Pawan Kalyan's OG Firestorm Song Hilarious Record: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లేటెస్ట్ గ్యాంగ్ స్టర్ యాక్షన్ థ్రిల్లర్ 'దే కాల్ హిమ్ ఓజీ' నుంచి ఫస్ట్ బ్లాస్ట్ 'ఫైర్ స్ట్రోమ్' తుపాను సృష్టిస్తోంది. పవన్ లుక్స్‌తో పాటు తమన్ హై ఎనర్జిటిక్ ట్యూన్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. దీంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. వారి ఆనందం రెట్టింపు చేసేలా ఈ పాట సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.
వరల్డ్ వైడ్ రికార్డు
ప్రస్తుతం అటు సోషల్ మీడియాలో ఇటు యూట్యూబ్‌లో 'ఫైర్ స్ట్రోమ్' పాట ట్రెండింగ్ అవుతోంది. ప్రపంచవ్యాప్తంగా మ్యూజిక్ వీడియోల్లో ఈ పాట రెండో స్థానంలో ఉంది. 'అన్ స్టాపబుల్ స్టార్మ్' అంటూ చిత్ర నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. దీనికి సంబంధించి లిస్ట్ షేర్ చేసింది. అందరూ ఊహించిన దాని కంటే ఎక్కువగా పవన్ తుపాను సృష్టించడం ఖాయమని... మరిన్ని రికార్డుల కోసం వెయిటింగ్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: బిగ్ బాస్ 9లో సామాన్యులకు అగ్ని పరీక్ష - జడ్జెస్ వీళ్లే... గెట్ రెడీ ఫర్ బిగ్ వార్
శింబు తమన్ వాయిస్...
ఈ సాంగ్‌లో మాస్ ఆడియన్స్‌కు ఫుల్ పవర్ ఇచ్చేలా తమన్ బీట్స్ అదరగొట్టారు. 'అలలిక కదలక భయపడెలే... క్షణక్షణమొక తల తెగిపడెలే.. ప్రళయం ఎదురుగ నిలబడెలే... ఓజెస్ గంభీర' అంటూ ఫుల్ జోష్‌తో సాగే లిరిక్స్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకూ ఆకట్టుకుంటున్నాయి. కోలీవుడ్ స్టార్ శింబుతో పాటు తమన్, నజీరుద్దీన్, భరద్వాజ్, దీపక్ బ్లూ ఈ పాట పాడారు. తెలుగు లిరిక్స్ విశ్వ, శ్రీనివాస్ రాయగా... రాజకుమారి ఇంగ్లీష్ లిరిక్స్ రాశారు. ఈమెనే పాటలో ఫీమేల్ వాయిస్ కూడా అందించారు. అద్వితీయ వొజ్జాల జపనీస్ లిరిక్స్ రాయగా... పవర్ స్టార్ లుక్స్, యాక్షన్, బీజీఎం వేరే లెవల్‌లో ఉన్నాయి.
ఫైర్... ది వారియర్
తమ హీరోను మాస్ వారియర్ లుక్‌లో చూడాలన్న పవర్ స్టార్ ఫ్యాన్స్ కల ఇన్నాళ్లకు నెరవేరినట్లు కనిపిస్తోంది. 'ఓజాస్ గంభీర' అంటూ పవన్‌కు ఇచ్చిన ఎలివేషన్ మామూలుగా లేదు. మూవీలో ఆయన సమురాయ్ రోల్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. వెపన్స్, మాఫియా, గ్యాంగ్ స్టర్ కల్చర్ బ్యాక్ డ్రాప్‌గా హై ఆక్టేన్ ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా మూవీని తెరకెక్కించినట్లు అర్థమవుతోంది.
ఈ మూవీకి సాహో ఫేం సుజీత్ దర్శకత్వం వహిస్తుండగా... డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య, దాసరి కల్యాణ్ నిర్మిస్తున్నారు. పవన్ సరసన ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్ రోల్ చేస్తున్నారు. వీరితో పాటే ప్రకాష్ రాజ్, శ్రియరెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్నారు. పవర్ స్టార్ ఫుల్ స్టార్మ్ చూడాలంటే సెప్టెంబర్ 25 వరకూ ఆగాల్సిందే.