Bigg Boss Fame Priyanka Jain Varalaxmi Pooja With Her Lover: టీవీ సీరియల్స్‌తో పాటు బిగ్ బాస్ సీజన్ 7లో తన ఆటతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న బ్యూటీ ప్రియాంక జైన్. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ డిఫరెంట్‌గా తన మెమొరీస్‌ను పంచుకుంటుంటారు. ఇప్పటికే తన ప్రియుడు శివకుమార్‌ను పరిచయం చేయగా... త్వరలోనే వీరిద్దరూ పెళ్లి పీటలెక్కబోతున్నారు.
ప్రియుడితో కలిసి వరలక్ష్మి పూజ
ఈ కపుల్ శ్రావణ మాసం సందర్భంగా వరలక్ష్మి పూజలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోను ప్రియాంక్ తన ఇన్ స్టాలో షేర్ చేయగా వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు క్యూట్ కపుల్... ఆ దేవత ఆశీస్సులు మీపై ఉండాలి అంటూ కామెంట్స్ చేస్తుండగా మరికొందరు విమర్శిస్తున్నారు. 'పెళ్లి కాకుండానే ఇలా పూజలు ఏంటి సిగ్గులేదా?' అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేయగా... మరో నెటిజన్ 'నీ మెడలో తాళినే లేదు. ఈ పూజలు ఎందుకమ్మ?' అంటూ కామెంట్స్ చేశారు.
Also Read: మాస్ మహారాజ 'మాస్ జాతర' నుంచి న్యూ సాంగ్ అప్డేట్ - రిలీజ్ డేట్‌పై ఫుల్ క్లారిటీ
గతంలోనూ విమర్శలు
ప్రియాంక జైన్ (Priyanka jain) గతంలోనూ పలు ఫోటో షూట్స్‌తో విమర్శల పాలయ్యారు. ఆమె బర్త్ డే సందర్భంగా చెప్పుపై కేక్ పెట్టడంపై కొందరు నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ఆహారాన్ని కాలికి వేసుకునే చెప్పుపై పెట్టడం ఏంటి? కనీసం సంస్కారం లేదా? అన్నం కూడా ఇలాగే తింటావా? అంటూ ప్రశ్నించారు. ఆ తర్వాత తన తల్లితో ప్రెగ్నెన్సీ షూట్ అంటూ వైరైటీగా వీడియో తీశారు. ఆమె అమ్మకు మేకప్ వేస్తూ ప్రెగ్నెంట్ లేడీలా రెడీ చేయగా... 'మా అమ్మకు సీమంతం కూడా జరగలేదు. అందుకే ఇలా వెరైటీగా ప్లాన్ చేశాను.' అంటూ వీడియో షేర్ చేశారు. ఈ తతంగాన్ని ప్రియాంక ప్రియుడు శివకుమార్ రికార్డు చేశారు. అయితే, దీనిపై ఎందుకంత అతి అంటూ అప్పట్లో కొందరు కామెంట్స్ చేశారు.
మౌనరాగం, జానకి కలగనలేదు టీవీ సీరియల్స్‌తో మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు ప్రియాంక. ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 7లో పాల్గొని తన ఆటతో ఫేమస్ అయ్యారు. మౌనరాగం సీరియల్ టైంలోనే 2018లో హీరో శివకుమార్‌తో ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత అతని బర్త్ డే సందర్భంగా మోకాళ్లపై నిలబడి ప్రపోజ్ చేశారు. ఈ విషయాన్ని కూడా ప్రియాంక సోషల్ మీడియాలో పంచుకున్నారు. శివకుమార్‌ను ఆమె ముద్దుగా పరి అని పిలుచుకుంటారు. త్వరలోనే తాము వివాహ బంధంలోకి అడుగు పెట్టనున్నట్లు ఇప్పటికే ఈ కపుల్ ప్రకటించారు.