Ravi Teja's Mass Jathara Release Date Fixed: మాస్ మహారాజ రవితేజ మరో మాస్ ఎంటర్‌టైనర్‌ 'మాస్ జాతర'తో రాబోతోన్న సంగతి తెలిసిందే. ఆయన కెరీర్‌లోనే ఇది 75వ మూవీ కాగా భాను భోగవరపు ఈ సినిమాతోనే డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన లుక్స్, ఫస్ట్ సింగిల్ అదిరిపోయాయి. తాజాగా సెకండ్ సింగిల్‌పై బిగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. దీంతో పాటే రిలీజ్ డేట్‌పైనా ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు.

'ఓలే ఓలే' సాంగ్ ప్రోమో

ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ 'ఓలే ఓలే' సాంగ్ ప్రోమోను సోమవారం ఉదయం 11:08 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు టీం తెలిపింది. 'మళ్లీ మాస్ హిస్టీరియాను పెంచాల్సిన టైం ఆసన్నమైంది.' అంటూ సోషల్ మీడియా వేదికగా ఓ ఆసక్తికర పోస్టర్‌ను పంచుకుంది. ఇప్పటికే రిలీజ్ అయిన 'తు మేరా లవర్' సాంగ్ మాస్ ఆడియన్స్‌ను ఓ ఊపు ఊపేసింది. 'ఇడియట్' మూవీలో 'చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే' సాంగ్‌ను రీమిక్స్ చేసి ఫుల్ జోష్, బీట్, గ్రేస్ స్టెప్పులతో రవితేజ, శ్రీలీల అదరగొట్టారు. ఈ సాంగ్ అంతకు మించి ఉంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Also Read: పవర్ స్టార్ 'ఓజీ' తుపాన్ - వరల్డ్ వైడ్‌గా 'ఫైర్ స్ట్రోమ్'... రికార్డులే వెయిటింగ్

రిలీజ్ డేట్‌పై క్లారిటీ

సాంగ్ అప్డేట్‌తో పాటే రిలీజ్ డేట్‌పైనా ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 27న రిలీజ్ కానున్నట్లు తెలిపారు. వినాయక చవితి సందర్భంగా రవితేజ మాస్ జాతర చూసేందుకు రెడీ కావాలంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ వస్తున్నాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా... ప్రమోషన్స్ బిగ్‌‌గా ప్లాన్ చేస్తున్నారు. ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించినట్లు తెలుస్తోంది. అసలు సిసలు మాస్ కంటెంట్‌‌తో ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్ ఇస్తుందని మూవీ టీం పలు సందర్భాల్లో తెలిపింది.

ఈ సినిమాలో రవితేజ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. మాస్ మహారాజ సరసన బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయిసౌజన్య మూవీని నిర్మించారు. 'ధమాకా' వంటి సూపర్ హిట్ తర్వాత రవితేజ, శ్రీలీల కాంబోలో మూవీ కావడంతో భారీ హైప్ క్రియేట్ అవుతోంది. గత కొంతకాలంగా రవితేజ ఖాతాలో సరైన హిట్ పడలేదు. లాస్ట్‌గా వచ్చిన 'మిస్టర్ బచ్చన్' మూవీ నిరాశపరిచింది. 'క్రాక్', ధమాకా స్థాయిలో మంచి హిట్ కోసం ఆయన ఎదురుచూస్తున్నారు. ఈ మూవీతోనైనా మంచి హిట్ కొట్టాలని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.