Telugu Bigg Boss 7: బిగ్ బాస్ సీజన్ 7 ఫైనల్‌కు ఒక్కవారమే ఉంది. ఇక ఈ వారంలో చివరి ఎలిమినేషన్ కూడా ముగిసిపోయింది. బిగ్ బాస్ సీజన్ 7లోని చివరి ఎలిమినేషన్‌లో శోభా శెట్టి.. హౌజ్‌ను వదిలి వెళ్లిపోయింది. శోభా అంటే క్షోభ అని ఫీల్ అయ్యే ఆడియన్స్ చాలామందే ఉన్నా కూడా తను మాత్రం బిగ్ బాస్‌లో 14 వారాలు ఉండగలిగింది. దానికి బిగ్ బాసే స్వయంగా తనకు ఫేవర్ చేస్తున్నారన్న రూమర్స్ కూడా వినిపించాయి. ఇక ఫైనల్‌గా ఫైనల్స్‌కు వెళ్లకుండానే శోభా ఇంటికి వెళ్లిపోయింది. వెళ్లే ముందు బిగ్ బాస్ హౌజ్‌లో తన జర్నీని చూసి ఏడ్చేసింది. ఆ తర్వాత బిగ్ బాస్ బజ్‌లో పాల్గొంది.


అర్జున్‌కు ధైర్యం చెప్పిన శోభా..
సండే ఎపిసోడ్‌లో ఫైనల్‌కు వెళ్లే కంటెస్టెంట్స్‌ను ఒక్కొక్కరిగా రివీల్ చేశాడు నాగార్జున. ఫినాలే అస్త్రాను సాధించుకున్న అర్జున్.. ఇప్పటికే ఫైనల్స్‌లో తన స్థానాన్ని ఖరారు చేసుకున్నాడు. ఆ తర్వాత ప్రియాంకను సెకండ్ ఫైనలిస్ట్‌గా ప్రకటించారు. ప్రియాంక తర్వాత వరుసగా అమర్‌దీప్, యావర్, పల్లవి ప్రశాంత్ కూడా ఫైనల్‌కు వెళ్లిపోయినట్టు తెలిపారు. చివరిగా శోభా, శివాజీ డేంజర్ జోన్‌లో ఉండగా.. వారిద్దరితో ఒక గేమ్ ఆడించారు. అది ముగిసిన తర్వాత శోభా శెట్టి ఎలిమినేట్ అని ప్రకటించారు. వెళ్లిపోయి ముందు ప్రియాంకను బాగా ఆడమని చెప్తూ ఏడ్చింది శోభా. అర్జున్ లీస్ట్‌లో ఉన్నందుకు ఫీల్ అవుతున్నాడని, బయటికి వెళ్లిన తర్వాత నా ఓట్లన్నీ నీకే అని ధైర్యం చెప్పింది. అమర్ కప్ కొట్టే బయటికి రావాలని ప్రోత్సహించింది. ఇక శివాజీతో కూడా తాను ఏమైనా తప్పుగా మాట్లాడి ఉంటే, తప్పుగా ప్రవర్తించి ఉంటే సారీ అని చెప్పింది. యావర్‌కు ఎక్కువగా అపార్థాలు చేసుకునే అలవాటు ఉందని, కానీ గత కొన్నివారాల్లో మారాడని.. తన గురించి పాజిటివ్‌గా మాట్లాడింది.


తేజ కోసం రాలేదు..
బిగ్ బాస్ స్టేజ్‌పై నుంచి వెళ్లిపోయిన తర్వాత బజ్‌లో పాల్గొంది శోభా. ఇక హౌజ్‌లో ఎలా అయితే తనలోని విలన్ షేడ్స్‌ను బయటపెట్టిందో.. బజ్‌లో కూడా అలాగే ప్రవర్తించింది. ముందుగా ‘‘టాప్ 10 టాస్కులో 7వ స్థానాన్ని ఇస్తే మీరు ఒప్పుకోలేదు. కానీ ఇప్పుడు ఆడియన్సే కూడా అదే స్థానాన్ని ఇచ్చారు’’ అని గుర్తుచేసింది గీతూ. ‘‘అలా మీరు అనుకుంటే నేనేం చేయలేను’’ అని సమాధానమిచ్చింది శోభా. ‘‘తేజా, మీరు నిజాయితీగా ఉన్నారని అని చెప్పారు కదా. తేజ వెళ్లిపోయిన తర్వాత ఈరోజు వరకు మళ్లీ తేజను తలచుకోలేదు’’ అని ప్రశ్నించింది గీతూ. ‘‘తేజ కోసం నేను బిగ్ బాస్ హౌజ్‌కు రాలేదు కదా’’ అని సూటిగా చెప్పేసింది శోభా. ‘‘ఒక టాస్కులో ప్రియాంక వల్లే ఓడిపోయాను అన్న ఫీలింగ్ ఉంది మీకు’’ అని అడిగింది గీతూ. ‘‘మా ఇద్దరి మధ్య అలాంటి డిస్కషనే రాలేదు’’ అని క్లారిటీ ఇచ్చింది శోభా. ‘‘ప్రియాంక ఫీల్ అయ్యిందో లేదో.. నేను మీకు చూపిస్తా చూస్తారా’’ అని అడగగా.. ‘‘బిగ్ బాస్ జర్నీ నా లైఫ్‌లో అయిపోయింది’’ అని తేల్చిచెప్పింది శోభా. ‘‘బిగ్ బాస్ జర్నీ ఇంకా అవ్వలేదు. ఈ బజ్ తర్వాత అవుతుంది’’ అని క్లారిటీ ఇచ్చింది గీతూ. దానికి కాదు అన్నట్టుగా తలూపింది శోభా.


‘‘అమర్ విన్నర్ అవ్వాలని అనుకుంటున్నారు కదా. అమర్ మీ గురించి ఏమనుకుంటున్నారో ఒక వీడియో చూద్దాం’’ అని చెప్పి ఒక వీడియో చూపించగా.. అందులో అమర్.. శోభాకు ‘‘వెనుక మాట్లాడుతుంది’’ అనే ట్యాగ్ ఇచ్చాడు. అది చూసి శోభా సైతం షాక్ అయ్యింది. ఆ తర్వాత శివాజీ ఫోటో చూపించి ‘‘బిగ్ బాస్ హౌజ్‌లో ముందుకు వెళ్లాలంటే శివాజీ ఉపయోగిస్తున్న స్ట్రాటజీతో ఆడితే విన్నర్ అయిపోవచ్చు’’ అని స్టేట్‌మెంట్ ఇచ్చింది. ‘‘సేఫ్ శోభా శెట్టి’’ అనే ట్యాగ్ ఇవ్వగా తాను కూడా ఒప్పుకుంటున్నానని వ్యంగ్యంగా చెప్పింది శోభా. ‘‘ఒక ప్రశ్నకు మీ దగ్గర సమాధానం లేకపోతే సింపుల్‌గా తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా అని దాన్ని కవర్ చేసేస్తున్నారు’’ అని గీతూ చెప్పింది. ఆ మాట శోభాకు నచ్చక షూటింగ్ ఆపేయమని చెప్పింది. దీంతో బిగ్ బాస్ హౌజ్ నుంచి బయటికి వచ్చిన తర్వాత కూడా శోభా ఏమీ మారలేదని ప్రేక్షకులు అనుకుంటున్నారు. 



Also Read: సొంతంగా నిర్మాణ సంస్థ ప్రారంభించిన సమంత - తనకు నచ్చిన పాట పేరుతో!