కొరియన్ సింగర్స్‌కు ఇండియాలో విపరీతమైన పాపులారిటీ ఉంది. కే పాప్ పాటలు అర్థం అవ్వకపోయినా.. వాటినే వింటూ చిల్ అయ్యే ఇండియన్ మ్యూజిక్ లవర్స్ చాలామంది ఉన్నారు. అలాంటి ఒక కొరియన్ పాప్ సింగర్‌ బిగ్ బాస్ కంటెస్టెంట్ అయితే.. వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదా. ప్రస్తుతం హిందీలో బిగ్ బాస్ సీజన్ 17 నడుస్తుండగా.. అందులోకి ఒక కొరియన్ పాప్ సింగర్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సందర్భంగా అతడు బాలీవుడ్ పార్టీ సెన్సేషన్ ఓర్రీ గురించి మాట్లాడడం ఆశ్చర్యం కలిగించింది.


ఓర్రీ తెలుసు..
ఓర్హాన్ అవత్రమని అలియాస్ ఓర్రీ లేకుండా బాలీవుడ్‌లో ఒక్క పార్టీ కూడా జరగదు. ఇక బిగ్ బాస్ 17లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఎంటర్ అయిన కొరియన్ పాప్ సింగర్ ఔరా కూడా ఓర్రీ గురించే మాట్లాడగా.. ఓర్రీ పాపులారిటీ ఏంటో అర్థమవుతోంది. ఒక ప్రముఖ బాలీవుడ్ మీడియాతో జరిగిన ఇంటర్వ్యూలో ఓర్రీ గురించి మాట్లాడాడు ఔరా. ‘‘నాకు ఓర్రీ తెలుసు. ఓర్రీ రోజూ పార్టీ చేసుకుంటాడు. నాకు కూడా వెళ్లి తనతో పార్టీ చేసుకోవాలని ఉంటుంది’’ అన్నాడు. మీకు ఓర్రీని కలవాలని ఉందా అని అడిగిన ప్రశ్నకు మాత్రం లేదని సమాధానం ఇచ్చాడు. ఓర్రీ అంటే కొరియన్ భాషలో డక్ అని డక్స్ చాలా టేస్టీగా ఉంటాయని.. అంటే ఓర్రీ కూడా టేస్టీగా ఉంటాడని చెప్పుకొచ్చాడు ఔరా.


ఎన్నిరోజులో..?
ఇప్పటికే ఓర్రీ కూడా బిగ్ బాస్ 17లో ఒక కంటెస్టెంట్‌గా వస్తున్నట్టు సల్మాన్ ఖాన్ ప్రకటించాడు. దానికి సంబంధించిన ప్రోమో కూడా సెన్సేషన్ సృష్టించగా.. అది కేవలం రెండురోజుల వరకే అని అర్థమయ్యింది. ఇక ఔరా విషయంలో కూడా అదే జరగనుందేమో అని ప్రేక్షకులు భావిస్తున్నారు. ఎన్నిరోజులు ఉంటాడో తెలియదు. హౌజ్‌లో కంటెస్టెంట్స్ అందరూ హిందీలో మాట్లాడితే.. ఔరాకు అసలు అర్థమవుతుందా, తను మాట్లాడే మాటలు మనకు అర్థమవుతాయా అని ప్రేక్షకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అతడు హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చే ముందు.. ఇదే విషయాన్ని సల్మాన్ కూడా అడిగాడు.


కొరియన్ నేర్పిస్తాను..
‘‘నేను హిందీ వినడానికి ప్రయత్నిస్తాను. నేనే అందరికీ కొరియన్ నేర్పిస్తాను. నాకు కొంచెం హిందీ వచ్చు. నేను సింపుల్ హిందీ మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ నేను ఇప్పుడు బిగ్ బాస్‌లోకి వెళ్తున్నాను. నా ధైర్యమే నాకు హిందీ రాకపోవడం. నేను చాలా ఎమోషనల్.. పైగా నాకు భాష రాదు కాబట్టి అందరికీ దూరంగా ఉంటానేమో. అందరినీ సంతోషపెట్టడమే నా సింపుల్ లక్ష్యం’’ అని ఔరా చెప్పుకొచ్చాడు. ఔరా స్టేజ్‌పై చెప్పిన ఈ నాలుగు మాటలను అర్థం చేసుకోవడానికి సల్మాన్‌కు మాత్రమే కాదు.. ప్రేక్షకులకు కూడా కష్టంగా అనిపించింది. మరి ఇలాంటి ఒక కొరియన్ పాప్ సింగర్.. బిగ్ బాస్ హౌజ్‌లోని కంటెస్టెంట్స్‌ను భరించగలడో లేదో చూడాలి. 


Also Read: నా తల్లిదండ్రులు అలా అన్నారు - ‘యానిమల్’లోని ఇంటిమేట్ సీన్స్‌కు పేరెంట్స్ రియాక్షన్ బయటపెట్టిన బోల్డ్ బ్యూటీ తృప్తి