Priyanka Shiv: బిగ్ బాస్ సీజన్ 7లో కంటెస్టెంట్‌గా వచ్చింది సీరియల్ నటి ప్రియాంక జైన్. అయితే బిగ్ బాస్‌లోకి రాకముందు తను తెలుగులో సీరియల్ నటిగా అడుగుపెట్టినప్పటి నుంచి తన కో యాక్టర్ శివ్‌తో ప్రేమలో ఉందని బుల్లితెరపై రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. ఇక వీరిద్దరూ కలిసి నటించే సీరియల్ అయిపోయిన తర్వాత యూట్యూబ్ ఛానెల్‌లో ఓపెన్ చేసి వారి ఫ్యాన్స్‌ను అలరించడం మొదలుపెట్టారు. ప్రియాంక, శివ్ పెళ్లి చేసుకుంటారని చాలాసార్లు రూమర్స్ వినిపించినా బిగ్ బాస్ హౌజ్‌లోనే దీనిని కన్ఫర్మ్ చేశారు. అలాగే ప్రియాంక బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్నప్పుడు శివ్ అక్కడికి వచ్చాడు. అదే సమయంలో తనకు ఒక బ్యాడ్ న్యూస్ ఉందని అన్నాడు. అదేంటో తాజాగా వారి యూట్యూబ్ ఛానెల్‌లో రివీల్ అయ్యింది.


ప్రియాంకకు అంత ధైర్యం లేదు..
ప్రియాంక, శివ్ కలిసి తాజాగా వారి యూట్యూబ్ ఛానెల్‌లో ఒక వీడియోను అప్లోడ్ చేశారు. అందులో వీరిద్దరూ కలిసి ఢిల్లీ వెళ్లారు. ‘‘మేము ఎయిర్‌పోర్టులో ఉన్నాం. ఢిల్లీ వెళ్తున్నాం. మేము హైదరాబాద్ వదిలేసి యూఎస్ షిఫ్ట్ అయిపోతున్నాం. అందుకే యూఎస్ వీసా కోసం వెళ్తున్నాం’’ అని ఒక్కసారిగా షాక్ ఇచ్చాడు శివ్. దానికి ప్రియాంక కూడా ‘‘సారీ. ఇదొక సడెన్ న్యూస్‌లాగా చెప్పాల్సి వస్తుంది కానీ తప్పలేదు. నిజంగా సారీ. మేము వెళ్తున్నాం. కానీ ఎందుకు, ఏంటి అని వీడియోలో చెప్పబోతున్నాం’’ అని వివరించింది. ‘‘యూఎస్ వీసా కోసం అప్లై చేశాం. ప్రియాంకకు అంత ధైర్యం లేదు అప్లై చేయడానికి. ఆ ధైర్యం నాకు ఉంది. నేను అప్లై చేశాను. నాకు ఇంటర్వ్యూ ఉంది’’ అని శివ్ చెప్తుండగానే.. ‘‘నేను బిగ్ బాస్‌కు వెళ్లే ధైర్యం చేశాను. నువ్వు చేయలేదు’’ అని పంచ్ వేసింది ప్రియాంక. అలా హైదరాబాద్ నుంచి తమ ఢిల్లీ ప్రయాణాన్ని మొత్తం వీడియోలో చూపించారు ప్రియాంక, శివ్.


అడ్డుకున్న సెక్యూరిటీ..
ఇక హైదరాబాద్‌లో ల్యాండ్ అవ్వగానే అక్కడ చాలా చలిగా ఉందని అప్డేట్ ఇచ్చాడు శివ్. ఆ తరువాతి రోజు ఉదయాన్నే వీసా ఇంటర్వ్యూకు సిద్ధమయ్యాడు. ప్రియాంకను ఆశీర్వాదం కావాలంటూ అడగగా.. ‘‘ఎగ్జామ్‌లో పాస్ అయ్యి రా’’ అంటూ ఆల్ ది బెస్ట్ చెప్పింది. ‘‘నా చేతిలో ఏం లేదు. అంతా దేవుడి చేతిలో ఉంది’’ అంటూ బయల్దేరాడు శివ్. ‘‘జీవితంలోనే పెద్ద పరీక్ష ఇది. పాస్ అయ్యి వచ్చేద్దాం. పాస్ అయినా ఫెయిల్ అయినా చిల్ అంతే’’ అన్నాడు. ఇక యూఎస్ ఎంబస్సీని వీడియో తీయబోతుండగా అక్కడ ఉన్న సెక్యూరిటీ అడ్డుకున్నారు. దీంతో అక్కడ నుంచి ఏమీ అప్డేట్ ఇవ్వలేకపోయాడు శివ్. కానీ వీసా దొరికింది అనే గుడ్ న్యూస్‌తో ప్రియాంక దగ్గరకు వచ్చాడు.


కేవలం 20 సెకండ్లు..
‘‘నాకు వీసా వచ్చింది. ప్రియాంక కాళ్లు మొక్కి వెళ్లాను. తన ఆశీర్వాదం వల్లే వీసా వచ్చింది. మొదటి అవకాశంలోనే వీసా వచ్చింది’’ అంటూ తనను అక్కడ ఏం ప్రశ్నలు అడిగారో బయటపెట్టాడు శివ్. ‘‘న్యూయార్క్ వెళ్లాలని రాసాను. ఎందుకు వెళ్తున్నారు అని అడిగింది. నేను తెలుగు ఇండస్ట్రీలో యాక్టర్‌గా ఉన్నాను. రీసెంట్‌గా నా సీరియల్ అయిపోయింది. గత మూడేళ్ల నుంచి నేను దానికి పనిచేశాను. ఇప్పుడు రెండు నెలలు ఫ్రీగా ఉన్నాను. ఈ టైమ్‌లో వెళ్లి రావాలనుకుంటున్నాను అని చెప్పాను. నా ఆన్యూవల్ ఇన్‌కమ్ ఎంత అని అడిగింది. బడ్జెట్ ఎంత, ఎవరెవరు వెళ్తున్నారు అని అడిగింది. ఒక 20 సెకండ్లలో అయిపోయింది. అంతే వీసా అప్రూవ్ అని చెప్పి పంపించింది’’ అని తెలిపాడు. తనకు తెలిసిన చాలామంది ఎన్నో అటెంప్ట్స్ చేసినా వారికి వీసా రాలేదని, తనకు వచ్చిందని సంతోషం వ్యక్తం చేశాడు శివ్. అయితే, ప్రియాంకకు వీసా లేకపోవడంతో శివ్‌కు దూరంగా ఉండక తప్పదు. మరి, శివ్ అమెరికాకు వెళ్తున్నా కారణం ఏమిటనేది స్పష్టంగా చెప్పలేదు. వారి యూట్యూబ్ థంబ్‌లో మాత్రం అమెరికాకు షిఫ్ట్ అవుతున్నట్లు పెట్టారు. వీడియో చివర్లో ప్రియాంక కూడా వీసా రాగానే అమెరికాకు వెళ్లనున్నట్లు చెప్పింది.



Also Read: ‘హనుమాన్’ టీమ్‌కు కన్నడ హీరో సుదీప్ సపోర్ట్