మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) డ్యాన్స్ కోసం సినిమాలు చూసే ప్రేక్షకులు ఉన్నారు. ఆయన వేసే స్టెప్పులకు అభిమానించే ఆడియన్స్ ఉన్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో అద్భుతంగా డ్యాన్స్ చేసే హీరోలలో ఎన్టీఆర్ ఒకరు. టాలీవుడ్ బెస్ట్ డాన్సర్లలో ఆయన పేరు ముందు వరుసలో ఉంటుంది.‌ సారీ సారీ... ఇప్పుడు ఎన్టీఆర్ పాన్ ఇండియా బెస్ట్ డాన్సర్ అని చెప్పాలి. ఆయనకు బాలీవుడ్ గ్రీక్ గాడ్ నుంచి కాంప్లిమెంట్ వచ్చింది.

రిహార్సల్స్ చేయాల్సిన అవసరం లేదు!Hrithik Roshan on War 2 song with NTR: టాలీవుడ్ హీరోలలో బాగా డ్యాన్స్ చేసేది ఎవరో మన ప్రేక్షకులు అందరికీ తెలుసు. మరి బాలీవుడ్ విషయానికి వెళితే... తమ స్టెప్పులతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసే హీరోలలో హృతిక్ రోషన్ ముందు వరుసలో ఉంటారు. ఆయనతో కలిసి ఎన్టీఆర్ 'వార్ 2' సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఇది యంగ్ టైగర్ స్ట్రయిట్ బాలీవుడ్ సినిమా. 

ఇటు ఎన్టీఆర్, అటు హృతిక్ రోషన్... ఇద్దరూ డ్యాన్స్ ఇరగదీస్తారు.‌ మరి ఆ ఇద్దరితో మాంచి డ్యాన్స్ నంబర్ చేయకపోతే ఎలా? 'వార్ 2' దర్శకుడు అయాన్ ముఖర్జీ ఒక స్పెషల్ డాన్స్ నెంబర్ తీశారు. అందులో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ అదరగొట్టారని బాలీవుడ్ నుంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి. ఇప్పుడు ఆ సాంగ్ గురించి హృతిక్ రోషన్ మాట్లాడారు. 

ఎన్టీఆర్ డ్యాన్స్ మీద హృతిక్ రోషన్ ప్రశంసల వర్షం కురిపించారు. ఒక్క కార్యక్రమంలో 'వార్ 2' సాంగ్ షూటింగ్ గురించి ఆయన మాట్లాడుతూ... ''నేను పని చేసిన కో - స్టార్లలో రిహార్సల్స్ చేయాల్సిన అవసరం లేని స్టార్ ఎన్టీఆర్. ప్రతి స్టెప్ ఆయన బాడీలో ఉంటుంది. మేము ఇద్దరం కలిసి ఒక సాంగ్ చేశాం. ఎన్టీఆర్ (NTR Song War 2)తో నటించడం ఎక్స్ట్రార్డినరీ ఎక్స్పీరియన్స్'' అని హృతిక్ రోషన్ తెలిపారు. 'ఆర్ఆర్ఆర్' సినిమాలో నాటు నాటు పాట ద్వారా ఎన్టీఆర్ డ్యాన్స్ ఎలా ఉంటుందో ఆస్కార్ స్టేజి మీద వరల్డ్ వైడ్ ఆడియన్స్ అందరూ చూశారు. అయితే హృతిక్ రోషన్ లాంటి బెస్ట్ డాన్సర్ నుంచి కాంప్లిమెంట్ రావడం అంటే సంథింగ్ స్పెషల్ కదా!

Also Readమాట మీద నిలబడిన పవన్... ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్ ఇచ్చే ట్వీట్!

ఏపీలో భారీ ఎత్తున ప్రీ‌ రిలీజ్ ఈవెంట్!ఎన్టీఆర్ నటించడం వల్ల 'వార్ 2' సినిమాకు తెలుగు రాష్ట్రాలలో భారీ క్రేజ్ నెలకొంది. ఆగస్టు 14న హిందీతో పాటు తెలుగు, తమిళ భాషలలో సినిమా విడుదల కానుంది. రిలీజ్ కంటే ముందు ఏపీలో భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. ఎప్పుడు? ఎక్కడ? అనే వివరాలు త్వరలో వెల్లడించనున్నారని సమాచారం.

తెలుగు రాష్ట్రాలలో 'వార్ 2' సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఎన్టీఆర్ లాస్ట్ ఫిలిం, బ్లాక్ బస్టర్ 'దేవర'ను కూడా ఆయన డిస్ట్రిబ్యూట్ చేశారు. ఇప్పుడు మరోసారి ‌ఎన్టీఆర్ సినిమా రిలీజ్ చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ 'డ్రాగన్' పూర్తి చేసిన తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించనున్న సినిమాతో పాటు 'జైలర్' ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో నటించనున్న సినిమాను సైతం నాగవంశీ కుటుంబం ప్రొడ్యూస్ చేస్తుంది.

Also Read: పవన్ సినిమాలో ఛాన్స్ మిస్... ఇప్పుడు ఫిక్స్... తెలుగు దర్శకుడితో పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్!