 'మాస్ జాతర'ను మలుస్తున్నారు. పాటల విషయంలోనూ ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. మాస్ రాజా వింటేజ్ వైబ్స్, కమర్షియల్ హంగులతో ఈ చిత్రంతో థియేటర్లలో మాస్ పండుగను తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది.
మూవీని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాల బ్యానర్స్‌పై వరుసగా ఘన విజయాలతో దూసుకెళ్తోన్న ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.
రిలీజ్ ఎప్పుడంటే?
ఈ మూవీని వినాయక చవితి సందర్భంగా ఆగస్ట్ 27న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా... ప్రమోషన్స్ భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు.