టాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers). 'పుష్ప', 'పుష్ప 2', 'వాల్తేర్ వీరయ్య', 'ఉప్పెన'తో పాటు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన పలు తెలుగు సినిమాలు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. తెలుగుకే పరిమితం కాకుండా మలయాళం, హిందీ, తమిళ సినిమాలను ప్రొడ్యూస్ చేస్తోంది మైత్రీ మూవీ మేకర్స్.
మైత్రీకి మలయాళంలో షాక్...తెలుగులో వరుస విజయాలతో దూసుకుతున్న మైత్రీ నిర్మాతలకు మలయాళంలో మాత్రం గట్టి షాకే తగిలింది. గత ఏడాది మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో 'నడికర్' పేరుతో మలయాళంలో ఓ కామెడీ డ్రామా మూవీ వచ్చింది. టొవినో థామస్ హీరోగా భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. 2024లో మలయాళంలో నిర్మాతలకు అత్యధిక నష్టాలను మిగిల్చిన సినిమాల్లో ఒకటిగా నిలిచి 'నడికర్' నిరాశ పరిచింది.
ఏడాది తర్వాత ఓటీటీలోకి...థియేటర్లలో రిలీజైన ఏడాది తర్వాత 'నడికర్' మూవీ ఓటీటీలోకి వస్తోంది. ఈ యాక్షన్ డ్రామా మూవీ ఆగస్ట్ 8 నుంచి సైనా ప్లే ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ భాషల్లో 'నడికర్ తిలకం' రిలీజ్ అవుతున్నట్లు సైనా ప్లే ఓటీటీ ప్రకటించింది. ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
నలభై కోట్లు పెడితే... ఐదు వెనక్కి!టోవినో థామస్‌కు మలయాళంలో ఉన్న క్రేజ్ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకొని దాదాపు నలభై కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు నిర్మాతలు. ఫస్ట్ డే నుంచే దారుణంగా నెగిటివ్ టాక్‌ను మూటగట్టుకున్న ఈ మూవీ ఐదు కోట్ల లోపే వసూళ్లను రాబట్టి భారీగా నష్టాలను తెచ్చిపెట్టింది. 'నడికర్' మూవీలో దివ్యా పిళ్లై, సురేష్ కృష్ణ, సౌబీన్ షాహిర్, బాలు వర్గీస్ కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి లాల్ జూనియర్ దర్శకత్వం వహించాడు. 'నడికర్' సినిమా స్టోరీ ఏంటంటే?డేవిడ్ పడిక్కల్ (టోవినో థామస్) మలయాళ సినిమా ఇండస్ట్రీలో తక్కువ టైమ్‌లోనే సూపర్ స్టార్‌గా మారతాడు. ఈ సక్సెస్‌లతో అతడిలో గర్వం పెరుగుతుంది. విలాసాల్లో మునిగి తేలుతూ స్క్రిప్ట్‌లను సరిగ్గా పట్టించుకోకుండా సినిమాలు చేస్తాడు. ఫ్లాప్‌లతో అంతే త్వరగా కెరీర్‌లో డౌన్ అవుతాడు. యాక్టింగ్ రాదంటూ డేవిడ్‌ను కోషీ అనే డైరెక్టర్ సెట్స్‌లో అందరి ముందు కొడతాడు. ఆ సంఘటన డేవిడ్ జీవితాన్ని ఎలాంటి మలుపులు తిప్పింది? యాక్టింగ్ కోచ్‌గా డేవిడ్ జీవితంలోకి వచ్చిన బాలా ఎవరు? తన కొట్టిన డైరెక్టర్ చేతనే మంచి నటుడిగా డేవిడ్ నిరూపించుకున్నాడా? లేదా? అన్నదే ఈ మూవీ కథ.
Also Read: జపాన్‌లో 'మనం' రీ రిలీజ్... ఎప్పుడో తెలుసా? అక్కడ మన కింగ్ అక్కినేని నాగార్జున క్రేజ్ నెక్స్ట్ లెవల్