బిగ్ బాస్ సీజన్ 8 లో ఒక్కొక్క కంటెస్టెంట్ ఒక్కో స్ట్రాటజీతో గేమ్ ను ఆడుతున్నారు. అయితే అందరిలోనూ నాగ మణికంఠ చాలా ప్రత్యేకమైనే చెప్పాలి. ఓ వైపు సింపతి కార్డు వాడుతూనే మరోవైపు మైండ్ గేమ్ ఆడుతున్నాడు.  కానీ తాజా ఎపిసోడ్ చూసాక మణికంఠ ఆటలు ఇంకా ఎంతో కాలం సాగవు అనిపిస్తోంది. 


మళ్ళీ మళ్ళీ అదే అస్త్రం 
మణికంఠ బిగ్ బాస్ హౌస్ లోకి రావడం రావడంతోనే తన శాడ్ స్టోరీని చెప్పి ప్రేక్షకులను ఏడిపించాడు. హౌస్ లోకి వెళ్ళాక కూడా రెండు రోజుల పాటు అదే కంటిన్యూ చేశాడు. ఒకానొక టైమ్ లో అసలు ఏంటి ఈ వ్యక్తి అని చిర్రెత్తుకొచ్చింది కూడా. అయితే హౌస్ మేట్స్ అందరూ ఎవరితోనూ సరిగ్గా కలవట్లేదు అనే రీజన్ తో అతన్ని నామినేట్ చేయడంతో బరస్ట్ అయిపోయి తన బాధను వెళ్లగక్కాడు మణికంఠ.  ఆ తర్వాత "నేను సింపతి కార్డు వాడను. మారి గేమ్ ఆడుతాను" అంటూ నాగార్జునకు, బిగ్ బాస్ కు ప్రామిస్ చేశాడు. చేసినట్టుగానే మారి చూపించారు కూడా. అప్పటికి ఇప్పటికీ గమనిస్తే మొదటి వారంలో మనం చూసిన ఆ నాగ మణికంఠ నేనా ఇప్పుడున్నది అనే డౌట్ వస్తుంది. బాగా ఆడుతున్నాడు, అందరితో మింగిల్ అవుతున్నాడు అనుకునేలోపే అతని గేమ్ స్ట్రాటజినీ బయట పెట్టాడు. డే 17 రోజున జరిగిన ఎగ్ కలెక్టింగ్ టాస్క్ లో పృథ్వీ తోసేయడంతో నాగ మణికంఠ ఎగిరి అవతల పడ్డాడు. అసలు అది ఇన్టెన్షనల్ గా జరగకపోయినా నాగ మణికంఠ స్పృహ తప్పడంతో బిగ్ బాస్ మెడికల్ రూమ్ కి పంపించారు. ఆ తర్వాత ఏం కాలేదు అంటూ హౌస్ లోకి పంపించారు. అయితే ఇంతా జరిగినప్పటికీ వదలకుండా నేను ఆడతాను అంటూ పట్టుపట్టాడు నాగ మణికంఠ. దీంతో అభయ్ "నువ్వు ఉన్నావా పోయావో కూడా కాసేపు మాకు అర్థం కాలేదు. నీకోసం బయట ఇద్దరు వెయిట్ చేస్తున్నారు. ఇలా గేమ్ ఆడాల్సిన అవసరం లేదు. గేమ్ ఒక్కటే ప్రపంచం కాదు" అంటూ నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. కానీ మణికంఠ మాత్రం ఏడుస్తూ వెంటనే సింపతీ కార్డును బయటకు తీశాడు. "నేను గేమ్ ఆడాల్సిందే. టైటిల్ గెలవాల్సిందే. లేదంటే నా పెళ్ళాం పిల్లలు నాకు దక్కరు" అంటూ తనకు కష్టాలు ఉన్నాయి కాబట్టి జనాలు గెలిపించి తీరాల్సిందే అన్నట్టుగా చెప్పాడు. 


Read Also : Sravanthi Chokarapu : స్రవంతికి పేటీఎం బ్యాచ్ బెదిరింపులు - రివర్స్‌లో సెటైరికల్‌గా ఇచ్చిపడేసిన యాంకర్



ఈ మైండ్ గేమ్ బెడిసికొట్టబోతోందా ? 
ఏదైనా లిమిట్ దాటితే అనవసరమైన చిక్కులు తెచ్చిపెడుతుంది. మణికంఠ విషయంలో కూడా అదే జరుగుతుంది. ఓవైపు ముద్దులు, హగ్గులు అంటూ షాక్ ఇస్తూనే మరోవైపు అవసరమైన చోటల్లా సింపతి కార్డు వాడుతున్నాడు. ఆయన గేమ్ ఆడుతున్న తీరు చూస్తుంటే పక్కాగా ప్లాన్ చేసుకొని, ఎప్పుడు ఏ కార్డు వాడాలో ఆలోచించి చేస్తున్నట్టుగా అనిపిస్తోంది. నాగ మణికంఠ ముందే చెప్పాడు కనీసం హౌస్ లో ఐదు వారాలైన ఉండకపోతే తన వాళ్ళు తనకు దక్కరని. అంటే టైటిల్ కొట్టి, డబ్బు తెస్తేనే భార్య పిల్లలు దగ్గరకు వస్తారా అనే సెటైర్లు వినిపిస్తున్నాయి నాగ మణికంఠపై. ఇక మణికంఠ ఇదే కంటిన్యూ చేస్తే ఆయన ఆటలు ఎక్కువ కాలం కొనసాగక పోవచ్చు. ఏదేమైనా బిగ్ బాస్ హౌస్ లఓ నాగ మణికంఠను అతని భార్యతో కలిపేదాక బయటకు అయితే పంపించడు. కానీ అతని మైండ్ గేమ్, మాట మాటకి "గేమ్ గెలవకపోతే నా భార్య, పిల్లలు దక్కరు" అనే సింపతి కార్డు ప్లే చేయడం జనాలకు విసుగు పుట్టించడం ఖాయం.


Read Also : Bigg Boss 8 Telugu Episode 18 Day 17: అక్కడ టచ్ చేశాడంటూ నబిల్‌తో విష్ణు ప్రియ, మణికంఠని ఎత్తి అవతలపాడేసిన నిఖిల్