'సలార్'తో బాలీవుడ్ నటుడు టినూ ఆనంద్ (Tinnu Anand) తెలుగులో మరోసారి పాపులర్ అయ్యారు. గతంలో 'అంజి', 'ఆదిత్య 369' వంటి సినిమాలు ఆయన చేశారు. ఇప్పుడు మరో తెలుగు సినిమాకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అందులో 'సలార్'లో వరదరాజ మన్నార్ చిన్నప్పటి క్యారెక్టర్ చేసిన కార్తికేయ దేవ్ కూడా ఉన్నారు. అలాగే, 'యానిమల్' ఫేమ్ ఉపేంద్ర లిమయే కూడా! చిత్రాలయం స్టూడియోస్ పతాకం మీద వేణు దోనేపూడి ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా పూజతో మొదలైంది.
చిత్రాలయం స్టూడియోస్ సంస్థలో...భారీ తారాగణంతో కొత్త సినిమా షురూ!చిత్రాలయం స్టూడియోస్ సంస్థలో ప్రొడక్షన్ నెంబర్ 3గా గుణి మంచికంటి దర్శకత్వంలో నిర్మాత వేణు దోనేపూడి కొత్త సినిమా ప్రారంభించారు. కొండల్ జిన్నా సహ నిర్మాత. టినూ ఆనంద్, కార్తికేయ దేవ్ సహా ఉపేంద్ర, 'ఖైదీ' ఫేమ్ జార్జ్ మరియన్, అక్షయ్, విష్ణు, ఆస్తా, మాళవి ఇతర ప్రధాన తారాగణం. ఈ సినిమా ప్రారంభోత్సవం సోమవారం ఘనంగా జరిగింది.
చిత్రాలయం స్టూడియోస్ ప్రొడక్షన్ నంబర్ 3 ప్రారంభోత్సవంలో ముహూర్తపు సన్నివేశానికి రమేష్ ప్రసాద్ అక్కినేని స్క్రిప్ట్ అందించారు. కేఎస్ రామారావు కెమెరా స్విచ్ఛాన్ చేయగా... ఘట్టమనేని ఆదిశేషగిరి రావు క్లాప్ ఇచ్చారు. తొలి సన్నివేశానికి మహేష్ బాబు.పి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సినిమాతో నేపాల్ దేశ రాజవంశానికి చెందిన సమృద్ధి తెలుగు చిత్రసీమకు పరిచయం అవుతోంది. ఈ ప్రారంభోత్సవంలో కేఎల్ నారాయణ, తమ్మారెడ్డి భరద్వాజ్, పరుచూరి గోపాలకృష్ణ, బి గోపాల్, కోటగిరి వెంకటేశ్వరరావు, మాధవపెద్ది సురేష్, జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు తదితరులు ముఖ్య అతిథులుగా హాజరు అయ్యారు.
Chitralayam Studios Production No3 cast and crew: ఈ సినిమాలో టిను ఆనంద్, ఉపేంద్ర, జార్జ్ మరియన్, అక్షయ్, కార్తికేయ, అభినవ్, హర్ష, కిషోర్ కృష్ణ, ఆస్తా, మాళవి, సమృద్ధి, విష్ణు ఓయ్, కేఎల్ దామోదర్ ప్రసాద్, అనీష్ కురివిల్లా, కాదంబరి కిరణ్ తదితరులు ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి కళా దర్శకుడు: సాహి సురేష్, కూర్పు: విజయ్ ముక్తవరపు, ఛాయాగ్రహణం: అజయ్ అబ్రహం జార్జ్, కాస్ట్యూమ్స్: ప్రియాంక, నృత్య దర్శకత్వం: జేడీ మాస్టర్, యాక్షన్: నటరాజ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వైశాఖ్ నాయర్, సహ నిర్మాత: కొండల్ జిన్నా, సంగీతం: స్టీఫెన్ - ఆనంద్, నిర్మాణ సంస్థ: చిత్రాలయం స్టూడియోస్, నిర్మాత: వేణు దోనేపూడి, దర్శకత్వం: గుణి మంచికంటి.
Also Read: పవన్ సినిమాలో ఛాన్స్ మిస్... ఇప్పుడు ఫిక్స్... తెలుగు దర్శకుడితో పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్!