Bigg Boss 9 Telugu Streaming Platform: బిగ్ బాస్ తొమ్మిదో సీజన్‌కు సంబంధించిన ప్రతీ అప్డేట్ తెలుగు వీక్షకుల్లో ఆసక్తిని పెంచేస్తోంది. ఈ సారి ప్రత్యేకంగా సామాన్యుల కోసం బిగ్ బాస్ టీం జల్లెడ పడుతోంది. కామన్ మెన్ కేటగిరీకి ఈ సారి చాలా ప్రాధాన్యం ఇస్తున్నట్టు ఆల్రెడీ విడుదలైన ప్రోమోలు, స్టార్ మా ఇచ్చిన అప్డేట్స్ ద్వారా అర్థం అవుతోంది. ఈ క్రమంలో బిగ్ బాస్ టీం సాధారణ జనాల నుంచి అప్లికేషన్స్‌ను తీసుకుంది. అందులో కొంత మందిని సెలెక్ట్ చేసింది. ఇక వారికి అగ్ని పరీక్ష అంటూ కొన్ని టాస్కుల్ని పెట్టబోతోన్నారు.

సామాన్యులకు అగ్నిపరీక్ష...స్టార్ మాలో కాదు, ఓటీటీలో!'బిగ్ బాస్' తెలుగు సీజన్ 9కి సంబంధించి ఇప్పటికే కీలకమైన డీటైల్స్ అన్నీ కూడా ఆడియెన్స్‌కి తెలిసిపోయాయి. ఇక బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లే కంటెస్టెంట్లలో సామాన్యులు ఎంత మంది ఉంటారు? ఎవరు ఉంటారు? అన్నది కొన్ని టాస్కుల ద్వారా తెలియనుంది. ఈ టాస్కుల్ని కూడా ఆడియెన్స్‌కి చూపించబోతోన్నారట. అయితే ఇన్ని రోజులు ఈ ఎపిసోడ్స్, ఆ టాస్కుల్ని స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం చేస్తారని అంతా అనుకున్నారు. కానీ అలా చేయడం లేదని తాజాగా తెలుస్తోంది.

Also Read: తెలుగు 'బిగ్ బాస్'లో కన్నడ హీరోయిన్... లాస్ట్ ఇయర్ ఛాన్స్ మిస్, ఈసారి పక్కా!

సామాన్యులకు పెట్టే ఈ బిగ్ బాస్ అగ్ని పరీక్ష అనేది కేవలం జియో హాట్ స్టార్‌ ఓటీటీలోనే వస్తుందట. అంటే ఓటీటీ ఆడియెన్స్ మాత్రమే ఈ అగ్ని పరీక్షలకు సంబంధించిన టాస్క్‌ల్ని చూడగల్గుతారన్న మాట. మరి ఇది ఎన్ని వారాలు కంటిన్యూ చేస్తారు? ఎన్ని టాస్కులు పెడతారు? చివరకు ఎంత మంది కామన్ మ్యాన్‌‌లను సెలెక్ట్ చేస్తారు? అనేది చూడాలి. ఈ సారి బిగ్ బాస్ కంటెస్టెంట్లలో సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్స్‌ హంగామా ఎక్కువగా ఉండబోతున్నట్లు అర్థం అవుతోంది. 

Also Read: బిగ్‌ బాస్ బాలాదిత్య కొత్త సీరియ‌ల్ టైటిల్ ఇదే - 'వంట‌ల‌క్క‌'కు జోడీగా!

సోషల్ మీడియాలో ఫేమస్ అయినా, ట్రోలింగ్‌కు గురైనా కూడా బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ లభిస్తుందని అంతా ఫిక్స్ అయ్యారు. ఈ క్రమంలో ఈ తొమ్మిదో సీజన్లో అలేఖ్య పికిల్స్ రమ్య, పబ్‌లో గొడవతో ఫేమస్ అయిన కల్పికా గణేష్ వంటి వారు కనిపిస్తారని తెలుస్తోంది. మరి ఈ సారి ఇంట్లోకి అడుగు పెట్టే కంటెస్టెంట్ల లిస్ట్ తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. ఆగస్ట్ చివరి వారం లేదా సెప్టెంబర్‌ మొదటి వారంలో ఈ తొమ్మిదో సీజన్ ప్రారంభం కానున్నట్టుగా కనిపిస్తోంది.