ఇండియన్ సినిమాలను జపనీస్ ప్రజలు ఇష్టపడుతున్నారు. జపాన్‌లో సూపర్ స్టార్ రజనీకాంత్‌కు మంచి ఫాలోయింగ్ ఉంది. 'ముత్తు' విడుదల తర్వాత ఆయనకు క్రేజ్ వచ్చింది. 'బాహుబలి' రెబల్ స్టార్ ప్రభాస్, 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం', 'దేవర' సినిమాల విడుదల తర్వాత మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అంటే జపనీయులు అభిమానం చూపిస్తున్నారు. అయితే కింగ్ అక్కినేని నాగార్జునకు జపాన్ దేశంలో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ నెక్స్ట్ లెవల్ అని చెప్పాలి. అందుకు 'మనం' రీ రిలీజ్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్.

ఆగస్టు 8న జపాన్‌లో 'మనం' రీ రిలీజ్!తెలుగు రాష్ట్రాల్లో ప్రజెంట్ రీ రిలీజ్ ట్రెండ్ కంటిన్యూ అవుతోంది. స్టార్ హీరోల సినిమాలు మళ్ళీ థియేటర్లలోకి వస్తుంటే అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. బట్ ఫర్ ఏ ఛేంజ్... ఇండియాలో కాదు, జపాన్‌లో 'మనం' మూవీ రీ రిలీజ్ అవుతోంది. 

ఆగస్టు 8న 'మనం' సినిమాను జపాన్‌లో రీ రిలీజ్ చేస్తున్నారు. బాలీవుడ్ సినిమా 'బ్రహ్మాస్త్ర' విడుదల తర్వాత, అందులో కింగ్ అక్కినేని నాగార్జున నటన చూసి జపనీయులు ఫిదా అయ్యారు. నాగ్ రీసెంట్ హిట్, బాక్స్ ఆఫీస్ బరిలో వంద కోట్ల వసూళ్లు సాధించిన 'కుబేర' ఓటీటీ రిలీజ్ తర్వాత జపాన్‌లో ట్రెండింగ్ టాపిక్ అయ్యింది. జపాన్ ప్రజల్లో నాగార్జునకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి 'మనం' సినిమాను అక్కడ రీ రిలీజ్ చేస్తున్నారు. 

జపాన్ ఫ్యాన్స్‌తో మాట్లాడనున్న నాగార్జున!నాగార్జునను జపాన్ ఫ్యాన్స్ 'నాగ్ సామ' అంటున్నారు. 'సామ' అంటే మర్యాద ఇవ్వడం. దేవుళ్లను, రాజులను, లెజెండరీ పర్సనాలిటీలను జపాన్ ప్రజలు 'సామ' అంటుంటారు. నాగార్జునకు భగవంతుని స్థాయిలో రెస్పెక్ట్ ఇస్తున్నారు. 'మనం' రీ రిలీజ్ సందర్భంగా తనపై ఇంత ప్రేమ, ఆదరణ చూపిస్తున్న జపాన్ అభిమానులతో నాగార్జున సమావేశం కానున్నారు. అయితే అది నేరుగా కాదు, వర్చువల్ మీట్.

Also Readమ‌హేష్‌ బాబు రిజెక్ట్ చేసిన క‌థ‌తో నాగార్జున సినిమా - క‌ట్ చేస్తే బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్ - ఆ మూవీ ఏదో తెలుసా?

'మనం' రీ రిలీజ్ అవుతున్న థియేటర్‌లో, సినిమా చూడటానికి వచ్చిన అభిమానులతో వీడియో కాల్ (జూమ్, గూగుల్ మీట్)లో నాగార్జున మాట్లాడేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడి ఫ్యాన్స్ అందరికీ అదొక మెమరబుల్ మూమెంట్ కానుంది. నాగార్జున ప్రజెంట్ సినిమాల విషయానికి వస్తే... 'కుబేర' తర్వాత 'కూలీ'తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆగస్టు 14న థియేటర్లలోకి వస్తున్న ఆ సినిమాలో సూపర్ స్టార్ రజనీకాంత్ (Coolie Telugu Release Date)కు ధీటైన విలన్ పాత్రలో నాగార్జున కనిపించనున్నారు.

Also Read: దళపతి విజయ్‌ను వాడేసిన 'బన్ బటర్ జామ్'... తెలుగులోకి తమిళ్ హిట్ ఫన్ ఫ్యామిలీ ఫిల్మ్ - రిలీజ్ ఎప్పుడంటే?