ఓ హీరో రిజెక్ట్ చేసిన కథతో మరో హీరో సినిమా చేయడం అన్నది ఇండస్ట్రీలో కామన్. అలా వచ్చి హిట్టయిన సినిమాలు చాలానే ఉన్నాయి. ఫ్లాపైన మూవీస్ కూడా ఉన్నాయి. కథల విషయంలో కొన్నిసార్లు కొందరి స్టార్స్ జడ్జ్‌మెంట్స్ కరెక్ట్ అయితే మరికొందరి అంచనాలు మాత్రం తప్పుతాయి.
'రాజకుమారుడు' తర్వాత?
మహేష్ బాబు (Mahesh Babu), నాగార్జున (Nagarjuna) కెరీర్‌లలో అలాంటి సిట్యూవేషన్ ఒకటి జరిగింది. డెబ్యూ మూవీ 'రాజకుమారుడు' బ్లాక్ బస్టర్ తర్వాత మహేష్ బాబుతో సినిమాలు చేసేందుకు అగ్ర దర్శక నిర్మాతలు చాలా మంది క్యూ కట్టారు. మహేష్ బాబు కోసం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ కేఎస్ రవి కుమార్ ఓ స్క్రిప్ట్ సిద్ధం చేశారు. కానీ ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్ళలేదు.
కోలీవుడ్ డైరెక్టర్ కేఎస్ రవికుమార్ కథకు మహేష్ బాబు ఓకే చెప్పడంతో ప్రొడ్యూసర్ ఎం అర్జున రాజు నిర్మాతగా ఆ సినిమాను అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. అప్పటికి 'యువరాజు' షూటింగ్‌తో మహేష్ బాబు బిజీగా ఉన్నారు. ఆ సినిమా తర్వాత కేఎస్ రవికుమార్ సినిమాను సెట్స్‌పైకి తీసుకు రావాలని నిర్మాత అనుకున్నారు.
'యువరాజు' ఫ్లాప్ కావడంతో...
'యువరాజు' బాక్సాఫీస్ వద్ద నిరాశపరచడంతో కేఎస్ రవికుమార్ సినిమాను పక్కన పెట్టారు మహేష్ బాబు. పెళ్లైన యువకుడిగా మహేష్‌ను 'యువరాజు' మూవీలో ఆడియెన్స్ చూడలేకపోయారు. సేమ్ కేఎస్ రవికుమార్ సినిమాలో అలాంటి పాత్రే తనది కావడంతో రిస్క్ అనే ఆలోచనతో ఈ సినిమాను రిజెక్ట్ చేశారు మహేష్. ఆ సినిమా ఏదో తెలుసా?
నాగ్ దగ్గరకు 'బావ నచ్చాడు'...
మహేష్ బాబు రిజెక్ట్ చేసిన కథతో నాగార్జున హీరోగా ఓ సినిమా మొదలు పెట్టాడు కేఎస్ రవికుమార్. అదే 'బావ నచ్చాడు' మూవీ. మహేష్ మూవీ కోసం అనుకున్న ప్రొడ్యూసర్, టెక్నీషియన్లతోనే 'బావ నచ్చాడు' రూపొందింది. ఈ మూవీలో నాగార్జునకు జోడీగా సిమ్రాన్, రీమా సేన్ హీరోయిన్లుగా నటించారు. భారీ అంచనాలతో రిలీజైన 'బావ నచ్చాడు' బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. నాగార్జున కెరీర్‌లోనే వరస్ట్ మూవీ అంటూ అభిమానులు 'బావ నచ్చాడు'పై దారుణంగా విమర్శలు కురిపించారు. 'బావ నచ్చాడు' విషయంలో మహేష్ బాబు జడ్జ్‌మెంట్ కరెక్ట్‌గా నాగార్జున అంచనాలు గురి తప్పాయి.
రాజమౌళితో మహేష్... 'కూలీ'లో నాగ్!
ప్రస్తుతం రాజమౌళితో ఓ అడ్వెంచరస్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ (SSMB29) చేస్తున్నాడు మహేష్ బాబు. దాదాపు వెయ్యి కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తోంది. మాధవన్, పృథ్వీరాజ్ సుకుమారన్‌తో పాటు పలువురు దక్షిణాది నటీనటులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.
మరోవైపు సూపర్ స్టార్ రజనీకాంత్ 'కూలీ' మూవీలో కింగ్ అక్కినేని నాగార్జున విలన్‌గా నటించాడు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్ట్ 14న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాలో ఆమిర్ ఖాన్, ఉపేంద్ర, సౌబీన్ షాహిర్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.
Also Read: పవన్ తాత జంటగా చమిందా వర్మ... సందీప్ కిషన్ క్లాప్‌తో 'హ్రీం' షురూ!