Bigg Boss Season 9 Agnipareeksha Judges: కింగ్ నాగార్జున హోస్ట్‌గా బిగ్ బాస్ సీజన్ 9 అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుంచి భారీ హైప్ క్రియేట్ అవుతోంది. మరికొద్ది రోజుల్లో ఫేమస్ బిగ్ రియాలిటీ షో ప్రారంభం కానుండగా... ఈసారి సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లతో పాటు సామాన్యులు సైతం ఎంట్రీ ఇచ్చేలా నిర్వాహకులు ప్లాన్ చేశారు.

వారికి అగ్ని పరీక్ష

సామాన్యుల నుంచి వేలాది అప్లికేషన్స్ రాగా దాదాపు 200 మందిని ఫిల్టర్ చేశారు యాజమాన్యం. అందులో 40 మందిని ఎంపిక చేసి వారికి అగ్ని పరీక్ష నిర్వహించనుంది. వీరికి కొన్ని స్పెషల్ టాస్కులు నిర్వహించిన తర్వాత ముగ్గురు లేదా నలుగురిని ఫైనల్ చేసి హౌస్‌లోకి ఎంట్రీ అయ్యే అవకాశం కల్పిస్తారు. ఈ టాస్కుల్ని 'స్టార్ మా'లో ప్రచారం చేస్తారని అంతా భావించినా... కేవలం జియో హాట్ స్టార్‌లోనే వీటిని స్ట్రీమింగ్ చేయనున్నారు. ఓటీటీ ఆడియన్స్ మాత్రమే సామాన్యులకు బిగ్ బాస్ పెట్టిన అగ్ని పరీక్షను చూడగలరు.

జడ్జెస్ వీళ్లే...

అసలు సామాన్యులకు పెట్టే 'అగ్ని పరీక్ష' ఏంటి అనేది ఆసక్తిగా మారింది. ఈ స్పెషల్ షోకు జడ్జెస్‌గా నవదీప్, శివన్న, సన్నీ, బింధు మాధవి, కౌశల్ వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. వీరు ఈ 40 మందికి డిఫరెంట్ టాస్కులు పెట్టి అందులోంచి ఫైనల్‌గా ఎంపిక చేస్తారు. గ్రూప్ డిస్కషన్స్, కామెడీ టాస్కులు ఉండనున్నట్లు టాక్ వినిపిస్తోంది. సెప్టెంబర్ 7 నుంచి షో ప్రారంభం కానుండగా... ఈ నెలలోనే వీరికి ఈ అగ్ని పరీక్ష కంప్లీట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. 

Also Read: ఏడాది తర్వాత ఓటీటీలోకి పుష్ప ప్రొడ్యూస‌ర్స్ మ‌ల‌యాళం మూవీ - తెలుగులోనూ స్ట్రీమింగ్ - ఎందులో చూడాలంటే?

కంటెస్టెంట్స్‌పై వీడని సస్పెన్స్

సోషల్ మీడియాలో ఫేమస్ అయిన వారు, ఇన్‌ఫ్లుయెన్సర్స్, టీవీ సెలబ్రిటీలు, యాక్టర్స్ ఇలా చాలామందికి ఈసారి హౌస్‌లోకి ఎంట్రీ లభించనుంది. గత సీజన్లలో కంటెస్టెంట్స్ విషయంలో ట్రోలింగ్స్ గురి కాగా ఈసారి ఆ మిస్టేక్ జరగకుండా అలర్ట్‌గా వ్యవహరిస్తున్నారు. హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చే సెలబ్రిటీలను హౌస్ట్ నాగార్జున ఒకటికి రెండుసార్లు పరిశీలించి ఛాన్స్ ఇవ్వనున్నారు. ఫేమస్ టీవీ షోస్ కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్, జాతిరత్నాలు షోల ద్వారా ఫేమస్ అయిన వారికి ఈసారి అవకాశం ఉంటుందనే టాక్ వినిపిస్తోంది.

ఈసారి హౌస్‌లోకి జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్, జబర్దస్త్ ఐశ్వర్య, బమ్ చిక్ బబ్లూ, రీతూ చౌదరి, సీరియల్ యాక్టర్స్ సాయికిరణ్, దేబ్జానీ, కావ్యశ్రీ, కన్నడ హీరోయిన్ కావ్యా శెట్టి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. వీరితో పాటే అలేఖ్య చిట్టి పికెల్స్ ఫేం రమ్య, కల్పికా గణేష్, సుమంత్ అశ్విన్, ఆరే రాజ్, శ్రావణి వర్మ, తేజస్విని గౌడ, దీపికా, వర్ష, పరమేశ్వర్ హివ్రాలే, తెలంగాణ ఫోక్ డ్యాన్సర్ నాగదుర్గా దత్తా, ఫోక్ సింగర్ లక్ష్మిలు కూడా హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తారనే టాక్ వినిపిస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. గతంలోలా కాకుండా ఈసారి కంటెస్టెంట్స్ మానసిక స్థైర్యం, వ్యక్తిత్వ వికాసం పొందేలా మైండ్ గేమ్స్ వంటి వాటిపై ఎక్కువగా ఫోకస్ చేయనున్నట్లు తెలుస్తోంది.