తెలుగు ప్రేక్షకులకూ దళపతి విజయ్ (Thalapathy Vijay) తెలుసు. కమర్షియల్ బ్లాక్ బస్టర్ సినిమాల దర్శకుడు అట్లీతో ఆయన చేసిన 'తెరి' (తెలుగులో 'పోలీస్') గుర్తు ఉందా? ఆ సినిమాలో 'Nenjil Kudiyirukkum' అని విజయ్ డైలాగ్ చెబుతాడు. దాంతో పాటు ఆ సన్నివేశంలో ఆయన మేనరిజాన్ని వాడేశారు 'బన్ బటర్ జామ్'లో హీరో రాజు జెయమోహన్. తమిళంలో జూలై 8న విడుదలైన ఈ సినిమా ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
మెహర్ రమేష్ విడుదల చేసిన టీజర్!రాజు జెయమోహన్ హీరోగానటించిన సినిమా 'బన్ బటర్ జామ్'. ఇందులో ఆధ్య ప్రసాద్, భవ్య త్రిఖ హీరోయిన్లు. రాఘవ్ మిర్‌దత్ దర్శకత్వం వహించారు. సురేష్ సుబ్రమణియన్ సమర్పణలో రెయిన్ ఆఫ్ ఎరోస్ సంస్థ ఫన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమాగా 'బన్ బటర్ జామ్'ను నిర్మించింది. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఫిల్మ్ ఇది. ఈ సినిమాను తెలుగులో ఆగస్టు 8న శ్రీ విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకం మీద సిహెచ్ సతీష్ కుమార్ విడుదల చేస్తున్నారు. మెహర్ రమేష్ చేతుల మీదుగా ఈ సినిమా తెలుగు టీజర్ విడుదలైంది.
ట్రెండీగా, ఫన్నీగా, యూత్ రిలేట్ అయ్యేలా!'బన్ బటర్ జామ్' టీజర్ గమనిస్తే... శరణ్య పొన్ వనన్ తన కొడుకు గొప్పతనం గురించి ఫోనులో ఎవరితోనో చెబుతుంటారు. ఆవిడ పక్కన తండ్రి చార్లీ కూడా ఉన్నారు. అదే సమయంలో హీరోను ఫన్నీగా పరిచయం చేశారు. హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ కథను సైతం వినోదాత్మకంగా చూపించారు. హీరో సిగరేట్ కాలుస్తున్న సమయంలో హీరోయిన్ తీసుకోవడం, ఆ తర్వాత 'అన్ని అలవాట్లు ఉన్నాయా?' అని హీరో అడగటం... అంతకు ముందు ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించడం వంటివి యూత్ రిలేట్ అయ్యేవే. దర్శకుడు రాఘవ్ మిర్‌దత్ టేకింగ్ బావుంది. తెలుగు ప్రేక్షకులకు సైతం నచ్చే అంశాలు సినిమాలో ఉన్నాయని అర్థం అవుతోంది.
Bun Butter Jam Movie Cast And Crew: రాజు జెయమోహన్, ఆధ్య ప్రసాద్, భవ్య త్రిఖ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు చార్లి, శరణ్య పొన్‌వన్నన్, దేవదర్శిన, మైకేల్ తంగదురై, విజె.పప్పు తదితరులు ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి రచన - దర్శకత్వం: రాఘవ్ మిర్‌దత్, నిర్మాతలు: రెయిన్ ఆఫ్ ఎరోస్ - సురేష్ సుబ్రమణియన్, సంగీతం: నివాస్ కె.ప్రసన్న, ఛాయాగ్రహణం: బాబు కుమార్, కూర్పు: జాన్ అబ్రహం, వి.ఎఫ్.ఎక్స్ నిర్మాత: స్టాలిన్ శరవణన్, కళ: శశి కుమార్, ప్రాజెక్ట్ డిజైనర్: సతీష్ కె, కొరియోగ్రఫీ: బాబి, స్టంట్స్: ఓం ప్రకాష్.